ఊహకు అందని విషయాలతో... | Vishwamitra released on may | Sakshi
Sakshi News home page

ఊహకు అందని విషయాలతో...

Published Sun, Apr 14 2019 12:37 AM | Last Updated on Sun, Apr 14 2019 12:37 AM

Vishwamitra released on may - Sakshi

నందితా రాజ్

అందరూ మనవాళ్లే అనుకునే మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి. ఆమెకు అనుకోకుండా ఓ కష్టం వచ్చింది. ఆమెకు సహాయంగా ఓ అజ్ఞాత వ్యక్తి నిలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సస్పెన్స్‌ వీడాలంటే మా ‘విశ్వామిత్ర’ సినిమా చూడాలంటున్నారు దర్శకుడు రాజకిరణ్‌. నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్‌ జంటగా రాజకిరణ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్‌  ఎస్, రాజకిరణ్‌ నిర్మించారు.

ఈ సినిమాను మేలో రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ సందర్భంగా రాజకిరణ్‌ మాట్లాడుతూ – ‘‘మనిషి ఆలోచనలకు అందని చాలా విషయాలు సృష్టిలో జరుగుతాయి. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులం ఉండేది కొంతకాలమే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది’’ అని అన్నారు. జీవా, రాకెట్‌ రాఘవ, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీ కృష్ణ ఆకెళ్ల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement