లండన్‌ కాలింగ్‌ | Kriti Kharbanda joins John Abraham in Pagalpanti | Sakshi

లండన్‌ కాలింగ్‌

Jan 11 2019 12:13 AM | Updated on Jan 11 2019 12:13 AM

Kriti Kharbanda joins John Abraham in Pagalpanti - Sakshi

కృతీ కర్భందా

ఈ నెల చివర్లో కొత్త సినిమా కోసం లండన్‌ వెళ్లడానికి జాన్‌ అబ్రహాం ప్లాన్‌ చేశారు. ఇందుకోసం ఇలియానా కూడా సై అన్నారు. కానీ వీరి లండన్‌ ట్రిప్‌ నెక్ట్స్‌ మంత్‌కి వాయిదా పడింది. ఈ లోపు ఈ టీమ్‌తో కలిశారు కృతీ కర్భందా. ‘నో ఎంట్రీ, వెల్‌కమ్‌’ చిత్రాల ఫేమ్‌ అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో జాన్‌ అబ్రహాం హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పాగల్‌ పంతి’ అనే టైటిల్‌ పెట్టారు. ఇందులో ఒక కథానాయికగా ఆల్రెడీ ఇలియానాను తీసుకున్నారు.

ఇప్పుడు రెండో హీరోయిన్‌గా కృతీ కర్భందాను టీమ్‌ సెలక్ట్‌ చేశారు. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా ప్యాచ్‌ వర్క్‌తో బిజీగా ఉన్నారు కన్నడ భామ కృతీ కర్భంద. ఇది కంప్లీట్‌ కాగానే కొత్త సినిమా కోసం జాన్, ఇలియానాతో కలిసి కృతీ లండన్‌కి వెళతారు. తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కృతి ‘బ్రూస్‌లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్‌కే పరిమితమైన కృతి ఇప్పుడు నార్త్‌పై కూడా దృష్టి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement