స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Apr 19 2019 12:35 AM | Last Updated on Fri, Apr 19 2019 12:35 AM

tollywood movies special screen test - Sakshi

1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. అదే టైటిల్‌తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్‌ టైటిల్‌ రిపీట్‌ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్‌...

1. 1957లో రిలీజైన ‘మాయాబజార్‌’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్‌’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు?
ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్‌

2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్‌హిట్‌ లవ్‌ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్‌ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్‌. కమెడియన్‌ శ్రీనివాస్‌రెడ్డి లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ ప్రాత పోషించిన హీరోయిన్‌ ఎవరో గుర్తుందా?
ఎ) ‘కలర్స్‌’ స్వాతి బి) నందితారాజ్‌ సి) అంజలి డి) తేజస్వి మడివాడ

3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్‌ ‘దేవదాస్‌’ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి?
ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా

4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్‌ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా?
ఎ) రానా బి) రవితేజ సి) రామ్‌  డి) కల్యాణ్‌ రామ్‌

5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్‌ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటించిందెవరో తెలుసా?
ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి

6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్‌హిట్‌. అదే పేరుతో 2009లో కమల్‌ హాసన్‌ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్‌గా నటించారు. ఎవరా హీరో?
ఎ) నాగార్జున బి) వెంకటేశ్‌ సి) రాజశేఖర్‌ డి) చిరంజీవి

7. 1979లో వచ్చిన యన్టీఆర్‌ ‘వేటగాడు’ సూపర్‌ హిట్‌. అదే టైటిల్‌తో 1995లో రాజశేఖర్‌ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్‌హిట్‌ క్లబ్‌ సాంగ్‌లో యన్టీఆర్‌తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్‌ పేరేంటి?
ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం

8. కె.విశ్వనాథ్‌ కెరీర్‌లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు?
ఎ) నితిన్‌ బి) నవదీప్‌ సి) సిద్ధార్థ్‌  డి) నిఖిల్‌

9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్‌హిట్‌.  పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా?
ఎ) కౌసల్య        బి) శ్రేయా గోషల్‌  సి) మల్గాడి శుభ  డి) ఎస్పీ శైలజ

10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు?
ఎ) రాహుల్‌ రవీంద్రన్‌  బి) నవీన్‌ చంద్ర సి) సుశాంత్‌  డి) సుమంత్‌

11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్‌ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటించిన నటి ఎవరో తెలుసా?
ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా  సి) తాప్సీ డి) పూర్ణ

12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్‌ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా నటించిందెవరో గుర్తుందా?
ఎ) ఆమని     బి) మీనా    సి) సౌందర్య     డి) రోజా

13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్‌ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా?
ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ

14. కమల్‌హాసన్‌ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) ఊర్మిళ మటోండ్కర్‌ బి) ఆంత్రమాలి  సి) నిషాకొఠారి డి) మధుషాలిని

15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన క్లాసికల్‌ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా?
ఎ) సిమ్రాన్‌ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ

16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్‌తో  సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) కమల్‌ హాసన్‌ బి) సురేశ్‌ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్‌ డి) అర్జున్‌

17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్‌ రోల్‌ చేసిన నటి ఎవరు?
ఎ) కత్రినాకైఫ్‌     బి) టబు      సి) అంజలా జవేరి     డి) ప్రీతి జింతా

18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్‌గా బి.ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్‌ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్‌తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు?
ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక

19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్‌హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్‌’ రాజు అదే టైటిల్‌తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా?
ఎ) ఆర్య బి) భరత్‌ సి) ప్రిన్స్‌ డి) వరుణ్‌ సందేశ్‌

20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి?
ఎ) యన్టీఆర్‌ బి) శోభన్‌బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి
12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి


నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement