Nanditha Raj
-
మధ్య తరగతి అమ్మాయి కథ
రాజకిరణ్ సినిమా పతాకంపై ఫణి తిరుమల శెట్టి సమర్పిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. ’గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు ఆమెను వేధిస్తాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించిన ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నందితా రాజ్ చేశారు. ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రానా, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా లవ్ థ్రిల్లర్ జానర్లో సినిమా రూపొందింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
స్క్రీన్ టెస్ట్
1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. అదే టైటిల్‌తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్ టైటిల్ రిపీట్ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్... 1. 1957లో రిలీజైన ‘మాయాబజార్’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్ 2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్. కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్రాత పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) నందితారాజ్ సి) అంజలి డి) తేజస్వి మడివాడ 3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్ ‘దేవదాస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా 4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) రానా బి) రవితేజ సి) రామ్ డి) కల్యాణ్ రామ్ 5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిందెవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి 6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్‌హిట్. అదే పేరుతో 2009లో కమల్ హాసన్ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్‌గా నటించారు. ఎవరా హీరో? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రాజశేఖర్ డి) చిరంజీవి 7. 1979లో వచ్చిన యన్టీఆర్ ‘వేటగాడు’ సూపర్ హిట్. అదే టైటిల్‌తో 1995లో రాజశేఖర్ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్‌హిట్ క్లబ్ సాంగ్‌లో యన్టీఆర్‌తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్ పేరేంటి? ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం 8. కె.విశ్వనాథ్ కెరీర్‌లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఎ) నితిన్ బి) నవదీప్ సి) సిద్ధార్థ్ డి) నిఖిల్ 9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్‌హిట్. పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) శ్రేయా గోషల్ సి) మల్గాడి శుభ డి) ఎస్పీ శైలజ 10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) నవీన్ చంద్ర సి) సుశాంత్ డి) సుమంత్ 11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా సి) తాప్సీ డి) పూర్ణ 12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) ఆమని బి) మీనా సి) సౌందర్య డి) రోజా 13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ 14. కమల్‌హాసన్ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) ఆంత్రమాలి సి) నిషాకొఠారి డి) మధుషాలిని 15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్లాసికల్ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ 16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్‌తో సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) కమల్ హాసన్ బి) సురేశ్ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్ డి) అర్జున్ 17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్ రోల్‌ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్ రోల్ చేసిన నటి ఎవరు? ఎ) కత్రినాకైఫ్ బి) టబు సి) అంజలా జవేరి డి) ప్రీతి జింతా 18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్‌తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక 19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్‌హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్’ రాజు అదే టైటిల్‌తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ఆర్య బి) భరత్ సి) ప్రిన్స్ డి) వరుణ్ సందేశ్ 20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) యన్టీఆర్ బి) శోభన్‌బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఊహకు అందని విషయాలతో...
అందరూ మనవాళ్లే అనుకునే మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమెకు అనుకోకుండా ఓ కష్టం వచ్చింది. ఆమెకు సహాయంగా ఓ అజ్ఞాత వ్యక్తి నిలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సస్పెన్స్ వీడాలంటే మా ‘విశ్వామిత్ర’ సినిమా చూడాలంటున్నారు దర్శకుడు రాజకిరణ్. నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్ జంటగా రాజకిరణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మించారు. ఈ సినిమాను మేలో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా రాజకిరణ్ మాట్లాడుతూ – ‘‘మనిషి ఆలోచనలకు అందని చాలా విషయాలు సృష్టిలో జరుగుతాయి. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులం ఉండేది కొంతకాలమే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది’’ అని అన్నారు. జీవా, రాకెట్ రాఘవ, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీ కృష్ణ ఆకెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
సృష్టిలో ఏదైనా సాధ్యమే
‘‘గీతాంజలి, త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 21న, సినిమాని మార్చి 21న విడుదల చేయనున్నారు. రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజిలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి, ఈ కథ రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో చెప్పడానికి మనుషులు ఎవరు? ఇక్కడ ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా సినిమా. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తెరకెక్కించాం’’ అన్నారు. విద్యుల్లేఖారామన్, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, ‘చమ్మక్’ చంద్ర, ‘గెటప్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
కథ చెబుతానంటే ఎవరూ వినలేదు
రాజకిరణ్ సినిమా పతాకంపై రాజకిర ణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందితారాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇందులో యాడ్ చేశాం. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలామంది నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాను. వినటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం చేసి నేనే రాజకిరణ్ సినిమా అనే బ్యానర్‌ను పెట్టాను. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అన్నీ సెట్ అయ్యాయి. ఇది హారర్ సినిమా కాదు కానీ హారర్ టచ్ ఉంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. నందితారాజ్ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. దర్శకుడు నాకు చెప్పింది చెప్పినట్లు తీశారు. అశుతోష్ రాణాగారితో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకిరణ్ రెండేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు, మంచి హిట్ పాయింట్ అని చెప్పాను. ఓ రోజు ఆయన ఫోన్ ‘మీరే మెయిన్ లీడ్’ అన్నారు. రాజేశ్ మెయిన్ లీడ్ ఏంటి? కొందరు అన్నారు. కానీ మా నిర్మాతలు హిట్ సినిమా తీయటమే ధ్యేయంగా నిర్మించారు’’ అన్నారు. విద్యుల్లేఖా రామన్ మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’ చిత్రం నుంచి నేను రాజకిరణ్ గారికి ఫ్యాన్. ఈ సినిమాలో రాజేశ్‌తో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్ భండారి, ఎడిటర్: ఉపేంద్ర. -
థ్రిల్లర్ లవ్‌స్టోరీ
నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్, విద్యుల్లేఖా రామన్ ముఖ్య తారలుగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన నటుడు అశుతోష్ రాణా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమాలో నేను పొసెసివ్ భర్త పాత్రలో నటిస్తున్నాను. రాజ్‌కిరణ్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. సినిమా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హారర్, కామెడీ జానర్ సినిమాలకు నాంది పలికిన రాజ్‌కిరణ్‌గారి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు బీవీఎస్ రవి. ‘‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జానర్లదే హవా. యూఎస్, స్విట్జర్లాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి సిట్టింగ్‌లోనే సినిమా ఓకే చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ‘సత్యం’ రాజేశ్‌ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్స్‌ను సంప్రదించినప్పుడు ‘సత్యం’ రాజేశ్ హీరో అని చెప్పగానే కొందరు డ్రాప్ అయ్యారు. సినిమాలో నటించడానికి ఒప్పుకున్న నందితా రాజ్‌కు థ్యాంక్స్. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నర క్రితం రాజ్‌కిరణ్‌గారు ఓ పాయింట్ చెప్పారు. బాగుంది. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. అశుతోష్ రాణాగారు, మల్లికగారు, మాధవిగారు నాకన్నా ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇదొక థ్రిల్లర్ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు తెలుగులో రాని కథాంశంతో రూపొందిస్తున్నాం’’ అన్నారు మాధవి. -
నా ఇష్టమైన హీరో ...
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా వాసుల అభిమానం, ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు హీరోరుున్ నందిత. ఏలూరు పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా జరుగుతున్న సావిత్రి సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ బుధవారం ముగిసింది. దెందులూరు రైల్వేస్టేషన్ వద్ద సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న ఆమెను పలకరించగా.. ప్రశ్న : మీరు ఎన్ని సినిమాల్లో నటించారు. జవాబు : 7 సినిమాలు పూర్తిచేశాను. ప్రశ్న : ఏ చిత్రంతో గుర్తింపు వచ్చింది జవాబు : ప్రేమకథాచిత్రం నటిగా గుర్తింపు, పేరు తీసుకువచ్చింది. ప్రశ్న : ఇష్టమైన హీరో జవాబు : మహేష్‌బాబు ప్రశ్న : విడుదలకు సిద్ధమైన సినిమా జవాబు : వచ్చే నెల 4న నిఖిల్‌తో చేసిన శంకరాభరణం విడుదలకు సిద్ధమైంది ప్రశ్న : మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా జవాబు : కథాబలం ఉన్న పాత్రలకు గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఇటువంటి పాత్రలలో నటించే అవకాశం వస్తే మల్టీస్టారర్ అయినా వెనుకాడను. ప్రశ్న : మీ లక్ష్యం జవాబు :మంచి నటిగా రాణించడం ప్రశ్న : ఈ ప్రాంత ప్రజల సహకరాం ఎలా ఉంది జవాబు : కోస్తా జిల్లాల ప్రజలు ఎంతో మంచి వారు. షూటింగ్ సమయంలో బాగా సహకరించారు. వీరి అభిమానం, ఆత్మీయత ఎన్నటికీ మరువలేను. -
‘రామ్‌లీల’ ఆడియో ఆవిష్కరణ
-
లవ్ ఇన్ లండన్ మూవీ న్యూ స్టిల్స్