![Ileana may be cast opposite John Abraham in Anees Bazmee's next movie - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/12/john.jpg.webp?itok=JaDNA1Or)
జాన్ అబ్రహాం, ఇలియానా
ఈ ఏడాది ‘సత్యమేవ జయతే’ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం మంచి ఫామ్‌లో ఉన్నట్లున్నారు. ఇటీవల ‘రోమియో అక్బర్ వాల్టర్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన అబ్రహాం తాజాగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇందులో ఇలియానాను కథానాయికగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే నిజమైతే కెరీర్‌లో తొలిసారి జాన్‌తో జోడీ కట్టనున్నారు ఇలియానా.
అలాగే ఈ స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాకు మరో హీరో అవసరం ఉందట. ఇందుకోసం సంజయ్‌దత్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. మరి..ఫైనలైజ్ అయ్యారా? లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి ‘పాగల్‌పాంటీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. జాన్ అబ్రహాం నటించిన ‘బట్లా హౌస్’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్‌లో లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్ హీరోలుగా రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఇలియానా పేరు తెరపైకి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment