
అనిల్ కపూర్, ఇలియానా
పేరు వైఫై భాయ్. ఇతని నెట్‌వర్క్ టవర్ నుంచి కాదు... అతని పవర్‌తో నడుస్తుందట. ఈ పవర్ సిగ్నల్స్‌కి ముందుగా రాజ్ కిషోర్, సంజనలు స్పందిస్తారు. మరి.. తన పవర్‌తో వైఫై భాయ్ ఏమేం పనులు చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఇలియానా, జాన్ అబ్రహాం, అర్షద్ వార్షి ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్ పంతీ’. పుల్‌కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, ఊర్వశీ రౌతేలా, సౌరభ్ శుక్లా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల లుక్స్‌ను విడుదల చేశారు. వైఫై భాయ్ పాత్రలో అనిల్ కపూర్, సంజన పాత్రలో ఇలియానా, రాజ్ కిషోర్ పాత్రలో జాన్ అబ్రహాం కనిపిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 22న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment