Anees Bazmee
-
10 ఏళ్ల తర్వాత రిలీజవుతోన్న స్టార్ హీరో మూవీ
షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కొన్నుంటాయి. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'నామ్' మూవీ కూడా పై జాబితాలోకే వస్తుంది. ఈ సినిమా ఇప్పటిది కాదు.. ఏకంగా దశాబ్ధం క్రితం నాటిది! అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూంగ్ట ఎంటర్టైన్మెంట్, స్నిగ్ధ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ రూంగ్ట నిర్మించాడు.దశాబ్దం తర్వాత రిలీజ్భూమిక చావ్లా, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 22న విడుదల కానున్నట్లు వెల్లడించారు. అజయ్-అజ్మీర్ డైరెక్షన్లో ఇది నాలుగో సినిమా.. గతంలో వీరి కాంబినేషన్లో హల్చల్, ప్యార్ తో హోనా హై, దీవాంగె (2002) సినిమాలు వచ్చాయి.ఇద్దరివి మూడు సినిమాలు!నామ్ మూవీ షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ నిర్మాతల్లో ఒకరు మరణించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు దొరకలేదు. ఇన్నాళ్లకు చిక్కుముడులన్నీ విడిపోవడంతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నామ్ చిత్రయూనిట్ పేర్కొంది. ఇకపోతే అజయ్ 'సింగం అగైన్', బజ్మీ 'భూల్ భులయ్యా 3' సినిమాలు నవంబర్ 1న రిలీజ్ కానుండటం గమనార్హం.చదవండి: ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి -
3 పాత్రల్లో సల్మాన్ ఖాన్.. 10 మంది హీరోయిన్లు !
10 Heroines In Salman Khan Triple Role Movie No Entry 2: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ గతేడాది డిసెంబర్ 27న పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను చేసే వరుస సినిమాలను ప్రకటించాడు. అందులో 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్‌తోపాటు 'నో ఎంట్రీ' సీక్వెల్ చేయనున్నట్లు తెలిపాడు సల్లూ భాయ్. 2005లో విడుదలైన నో ఎంట్రీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. సల్మాన్‌తోపాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'నో ఎంట్రీ 2' సినిమాకు కూడా ఇదే తారాగణంతో అనీస్ బజ్మీ డైరెక్ట్ చేయనున్నాడు. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ అయితే ఈ సినిమాలో ఏకంగా 10 మంది హీరోయిన్లు యాక్ట్ చేయనున్నారట. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ ముగ్గురు మూడు పాత్రల్లో నటించనున్నారని సమాచారం. అంటే మొత్తంగా 9 పాత్రల్లో సందడి చేయనున్నారు. అందుకే ఈ 9 పాత్రలకు తగినట్లుగా 9 మంది హీరోయిన్లు అలరించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో 10వ కథానాయికకు కీలక పాత్ర పోషించనుందట. ఆ పాత్రకు పాపులర్ హీరోయిన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ సినిమాలో డైసీ షా హీరోయిన్గా చేస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఒకరు చెప్పినట్లు సమాచారం. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ప్రశంసలు.. 'కబీ ఈద్ కబీ దివాళీ' సినిమా షూటింగ్ తర్వాత 'నో ఎంట్రీ 2' చిత్రీకరణను ప్రారంభించనున్నాడు సల్మాన్. సినిమాలో మూడు పాత్రలు ఉండటంతో సల్మాన్ అధికంగా డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్లూ భాయ్ 'టైగర్ 3'లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఢిల్లీ షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాగానే మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో అతిథిపాత్రలో అలరించనున్నాడు సల్మాన్ ఖాన్. ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్.. -
హిందీలోకి దూకుడు
మహేశ్‌బాబు కెరీర్లో భారీ హిట్స్‌లో ‘దూకుడు’ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, పాగల్ పంతీ’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనీజ్ బజ్మీ ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తారని సమాచారం. -
బాలీవుడ్‌కి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దిల్’ రాజు ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి హిందీలో రీమేక్ చేయనున్నారు ‘దిల్’ రాజు. తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’ గా హిందీలో తెరకెక్కించి, విజయం సాధించిన అనీస్ బజ్మీ ‘ఎఫ్ 2’కి దర్శకత్వం వహిస్తారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ∙‘దిల్’ రాజు ∙బోనీకపూర్ -
జోడీ కుదిరిందా?
ఈ ఏడాది ‘సత్యమేవ జయతే’ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం మంచి ఫామ్‌లో ఉన్నట్లున్నారు. ఇటీవల ‘రోమియో అక్బర్ వాల్టర్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన అబ్రహాం తాజాగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇందులో ఇలియానాను కథానాయికగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే నిజమైతే కెరీర్లో తొలిసారి జాన్‌తో జోడీ కట్టనున్నారు ఇలియానా. అలాగే ఈ స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాకు మరో హీరో అవసరం ఉందట. ఇందుకోసం సంజయ్‌దత్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. మరి..ఫైనలైజ్ అయ్యారా? లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి ‘పాగల్పాంటీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. జాన్ అబ్రహాం నటించిన ‘బట్లా హౌస్’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్లో లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్ హీరోలుగా రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఇలియానా పేరు తెరపైకి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. -
దర్శకుల జోలికి వెళ్లను
అటు దర్శకత్వం.. ఇటు నిర్మాణం.. రెండింట్లోనూ విపుల్ షా మొనగాడే! ఇతడు దర్శకత్వం వహిస్తే పూర్తిగా దానిపైనే దృష్టి సారిస్తాడు. నిర్మాతగా మారితే దర్శకుల జోలికి కూడా వెళ్లడు. ‘సినిమాకు నిర్మాతగా ఉంటే, దానికి దర్శకుడిగానూ మారాలని నేను అనుకోను. నాతో పనిచేసిన దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా.. ఈయన నా మెదడు తింటున్నాడనో.. మా పనుల్లో వేలుపెడుతున్నాడనో ఫిర్యాదు చేయలేదు. నిర్మాతగా నా పని విభిన్నమైనది. దర్శకుడు సినిమాకు తల్లి వంటివాడు. దానిని అతడే సృష్టిస్తాడు. నిర్మాత తండ్రిలాగా షోను నడిపిస్తాడు. ఈ రెండూ నాకు ఇష్టమైనవే’ అని చెప్పిన విపుల్ నమస్తే లండన్, వఖ్త్ సినిమాలకు నిర్మాత, దర్శకుడిగానూ వ్యవహరించాడు. సింగ్ ఈజ్ కింగ్, ఫోర్స్ సినిమాలు నిర్మించాడు. వీటికి అనీస్ బాజ్మీ, నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అయితే నిర్మాతకు కృతజ‘త చూపించే వాళ్లే ఉండబోరని విపుల్ అంటాడు. కెమెరా ముందు కనిపించేవాళ్లే అందరికీ కావాలని, తెర వెనుక శ్రమించే వాళ్లకు ప్రాధాన్యం ఉండదని చెప్పాడు. ‘సినిమాకు నేను ఏం చేస్తానో యూనిట్ సభ్యులకే తెలుస్తుంది. వాళ్లు సంతోషంగా ఉన్నంత వరకు నిర్మాతగా నేను విజయం సాధించినట్టే. వాళ్ల ప్రశంసలు నాకు సరిపోతాయి’ అని అన్నాడు. విశేషమేమంటే మనోడు దర్శకత్వం వహించిన వాటిలో లండన్డ్రీమ్స్ మినహా అన్నింట్లోనూ అక్షయ్‌కుమార్ హీరో. అంతేకాడు తాజాగా ఇతడు తీస్తున్న హాలీడేలోనూ అక్షయ్ కథానాయకుడు. ఇతనితో తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయి కాబట్టే ఇద్దరి మధ్య అనుబంధం పెరిగిందని విపుల్ షా చెప్పాడు. ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహించిన హాలీడే శుక్రవారం విడుదలవుతోంది. దీంట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్గా అలరిస్తుంది. -
బాలీవుడ్‌కు బ్రహ్మానందం
బ్రహ్మానందం పేరు వినగానే యధాలాపంగా నవ్వు వచ్చేస్తుంది. తెర ఆయన కనిపించగానే ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు.సమకాలిన తెలుగు సినిమాల్లో హాస్యానికి చిరునామా ఆయన. 850పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ రికార్డు కెక్కిన హాస్యనటుడాయన. తెలుగు తెరపై తానెంటో నిరూపించుకున్న ఈ నవ్వుల బ్రహ్మ త్వరలో ఓ హిందీ సినిమాలో నటించనున్నారు. బాలీవుడ్లో 2007లో విడుదల ఘన విజయం సాధించిన వెల్కమ్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రంలో నటించేందుకు బ్రహ్మానందం అంగీకరించారు. దర్శకుడు అనీజ్ బాజ్మి తన కోసం ప్రత్యేక పాత్ర తయారు చేశారని, ఇందులో నటించేందుకు తాను ఒప్పుకున్నానని బ్రహ్మానందం వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశముందని చెప్పారు. అనిల్ కపూర్, నానా పటేకర్, జాన్ అబ్రహంతో కలిసి ఆయన నటించనున్నారు. అయితే బ్రహ్మానందం ఇంతకుముందు హిందీలో అమితాబ్ బచ్చన్‌తో నటించారు. 1999లో వచ్చిన 'సూర్యవంశ్' చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్లో అడుగుపెట్టారు. మలి ప్రయత్నంలో ఆయనెంతవరకు మెప్పిస్తారో చూడాలి.