Vishwamitra
-
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు -
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
కర్తవ్యమ్
మామూలుగా సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలని ఉంటాయి. ఈ దేశానికున్న గొప్పతనం ఏమిటంటే... ‘పతివ్రతా ధర్మం’ అని ఒక ధర్మం ఉంది. దానితో స్త్రీలు ఏ పురుషుడికీ అందనంత పైస్థాయికి చేరుకున్నారు. ఆ మాటకు అర్థం – పతి లోటుపాట్లతోకానీ, ఆయనకున్న గుణ విశేషాలతో కానీ ఆమెకు సంబంధం ఉండదు. ఆమె భర్తను పరదైవంగా భావించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ పోతుంది. మనం ముందే చెప్పుకున్నట్లు అవతలివారి వలన ఇవతలి వారి ధర్మం మారదు. నేను ఒక ప్రదేశంలో ప్రవచనం చేస్తున్నాను. మీకు అర్థం అయ్యేటట్లు మాట్లాడితే దానిని ప్రవచనం అంటారు. ప్రవచనం చేసేటప్పుడు నా బుద్ధికి తోచిన విషయాన్ని నేనెప్పుడూ చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. అనవసరమైన విషయాన్ని కానీ, నేనిలా అనుకుంటున్నానని కానీ ఎప్పుడూ ప్రతిపాదన చేయకూడదు. అదే నేను వేదిక దిగి వెళ్ళిపోయాననుకోండి. నా భార్య ఎదురుగా నిలబడితే నా భర్తృ ధర్మం. నా కుమారుడి ముందు నిలుచుంటే పితృధర్మం. నేను పట్టణంలో నిలబడితే పౌర ధర్మం. నేనెక్కడ నిలబడ్డాను, ఎవరి ముందు నిలబడ్డాను...అన్న దానినిబట్టి ధర్మం నిరంతరం మారిపోతుంటుంది.మారుతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి తప్ప అవతలివాడు అలా ఉంటాడు కాబట్టి నేనిలా ఉంటాననకూడదు. అప్పుడు అది ధర్మం కాదు. ధర్మం ‘కర్తవ్యమ్’ రూపంలో ఉంటుంది. ఆర్ష వాఙ్మయాన్ని పరిశీలిస్తే బాధ్యత అన్న మాట కనపడదు. ‘కర్తవ్యమ్’–అనే మాటే కనిపిస్తుంది. అందుకే రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్ర లేపితే..‘‘కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్’ అంటాడు. కర్తవ్యం అంటే ఏమిటి? సూర్యోదయమవుతోంది. అంతకన్నా ముందే విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేసాడు, అర్ఘ్యమిచ్చాడు. రామలక్ష్మణులిద్దరూ నిద్రపోతున్నారు. నిద్రలేపేటప్పుడు ఎప్పుడూ భగవత్ సంబంధం చెప్పి నిద్రలేపాలి తప్ప ఇంకొకలా నిద్రలేపకూడదు. అందుకే ...‘‘అదుగో సూర్యోదయమవుతోంది, రామా! లక్ష్మణా ! లేచి సంధ్యావందనం చేయండి.కర్తవ్యమ్ దైవమాహ్నికమ్... అది మీరు చేయవలసినది, నేను చెప్పవలసినది. అక్కడితో నా కర్తవ్యం పూర్తయింది. ఒకవేళ వారు నిద్రలేవలేదనుకోండి. మరో మారు గుర్తుచేస్తాడు, జీవితాంతం అలా గుర్తు చేస్తూనే ఉంటాడు తప్ప కించిత్ బాధపడడు. రాముడు చేస్తే పొంగిపోడు, చేయలేదని కుంగిపోడు... చెప్పవలసినది చెప్పాడు. అంతవరకే. తన కర్త్యవ్యాన్ని నెరవేర్చాడు.అలాగే నేను ప్రవచనం చేయాలి కాబట్టి చేస్తాను. ఎంతమంది వచ్చారన్న దానితో నిమిత్తం లేదు. ఒకడే వస్తే ఒకలా, పదివేలమంది వస్తే ఒకలా చెప్పకూడదు. ఎంతమంది వచ్చారన్న దానితో నాకు సంబంధం లేదు. ఎంతమంది వింటున్నారన్న దాన్నిబట్టి చెప్పాల్సి వస్తే... ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు ఒక్క రాముడికే చెప్పకూడదు, భగవద్గీతను ఒక్క అర్జునుడికే శ్రీ కృష్ణుడు చెప్పకూడదు, భాగవతాన్ని శుకబ్రహ్మ ఒక్క పరీక్షిత్తుకే చెప్పకూడదు. అంటే ధర్మ నిర్వహణ అవతలివారిని బట్టి ఉండదు. నేను నా ధర్మం చేసుకెళ్ళి పోతానంతే. ఇందులో రాగద్వేషాలుండవు.ఈ దేశంలో స్త్రీలు పరమాద్భుతమైన ఉపాసన చేసారు. ఆయనకున్న గుణ విశేషాలతో సంబంధం లేకుండా దైవస్వరూపమయిన భర్తను దైవంగానే భావించారు. ధర్మశాస్త్ర విశేషమేమిటంటే... పురుషుడు చేసిన పుణ్యంలో సగం భార్యకు వెడుతుంది. కానీ ఆమె చేసే పుణ్యంలో సగభాగం పురుషుడికివ్వరు. -
మధ్య తరగతి అమ్మాయి కథ
రాజకిరణ్ సినిమా పతాకంపై ఫణి తిరుమల శెట్టి సమర్పిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. ’గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు ఆమెను వేధిస్తాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించిన ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నందితా రాజ్ చేశారు. ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రానా, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా లవ్ థ్రిల్లర్ జానర్లో సినిమా రూపొందింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఊహకు అందని విషయాలతో...
అందరూ మనవాళ్లే అనుకునే మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమెకు అనుకోకుండా ఓ కష్టం వచ్చింది. ఆమెకు సహాయంగా ఓ అజ్ఞాత వ్యక్తి నిలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సస్పెన్స్ వీడాలంటే మా ‘విశ్వామిత్ర’ సినిమా చూడాలంటున్నారు దర్శకుడు రాజకిరణ్. నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్ జంటగా రాజకిరణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మించారు. ఈ సినిమాను మేలో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా రాజకిరణ్ మాట్లాడుతూ – ‘‘మనిషి ఆలోచనలకు అందని చాలా విషయాలు సృష్టిలో జరుగుతాయి. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులం ఉండేది కొంతకాలమే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది’’ అని అన్నారు. జీవా, రాకెట్ రాఘవ, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీ కృష్ణ ఆకెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు ‘విశ్వామిత్ర’
గీతాంజలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వామిత్ర’ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. గీతాంజలి, త్రిపుర వంటి హిట్ హారర్ థ్రిల్లర్స్ తర్వాత రాజకిరణ్ దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖ రామన్, ప్రసన్నకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజీలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. సృష్టిలో ఏది జరుగుతుందో... ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు రావడం సంతోషంగా ఉంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. -
సృష్టిలో ఏదైనా సాధ్యమే
‘‘గీతాంజలి, త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 21న, సినిమాని మార్చి 21న విడుదల చేయనున్నారు. రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజిలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి, ఈ కథ రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో చెప్పడానికి మనుషులు ఎవరు? ఇక్కడ ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా సినిమా. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తెరకెక్కించాం’’ అన్నారు. విద్యుల్లేఖారామన్, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, ‘చమ్మక్’ చంద్ర, ‘గెటప్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
సత్యనిష్ఠ
‘ఆడిన మాట తప్పని రాజులు ఎవరైనా ఉన్నారా?’ అని ఇంద్రసభలో ఒకసారి చర్చ వచ్చింది. భూలోకంలో హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడని వశిష్టుడు చెప్పాడు. వశిష్ట విశ్వామిత్రులకు మొదటినుంచి వైరం ఉంది. అందువల్ల హరిశ్చంద్రుడి చేత ఎలాగైనా అబద్ధం చెప్పించాలని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి వద్దకెళ్లి తాను ఒక బృహత్తర యాగం తలపెట్టాననీ, దానికి విశేషంగా ధనం కావాలన్నాడు. యాగ నిర్వహణకు ఎంత అవసరమైతే అంత ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. తనకు కావలసి వచ్చినప్పుడు వచ్చి ధనాన్ని తీసుకుంటానని విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు. ఒకసారి హరిశ్చంద్రుడి రాజ్యంలోని కొందరు ప్రజలు వచ్చి తమ పైర్లన్నిటినీ అడవిమృగాలు పాడుచేస్తున్నాయని చెప్పడంతో వాటిని సంహరించేందుకు అడవులకు వెళ్లాడు. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించేందుకు రకరకాల కుయుక్తులు, కుట్రలు పన్నిన విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను సృష్టించి, హరిశ్చంద్రుని వద్దకు పంపాడు. వారు ఆయన వద్దకొచ్చి తమను పెళ్లాడమని కోరారు. హరిశ్చంద్రుడు తిరస్కరించాడు. వారిని విశ్వామిత్రుడు వెంటబెట్టుకుని వెళ్లి వారిని పెళ్లి చేసుకోమని ఆదేశించాడు. ఏకపత్నీవ్రతాన్ని తప్పనన్నాడు హరిశ్చంద్రుడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు అతడు తన యాగానికి కావలసిన ధనాన్ని ఇస్తానన్న సంగతి గుర్తుచేసి, ఇప్పుడు అవసరమొచ్చింది, ఇమ్మన్నాడు. ఎంత ధనం ఇచ్చినా చాలదంటుండడంతో చేసేదేం లేక హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకు లోహితుణ్నీ తీసుకుని రాజ్యం విడిచి వెళ్లిపోయాడు. అదీ చాలదన్నాడు విశ్వామిత్రుడు. దాంతో కాశీనగరంలో చంద్రమతిని విక్రయించి, ఆ వచ్చిన ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చాడు. అది కూడా చాలదన్నాడాయన. దాంతో తానే స్వయంగా ఓ కాటికాపరికి అమ్ముడుపోయాడు. ఓ రాత్రివేళ హరిశ్చంద్రుడి కొడుకు లోహితుణ్ణి పాము కరవడంతో అతను మరణించాడు. చంద్రమతి కొడుకు దేహాన్ని కాటికి తీసుకువెళ్లింది. సుంకం చెల్లించమన్నాడు కాటికాపరి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయిందా ఇల్లాలు. ఆ మెడలోని మంగళసూత్రాలు అమ్మి చెల్లించమన్నాడు కాపరి. తన మాంగల్యం భర్తకు తప్ప ఇతరులెవరికీ కనపడదన్న వరం గల చంద్రమతి, ఆ కాటికాపరే తన భర్త హరిశ్చంద్రుడని గుర్తించింది. ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని దుఃఖపడ్డారు. సత్యధర్మాచరణలో భర్త అడుగుజాడల్లో నడిచే చంద్రమతి మంగళసూత్రాలు అమ్మి డబ్బు తెచ్చేందుకు నగరానికి వెళ్లింది. అర్ధరాత్రివేళ వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను భటులు రాజుగారి దగ్గరకు తీసుకు వెళితే ఆయన ముందు వెనకలు ఆలోచించకుండా ఉరిశిక్ష విధించాడు. భటులు ఆమె తలను నరికేందుకు తలారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తలారి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే! విధినిర్వహణలో భాగంగా కత్తి తీసి ఆమె మెడ మీద పెట్టాడు హరిశ్చంద్రుడు. అది పూలమాల అయింది. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై అతని సత్యనిష్ఠను కొనియాడారు. హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించలేకపోయానని ఒప్పుకుని అతని రాజ్యం అతనికి అప్పగించి ఆశీర్వదించి వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. మాటకు ప్రాణం సత్యమే. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడే గొప్పవాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
కథ చెబుతానంటే ఎవరూ వినలేదు
రాజకిరణ్ సినిమా పతాకంపై రాజకిర ణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందితారాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇందులో యాడ్ చేశాం. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలామంది నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాను. వినటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం చేసి నేనే రాజకిరణ్ సినిమా అనే బ్యానర్‌ను పెట్టాను. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అన్నీ సెట్ అయ్యాయి. ఇది హారర్ సినిమా కాదు కానీ హారర్ టచ్ ఉంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. నందితారాజ్ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. దర్శకుడు నాకు చెప్పింది చెప్పినట్లు తీశారు. అశుతోష్ రాణాగారితో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకిరణ్ రెండేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు, మంచి హిట్ పాయింట్ అని చెప్పాను. ఓ రోజు ఆయన ఫోన్ ‘మీరే మెయిన్ లీడ్’ అన్నారు. రాజేశ్ మెయిన్ లీడ్ ఏంటి? కొందరు అన్నారు. కానీ మా నిర్మాతలు హిట్ సినిమా తీయటమే ధ్యేయంగా నిర్మించారు’’ అన్నారు. విద్యుల్లేఖా రామన్ మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’ చిత్రం నుంచి నేను రాజకిరణ్ గారికి ఫ్యాన్. ఈ సినిమాలో రాజేశ్‌తో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్ భండారి, ఎడిటర్: ఉపేంద్ర. -
విశ్వామిత్ర టీజర్: నందిత మళ్లీ భయపెడుతుందా?
రాజ్‌కిరణ్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’ టీజర్ విడుదలైంది. నందితరాజ్, ప్రసన్నకుమార్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. యూఎస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని హారర్, థ్రిల్లర్ జానర్‌గా ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతోంది. ప్రేమకథా చిత్రంలో దెయ్యం ప్రాతలో అలరించిన నందిత మరి ఈ సినిమాలో కూడా భయపెట్టబోతోందా?, లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
థ్రిల్లర్ లవ్‌స్టోరీ
నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్, విద్యుల్లేఖా రామన్ ముఖ్య తారలుగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, ఎస్. రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన నటుడు అశుతోష్ రాణా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది. ఈ సినిమాలో నేను పొసెసివ్ భర్త పాత్రలో నటిస్తున్నాను. రాజ్‌కిరణ్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. సినిమా పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హారర్, కామెడీ జానర్ సినిమాలకు నాంది పలికిన రాజ్‌కిరణ్‌గారి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు బీవీఎస్ రవి. ‘‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జానర్లదే హవా. యూఎస్, స్విట్జర్లాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి సిట్టింగ్‌లోనే సినిమా ఓకే చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ‘సత్యం’ రాజేశ్‌ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్స్‌ను సంప్రదించినప్పుడు ‘సత్యం’ రాజేశ్ హీరో అని చెప్పగానే కొందరు డ్రాప్ అయ్యారు. సినిమాలో నటించడానికి ఒప్పుకున్న నందితా రాజ్‌కు థ్యాంక్స్. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నర క్రితం రాజ్‌కిరణ్‌గారు ఓ పాయింట్ చెప్పారు. బాగుంది. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. అశుతోష్ రాణాగారు, మల్లికగారు, మాధవిగారు నాకన్నా ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇదొక థ్రిల్లర్ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు తెలుగులో రాని కథాంశంతో రూపొందిస్తున్నాం’’ అన్నారు మాధవి. -
ఫుల్ థ్రిల్
‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజకిరణ్ తాజాగా ‘విశ్వామిత్ర’ పేరుతో మరో లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందిత లీడ్ రోల్ చేస్తున్నారు. మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలు. దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్ మెయింటైన్ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తున్నారు. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. నందిత ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌స్టేషన్ సీన్లను నటుడు ప్రసన్నపై చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి. -
విశ్వామిత్రుడి భంగపాటు
పురానీతి గాధి కొడుకైన విశ్వామిత్రుడు తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని తన బలసంపదతో అపారంగా విస్తరించాడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. దాంతో బలగర్వం పెరిగి, క్షాత్రబలాన్ని మించినది లేదనే భ్రమలో బతికేవాడు. రోజూ సభలో కొలువుదీరి వందిమాగధుల స్తోత్రపాఠాలు వింటూ పొద్దుపుచ్చేవాడు. ఇలా ఉండగా, విశ్వామిత్రుడికి ఒకనాడు వేటకు వెళ్లాలనే సరదా పుట్టింది. విశ్వామిత్రుడు, అతడి పరివారం ఆయుధాలు ధరించి వేట కోసం అరణ్యమార్గం పట్టారు. కీకారణ్యానికి చేరుకుని, పొద్దంతా వేట సాగించారు. పొద్దుగూకే వేళకు బాగా అలసట చెందారు. ఇక వేట చాలించి, ఆహారాన్వేషణలో పడ్డారు. కొంత దూరం ముందుకు వెళ్లగా, కొందరు ముని బాలకులు కట్టెలు, దర్భగడ్డి ఏరుకుంటూ కనిపించారు. అక్కడకు కనుచూపు మేరలోనే ఒక ఆశ్రమం కనిపించింది. విశ్వామిత్రుడు ఆ మునిబాలకుల దగ్గరకు వెళ్లి ‘అదిగో! అక్కడ కనిపిస్తున్న ఆశ్రమం ఎవరిది?’ అని అడిగాడు. ‘మహారాజా! అది మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమం. మేము ఆయన శిష్యులమే’ అని బదులిచ్చారు. శిష్యుల ద్వారా విశ్వామిత్రుడి రాక గురించి సమాచారం తెలుసుకున్న వశిష్ఠుడు వెంటనే విశ్వామిత్రుడికి ఎదురేగి, స్వాగతం పలికాడు. అర్ఘ్య పాద్యాదులిచ్చి సత్కరించాడు. వశిష్ఠుడి వద్ద నందిని అనే హోమధేనువు ఉండేది. కామధేనువులాంటి ఆ హోమధేనువు కోరినవన్నీ ఇచ్చేది. వేటలో అలసి సొలసిన విశ్వామిత్రుడికి, అతడి పరివారానికి హోమధేనువు మహిమతో పంచభక్ష్య పరమాన్నాలు తృప్తిగా వడ్డించాడు. నందిని మహిమను చూశాక విశ్వామిత్రుడికి వశిష్ఠుడి వైభోగంపై కన్ను కుట్టింది. కోరినదల్లా ఇచ్చే ఇలాంటి ధేనువు తన వద్ద ఉండాలే తప్ప ముక్కుమూసుకుని అడవుల్లో తపస్సు చేసుకునే వశిష్ఠుడి వంటి ముని వద్ద కాదని అనుకున్నాడు. నయాన అయినా భయాన అయినా వశిష్ఠుడి నుంచి నందినిని ఎలాగైనా దక్కించుకోవాలని కూడా అనుకున్నాడు. భోజనాదికాలు ముగిశాక విశ్వామిత్రుడు, అతడి పరివారం విశ్రమించారు. విశ్వామిత్రుడికి మాత్రం వశిష్ఠుడి హోమధేనువును ఎలా దక్కించుకోవాలా అనే ధ్యాసతో కునుకు పట్టలేదు. ఉదయాన్నే నిద్రలేచి, స్నాన సంధ్యలు ముగించుకున్న తర్వాత విశ్వామిత్రుడి పరివారం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. వీడ్కోలు పలకడానికి వచ్చిన వశిష్ఠుడిని నందినిని తనకు ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు. ‘మునివర్యా! అడవులలో తపస్సు చేసుకునే మీకు సంపదలనిచ్చే హోమధేనువు దేనికి? పాల కోసమే అయితే వేరేదైనా ధేనువును పెంచుకోవచ్చు కదా! దీనిని నాకు అప్పగిస్తే, దీని బదులు పాలిచ్చే లక్ష గోవులను నీకు ఇస్తా’ అని పలికాడు. ‘రాజా! దీని బదులు లక్ష గోవులు దేనికి? వాటిని నేనెలా మేపగలను? అయినా, ఇది పవిత్రమైన హోమధేనువు. దీనిని ఇతరులకు ఇవ్వతగదు’ అని వశిష్ఠుడు బదులిచ్చాడు. వశిష్ఠుడి సమాధానంతో విశ్వామిత్రుడికి చర్రున కోపం వచ్చింది. ‘మునివర్యా! నయాన ఇవ్వకుంటే, బలవంతంగానైనా నీ ధేనువును తీసుకుపోగలను. నువ్వు నన్నేమీ చేయలేవు’ అన్నాడు. నందినిని వెంట తీసుకు రమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు దానిని పట్టి తేవడానికి వెళ్లారు. ఉన్న చోటు నుంచి కదలడానికి నందిని మొరాయించింది. భటులు బలప్రయోగం చేశారు. ఆర్తనాదాలు చేస్తూ అది వశిష్ఠుడి వద్దకు వచ్చింది. ‘మునివర్యా! నన్ను ఈ దుర్మార్గులకు ఎందుకు ఇచ్చేస్తున్నావు?’ అని దీనంగా అడిగింది. వశిష్ఠుడు బదులు పలకలేదు. వశిష్ఠుడు తనను వారికి ఇవ్వలేదని నందినికి అర్థమైంది. విశ్వామిత్రుడి భటులు మళ్లీ దానిని బలవంతంగా లాక్కుపోవడానికి ప్రయత్నించారు. ఈసారి నందిని నిస్సహాయంగా ఆక్రందనలు చేయలేదు. క్రోధావేశంతో తోక ఝాడించి, కొమ్ములు ఝుళిపించింది. నందిని శరీరం నుంచి వేలాదిగా సాయుధ సైనికులు పుట్టుకొచ్చారు. ఒక్కుమ్మడిగా దాడి చేసి విశ్వామిత్రుడి సైనికులను తరిమి తరిమి కొట్టారు. క్షాత్రబలమే గొప్పదనే భ్రమలో ఉన్న విశ్వామిత్రుడికి కళ్లు తెరుచుకున్నాయి. తపోబలమే క్షాత్రబలం కంటే గొప్పదని గ్రహించాడు. తపోసాధనకు ఉపక్రమించాడు. -
జాతీయాలు
నక్షత్రకుడు! ‘నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’ ‘అబ్బో... అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు. నక్షత్రకుడు విశ్వామిత్రుడి శిష్యుడు. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును రాబట్టడానికి... హరిశ్చంద్రుడితో పాటు నీడలా వెళతాడు. హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో నడుస్తుంటే ‘నేను నడవలేను’ అని కూర్చునేవాడు. సరే అని కూర్చుంటే నిలబడేవాడు. ‘‘నేను నడవలేక పోతున్నాను నన్ను ఎత్తుకో’’ అనేవాడు. నీళ్లు దొరకని చోటు చూసి నీళ్లు కావాలి అని అడిగేవాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. రకరకాల సమస్యలతో బాధ పడే వారికి ఎవరైనా సరికొత్త సమస్యగా తయారైతే అలాంటి వ్యక్తిని నక్షత్రకుడితో పోల్చుతారు. గజ్జెలు కట్టిన కోడి! తమ సహజ అవలక్షణాలను మార్చుకోని వారి విషయంలో వాడే మాట ‘గజ్జెలు కట్టిన కోడి’. ‘కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించకుండా ఉంటుందా?’ అని అంటుంటారు. వెనకటికి ఒకాయన దగ్గర ఒక కోడి ఉండేది. ఆ కోడి తన సహజశైలిలో పెంటకుప్పల వెంట తిరిగేది. తన ముద్దుల కోడి ఇలా అసహ్యంగా పెంటకుప్పల మీద తిరగడం ఆ ఆసామికి నచ్చలేదు. దీంతో ఆ కోడిని బాగా అలంకరించి కాలికి గజ్జె కట్టాడు. ఈ అలంకారాలతో కోడి ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్మాడు. ఎంతగా అలంకరించినా కోడి మాత్రం తన సహజశైలిలో చెత్తకుప్పలు కుళ్లగించడం మానలేదు! శశ విషాణం అసాధ్యమైన పనులు లేదా వృథాప్రయత్నాల విషయంలో వాడే జాతీయం ‘శశ విషాణం’. ‘నువ్వు చెబుతున్న పని శశ విషాణం సాధించడంలాంటిది’. ‘శశ విషాణం కోసం ప్రయత్నించి విలువైన సమయాన్ని వృథా చేయకు’ ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. శశం అంటే కుందేలు. విషాణం అంటే కొమ్ము. కుందేలుకు పెద్ద చెవులే గానీ కొమ్ములు ఉండవు కదా! ఇలా లేని దాని కోసం ప్రయత్నించడం, అసాధ్యమైన వాటి గురించి ఆలోచించే విషయంలో ఉపయోగించే ప్రయోగమే శశ విషాణం. చగరుడాయ లెస్సా అంటే... శేషాయ లెస్సా అన్నట్లు! ఇద్దరూ సమ ఉజ్జీలైనప్పుడు పలకరింపుల్లో గానీ, పట్టుదల విషయంలో గానీ ఎవరికి వారు ‘నేనే గొప్ప’ అనుకుంటారు. ఈ ఇద్దరిలో ఒకరు చొరవ తీసుకొని మొదట పలకరిస్తే... రెండో వ్యక్తి అతిగా స్పందించడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ‘బాగున్నారా?’ అని మొదటి వ్యక్తి పలకరిస్తే- ‘బాగున్నాను. మీరు బాగున్నారా?’... అని రెండో వ్యక్తి సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతాడు. ఇంతకు మించి సంభాషణ ముందుకు సాగదు. గరుడుడు, శేషుడు... వీరిలో గొప్ప ఎవరు అంటే ఏమి చెప్పగలం? ఎవరికి వారే గొప్ప! ‘ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, పలకరించుకోవాలి కాబట్టి పలకరించుకున్నారు...’ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘‘వారి మాటల్లో పెద్ద విశేషాలేమీ లేవు. ఏదో... గరుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు పలకరించుకున్నారు’’ అంటుంటారు.