రజనీ ఐరన్‌మేన్‌.. సల్మాన్‌ హల్క్‌ | Avengers Endgame director Joe Russo would choose Rajinikanth for the role of Iron Man | Sakshi
Sakshi News home page

రజనీ ఐరన్‌మేన్‌.. సల్మాన్‌ హల్క్‌

Published Sun, Apr 7 2019 3:34 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 AM

Avengers Endgame director Joe Russo would choose Rajinikanth for the role of Iron Man - Sakshi

.. పాత్రలకు బాగా సెట్‌ అవుతారని అభిప్రాయపడ్డారు ‘అవెంజర్స్‌’ దర్శకుడు జోయి రుస్సో. ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో వస్తున్న చివరి చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’. ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 26న రిలీజ్‌ కానుంది. ‘ఇన్ఫినిటీ వార్‌’ కేవలం ఇండియాలోనే సుమారు 200 కోట్లుపైగా వసూలు చేసింది.

‘ఎండ్‌ గేమ్‌’ ప్రమోషన్స్‌ కోసం ఇండియా వచ్చిన దర్శకుడు జోయి రుస్సో ఇండియన్‌ సినిమాల గురించి మాట్లాడుతూ – ‘‘కొన్నాళ్లుగా ‘అవెంజర్స్‌’ సినిమాలతోనే స్పెండ్‌ చేస్తున్నాను. ప్రపంచ సినిమా చూసే తీరక కూడా లేదు. ‘అవెంజర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్స్‌’ చిత్రంలో ఓ యాక్షన్‌ సన్నివేశానికి రజనీకాంత్‌ నటించిన ‘యందిరన్‌’ (రోబో) క్లైమాక్స్‌ స్ఫూర్తినిచ్చింది’’ అన్నారు. మరి అవెంజర్స్‌ పాత్రల్లో రజనీకాంత్‌ను, సల్మాన్‌ఖాన్‌ను నటింపజేయాలనుకుంటే ఏ పాత్రలు వాళ్లకు సూట్‌ అవుతాయి అనే ప్రశ్న ఆయన ముందుంచితే– ‘‘రజనీ ఐరన్‌మేన్, సల్మాన్‌ హల్క్‌ పాత్రల్లో బావుంటారు’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement