3 పాత్రల్లో సల్మాన్‌ ఖాన్‌.. 10 మంది హీరోయిన్లు ! | 10 Heroines In Salman Khan Triple Role Movie No Entry 2 | Sakshi
Sakshi News home page

Salman Khan: 3 పాత్రల్లో సల్మాన్‌ ఖాన్‌.. 10 మంది హీరోయిన్లు !

Published Sun, Jan 9 2022 8:32 PM | Last Updated on Sun, Jan 9 2022 10:02 PM

10 Heroines In Salman Khan Triple Role Movie No Entry 2 - Sakshi

10 Heroines In Salman Khan Triple Role Movie No Entry 2: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ సల్మాన్‌ ఖాన్‌ గతేడాది డిసెంబర్‌ 27న పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను చేసే వరుస సినిమాలను ప్రకటించాడు. అందులో 'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌తోపాటు 'నో ఎంట్రీ' సీక్వెల్‌ చేయనున్నట్లు తెలిపాడు సల్లూ భాయ్‌. 2005లో విడుదలైన నో ఎంట్రీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సల్మాన్‌తోపాటు అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'నో ఎంట్రీ 2' సినిమాకు కూడా ఇదే తారాగణంతో అనీస్‌ బజ్మీ డైరెక్ట్‌ చేయనున్నాడు. 



ఇదీ చదవండి: సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌.. సిక్స్‌ ప్యాక్‌ ఫేక్ అని ట్రోలింగ్‌

అయితే ఈ సినిమాలో ఏకంగా 10 మంది హీరోయిన్లు యాక్ట్ చేయనున్నారట. సల్మాన్ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్ ముగ్గురు మూడు పాత్రల్లో నటించనున్నారని సమాచారం. అంటే మొత్తంగా 9 పాత్రల్లో సందడి చేయనున్నారు. అందుకే ఈ 9 పాత్రలకు తగినట్లుగా 9 మంది హీరోయిన్లు అలరించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో 10వ కథానాయికకు కీలక పాత్ర పోషించనుందట. ఆ పాత్రకు పాపులర్‌ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో డైసీ షా హీరోయిన్‌గా చేస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఒకరు చెప్పినట్లు సమాచారం. 



ఇదీ చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ప్రశంసలు..

'కబీ ఈద్ కబీ దివాళీ' సినిమా షూటింగ్‌ తర్వాత 'నో ఎంట్రీ 2' చిత్రీకరణను ప్రారంభించనున్నాడు సల్మాన్‌. సినిమాలో మూడు పాత్రలు ఉండటంతో సల్మాన్‌ అధికంగా డేట్స్‌ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్లూ భాయ్‌ 'టైగర్‌ 3'లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఢిల్లీ షెడ్యూల్‌ చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాగానే మెగాస్టార్‌ చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో అతిథిపాత్రలో అలరించనున్నాడు సల్మాన్‌ ఖాన్‌. 



ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్‌ ఖాన్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement