స్క్రీన్‌ టెస్ట్‌ | Tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Apr 5 2019 5:59 AM | Last Updated on Fri, Apr 5 2019 5:59 AM

Tollywood movies special screen test - Sakshi

అబ్బాయి అవ్వగా మారాలా? ఏ అవకరం లేని వ్యక్తి అవిటివాడిగా కనిపించాలా? మంచి అందగాడు గూని ఉన్న వ్యక్తిగా అగుపించాలా? సిల్వర్‌ స్క్రీన్‌పై స్లిమ్‌గా కనిపించాల్సిన హీరోయిన్‌ బొద్దుగా కనిపించాలా? తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కలరింగ్‌ ఇవ్వాలా? సినిమాకి ఏదైనా సాధ్యమే. ఇప్పటివరకూ అలా విభిన్న పాత్రల్లో కనిపించిన కొందరు స్టార్స్‌తో ఈ వారం స్పెషల్‌.

1. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించిన సంచలన చిత్రం ‘విచిత్ర సోదరులు’. ఆ చిత్రంలోని ఓ పాత్రలో మరుగుజ్జుగా నటించారు కమల్‌. అలా మరుగుజ్జుగా కనపడటానికి ఆయనకు ఎన్నో నెంబర్‌ షూ వాడారో తెలుసా? (అవి స్పెషల్‌గా తయారు చేశారు. ఆ షూ సైజు ప్రపంచంలో ఎక్కడా దొరకదు
ఎ) 10     బి) 18     సి) 12    డి) 14

2. ‘కలిసి ఉంటే కలదు సుఖం’లో యన్టీఆర్‌ అవిటివాడిగా నటించారు. తాపి చాణక్య దర్శకత్వం  వహించిన ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఘంటసాల       బి) రాజన్‌ నాగేంద్ర  సి) మాస్టర్‌ వేణు     డి) ఎస్‌. రాజేశ్వరరావు

3. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘లడ్డూబాబు’. దోమకాటు వల్ల అతని శరీర బరువు 50 కిలోలు పెరిగిపోతుంది. రవిబాబు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నరేశ్‌ సరసన నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) పూర్ణ                బి) ఫర్జానా  సి) ఈషా రెబ్బా     డి) భూమికాచావ్లా

4. ఇప్పటివరకూ దాదాపు గ్లామరస్‌ రోల్స్‌లో కనిపించిన నయనతార ఏ చిత్రంలో నల్లని మేకప్‌తో కనిపించారో చెప్పుకోండి?
ఎ) ఐరా బి) రాజా–రాణి సి) మాయ డి) డోరా

5. రామ్‌చరణ్‌ పల్లెటూరి అమాయకునిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఆ చిత్రంలో ఆయన సౌండ్‌ ఇంజనీర్‌ (చెవిటివానిగా)లాగా నటించి మెప్పిం చారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రామ్‌చరణ్‌ అన్న పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుందా?
ఎ) సందీప్‌ కిషన్‌        బి) అరుణ్‌ విజయ్‌  సి) నందు                   డి) ఆది పినిశెట్టి

6. శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘పదహారేళ్ల వయసు’. ఆ చిత్రంలో హీరో వికలాంగుడు. తెలుగులో ఆ పాత్రను చంద్రమోహన్‌ చేశారు. అదే పాత్రను తమిళంలో ఎవరు చేశారో తెలుసా?
ఎ) కమల్‌హాసన్‌     బి) రజనీకాంత్‌   సి) పార్తిబన్‌            డి) శరత్‌కుమార్‌

7. వైవిధ్యమైన పాత్రలు చేసే విక్రమ్‌ ‘కాశి’ చిత్రంలో గుడ్డివానిగా, ‘శివపుత్రుడు’ చిత్రంలో మతి స్థిమితం లేని వ్యక్తిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ‘ఐ’ చిత్రంలో గూనివానిగా మారి కురూపిగా కనిపించారు. ఆ కురూపి పాత్ర కోసం ఆయన ఎన్ని కిలోల బరువు తగ్గారో తెలుసా? (ఆ టైమ్‌లో ఆయన బరువు 49 కిలోలు)
ఎ) 45    బి) 25    సి) 35    డి) 42

8. ‘ప్రేమిస్తే’ చిత్రవిజయంతో ఆ చిత్రకథానాయకుడు భరత్‌ ‘ప్రేమిస్తే’ భరత్‌గా మారారు. ఆ చిత్రంలో అతను పిచ్చివానిగా చేసిన పాత్రతో మంచి నటునిగా పేరు సంపాదించాడు. ఆ సినిమాలోని ‘జన్మ నీదేలే, మరుజన్మ నీదేలే జతను విడిచావో, చితికి పోతాలే’ అనే సూపర్‌హిట్‌  పాట రచయిత ఎవరో కనుక్కోండి?
ఎ) అనంత శ్రీరామ్‌        బి) వెన్నెలకంటి  సి) వేటూరి      డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

9. సావిత్రి నిజజీవిత పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఆ చిత్రంలోని 1980ల నాటి జర్నలిస్ట్‌ పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తున్నారా?  ఆ చిత్రంలో ఆమె నత్తి పాత్రలో నటించారు. ఎవరామె?
ఎ) కీర్తీ సురేశ్‌ బి) అంజలి  సి) సమంత డి) త్రిష

10. నాని కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’. అందులో మతిమరుపు పాత్రలో నాని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు . ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) లావణ్యా త్రిపాఠి  బి) అనుపమా పరమేశ్వరన్‌ సి) సాయిపల్లవి        డి) నివేదా థామస్‌

11. శుభ్రంగా ఉండాలి, కానీ అతి శుభ్రం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. ఇదే కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రంలో హీరో   ఎవరో కనుక్కోండి?
ఎ) విజయ్‌ దేవరకొండ బి) శర్వానంద్‌ సి) నాని    డి) మంచు విష్ణు

12. హీరో బాలకృష్ణ కురూపిగా నటించిన చిత్రం ‘భైరవద్వీపం’. ఆ చిత్రంలోని ఆయన నటనకు చాలా మంచి పేరొచ్చింది. ఆ చిత్రదర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) దాసరి నారాయణరావు   బి) కోడి రామకృష్ణ  సి) సింగీతం శ్రీనివాసరావు  డి) రవిరాజా పినిశెట్టి

13 వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయన తీసిన మూడో సినిమాలో హీరో పూర్తిగా అంధుడు. ఆ పాత్రలో నటించిన హీరో ఎవరు?
ఎ) వెంకటేశ్‌  బి) రవితేజ  సి) కళ్యాణ్‌రామ్‌  డి) సాయిధరమ్‌ తేజ్‌

14. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా’ అని ‘ప్రేమించు’ చిత్రంలో హీరోయిన్‌ లయ పాడుతుంది. లయ ఆ చిత్రంలో అంధురాలిగా నటించింది. ఆ పాట చాలా పెద్ద హిట్‌. ఆ పాటకు సంగీతాన్ని అందించిందెవరో తెలుసా?
ఎ) కల్యాణీ మాలిక్‌      బి) యం.యం. శ్రీలేఖ  సి) కోటి                     డి) రాజ్‌

15. బాలీవుడ్‌ చిత్రం ‘బర్ఫీ’లో హీరో రణ్‌బీర్‌ కపూర్‌ చెవిటి, మూగ. ఆ సినిమాలోని హీరోయిన్‌ మతి స్థిమితం లేని పాత్రలో నటించారు. ఆ హీరోయిన్‌ పేరేంటి?
ఎ) అనుష్కా శర్మ          బి) ఇలియానా  సి) కంగనా రనౌత్‌       డి) ప్రియాంకా చోప్రా

16. శోభన్‌బాబుకి ఆంధ్రుల అందగాడు అని పేరు. కానీ ‘చెల్లెలి కాపురం’ సినిమాలో శోభన్‌బాబు అంద విహీనమైన పాత్రలో కనిపిస్తారు. ఆ సినిమా పెద్ద హిట్‌. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా?
ఎ) వి. మధుసూదన్‌ రావు     బి) కె. విశ్వనాథ్‌  సి) ఆదుర్తి సుబ్బారావు          డి) పి.సి. రెడ్డి

17. హీరో సూర్య వెరైటీ పాత్రలకు పెట్టింది పేరు. ఆయన నటించిన ఓ చిత్రంలో ఏ విషయాన్నైనా ఎక్కువసేపు గుర్తు పెట్టుకోలేడు. అందుకే ఏ విషయాన్నైనా తన కెమెరాలో ఫొటో తీసుకొని గుర్తు పెట్టుకుంటాడు. ఆ చిత్రంలో నయనతార ఓ హీరోయిన్‌ కాగా మరో హీరోయిన్‌ ఎవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) తమన్నా  బి) జ్యోతిక  సి) సదా  డి) ఆసిన్‌

18. హీరో రాజేంద్రప్రసాద్‌ ఓ చిత్రంలో ఎత్తు పళ్లతో, సోడా బుడ్డి అద్దాలు పెట్టుకుని అంద వికారమైన పాత్రలో నటించారు. ఈ సినిమా పేరేంటో తెలుసా?
ఎ) సుందరాంగుడు      బి) అందగాడు  సి) మాయలోడు  డి) కొబ్బరిబోండం

19. తమిళ దర్శకడు బాల దర్శకత్వం వహించే సినిమాల్లోని హీరోలు రెగ్యులర్‌ హీరోల్లా ఉండరు. ఆయన ప్రతి సినిమాలో హీరోల్ని రకరకాలుగా ప్రెజెంట్‌ చేస్తారు. ఓ చిత్రంలో హీరో సినిమా అంతా మెల్ల కన్నుతో ఉండేట్లు చేశారు. ఆ సినిమా పేరు ‘వాడు–వీడు’. మెల్ల కన్ను పాత్రలో చేసిన ఆ హీరో ఎవరు?
ఎ) ఆర్య   బి) విశాల్‌  సి) కార్తీ   డి) విక్రమ్‌

20. చిరంజీవి హీరోగా నటించిన ‘ఆపద్భాందవుడు’ చిత్రంలో హీరోయిన్‌కి పిచ్చెక్కుతుంది. ఆమె మెంటల్‌ హాస్పిటల్‌లో ఉందని అక్కడికి వెళ్లడానికి చిరంజీవి కూడా పిచ్చివాడిగా నటిస్తాడు. పిచ్చి అమ్మాయిగా నటించిన ఆ బాలీవుడ్‌ భామ ఎవరు?
ఎ) మీనాక్షీ శేషాద్రి  బి) సోనాలీ బింద్రే  సి) సమీరా రెడ్డి  డి) నగ్మా

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) బి 2) సి 3) డి 4) ఎ 5) డి 6) ఎ 7) బి 8) సి 9) సి 10) ఎ 11) బి
12) సి 13) బి 14)బి 15) డి 16) బి 17) డి 18) బి 19) బి 20) ఎ


నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement