నా ఇష్టమైన హీరో ... | I AM Mahesh Babu Fan, says Nanditha Raj | Sakshi
Sakshi News home page

నా ఇష్టమైన హీరో ...

Published Thu, Nov 26 2015 10:42 AM | Last Updated on Sun, Jul 14 2019 1:42 PM

నా ఇష్టమైన హీరో ... - Sakshi

నా ఇష్టమైన హీరో ...

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా వాసుల అభిమానం, ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు హీరోరుున్ నందిత. ఏలూరు పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా జరుగుతున్న సావిత్రి సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ బుధవారం ముగిసింది. దెందులూరు రైల్వేస్టేషన్ వద్ద సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న ఆమెను  పలకరించగా..
 
ప్రశ్న : మీరు ఎన్ని సినిమాల్లో నటించారు.
జవాబు : 7 సినిమాలు పూర్తిచేశాను.
 
ప్రశ్న : ఏ చిత్రంతో గుర్తింపు వచ్చింది
జవాబు : ప్రేమకథాచిత్రం నటిగా గుర్తింపు, పేరు తీసుకువచ్చింది.
 
ప్రశ్న : ఇష్టమైన హీరో
జవాబు : మహేష్‌బాబు
 
ప్రశ్న : విడుదలకు సిద్ధమైన సినిమా
జవాబు : వచ్చే నెల 4న నిఖిల్‌తో చేసిన శంకరాభరణం విడుదలకు సిద్ధమైంది
 
ప్రశ్న : మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా
జవాబు : కథాబలం ఉన్న పాత్రలకు గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఇటువంటి పాత్రలలో నటించే అవకాశం వస్తే మల్టీస్టారర్ అయినా వెనుకాడను.
 
ప్రశ్న : మీ లక్ష్యం
జవాబు :మంచి నటిగా రాణించడం
 
 ప్రశ్న : ఈ ప్రాంత ప్రజల సహకరాం ఎలా ఉంది
 జవాబు : కోస్తా జిల్లాల ప్రజలు ఎంతో మంచి వారు. షూటింగ్ సమయంలో బాగా సహకరించారు. వీరి అభిమానం, ఆత్మీయత ఎన్నటికీ మరువలేను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement