రాజమౌళి చిత్రంలో హాలీవుడ్‌ హీరో... అందులో నిజమెంత? | Chris Hems Worth Appearance in Mahesh Babu and SS Rajamouli film | Sakshi
Sakshi News home page

SS Rajamouli Film: రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో థోర్‌ ఫేమ్.. సోషల్ మీడియాలో వైరల్

Published Sun, Sep 25 2022 3:26 PM | Last Updated on Sun, Sep 25 2022 6:49 PM

Chris Hems Worth Appearance in Mahesh Babu and SS Rajamouli’s film - Sakshi

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌  సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి ఓ స్టార్ యాక్టర్‌ను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మూవీ అవెంజర్స్​ థోర్​ ఫేమ్ హీరో​ క్రిస్ హెమ్స్ వర్త్‌ను తీసుకోబోతున్నట్లు సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  

(చదవండి: హాలీవుడ్ సంస్థతో రాజమౌళి కీలక ఒప్పందం.. అందుకేనా?)

ఇటీవల జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన రాజమౌళి ​ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' ఆధారంగా యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఉంటుందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరికొందరు హాలీవుడ్ స్టార్స్ కూడా మహేష్ బాబు సినిమాలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఇటీవలే ప్రముఖ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ సీఏఏ (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం చేసుకోవడం ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌లో క్రిస్ హేమ్స్‌వర్త్ ఎంట్రీపై మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement