
ఇలియానా
‘‘ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చాలెంజ్‌లాంటిదే. యాక్టర్ నుంచి వాళ్లు ఊహించినది కాకుండా విభిన్నమైనది వస్తే ఆశ్చర్యపడతారు. అది బావుంటే కచ్చితంగా ఆదరిస్తారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలన్నదే నటిగా నా లక్ష్యం’’ అన్నారు ఇలియానా. ‘పాగల్‌పంతి’ అనే మల్టీస్టారర్ కామెడీతో ఈ నెల 22న థియేటర్స్‌లోకి రాబోతున్నారామె. జాన్ అబ్రహామ్, అనిల్ కపూర్, ఇలియానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఇలియానా ఫుల్ కామెడీ పండించబోతున్నారట. వినోదం చేయడం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘ముబారకన్’ సినిమాలో ఫస్ట్‌టైమ్ పూర్తిస్థాయి కామెడీ ట్రై చేశాను. నా గురించి ఆలోచించినప్పుడు ప్రేక్షకులకు కామెడీ మైండ్‌లోకి రాదు. ‘ఆ సినిమాలో మీ పాత్ర చూసి ఆశ్చర్యపోయాం’ అని చాలా మంది అన్నారు. అలా ఆశ్చర్యపరచడం చాలా కష్టం. దానికోసం ఎలాంటి క్రేజీ పాత్ర అయినా చేయాలనుకుంటాను’’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment