
గీతాంజలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వామిత్ర’ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. గీతాంజలి, త్రిపుర వంటి హిట్ హారర్ థ్రిల్లర్స్ తర్వాత రాజకిరణ్ దర్శకత్వంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖ రామన్, ప్రసన్నకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజీలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. సృష్టిలో ఏది జరుగుతుందో... ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు రావడం సంతోషంగా ఉంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment