సల్మాన్‌ వర్సెస్‌ జాన్‌ | Salman Khan Radhe And John Abraham Satyamev Jayate 2 To Release May 13 | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ వర్సెస్‌ జాన్‌

Published Thu, Mar 18 2021 12:51 AM | Last Updated on Thu, Mar 18 2021 12:51 AM

Salman Khan Radhe And John Abraham Satyamev Jayate 2 To Release May 13 - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ రంజాన్‌ సందర్భంగా మే 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదే రోజు రావడానికి జాన్‌ అబ్రహామ్‌ రెడీ అయ్యారు. మూడేళ్ల క్రితం జాన్‌ అబ్రహామ్‌ హీరోగా మిలాప్‌ ఝవేరీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సత్యమేవ జయతే’. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘సత్యమేవ జయతే 2’ రంజాన్‌ రిలీజ్‌కి రెడీ అయింది. మే 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో జాన్‌ అబ్రహామ్‌ రెండు పాత్రలు చేశారు. సినిమాలో జాన్‌ వర్సెస్‌ జాన్‌ అయితే బాక్సాఫీస్‌ దగ్గర సల్మాన్‌ ఖాన్‌ వర్సెస్‌ జాన్‌ అనాలి.

రంజాన్‌ సల్మాన్‌కి కలిసొచ్చే పండగ. ఈ సీజన్‌లో విడుదలైన సల్మాన్‌ సినిమాలు ‘దబాంగ్‌’, ‘బాడీగార్డ్‌’, ‘కిక్‌’, ‘బజరంగీ భాయీజాన్‌’, ‘సుల్తాన్‌’ వంటివి రికార్డ్‌ స్థాయి వసూళ్లు సాధించాయి. ‘రాధే’ కూడా ఈ హిట్‌ లిస్ట్‌లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘సత్యమేవ జయతే 2’ని కూడా తక్కువ చేయడానికి లేదు. తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సినిమాలూ హిట్టవ్వాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక అభిమానులంటారా? తమ అభిమాన హీరో సినిమానే హిట్టవ్వాలని కోరుకోవడం సహజం. ఏది ఏమైనా ‘సల్మాన్‌ వర్సెస్‌ జాన్‌’ అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement