![Actress Nanditha Raj New Movie Vishwamitra - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/1/Viswamitra.jpg.webp?itok=XIx37HKB)
నందిత
‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్‌ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజకిరణ్ తాజాగా ‘విశ్వామిత్ర’ పేరుతో మరో లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందిత లీడ్ రోల్ చేస్తున్నారు. మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలు. దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం.
సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్ మెయింటైన్ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తున్నారు. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. నందిత ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌స్టేషన్ సీన్లను నటుడు ప్రసన్నపై చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి.
Comments
Please login to add a commentAdd a comment