london tour
-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లండన్‌లో ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం లండన్ చేరుకొన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు లండన్‌కు బయలుదేరారు. శనివారం ఉదయం 5.15 గంటలకు లండన్‌లోని లూటన్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉండింది. అయితే పొగ మంచు కారణంగా వాతావరణం అనుకూలించక పోవటంతో సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. వాతావరణం చక్కబడిన అనంతరం ఆ విమానం తిరిగి లండన్ బయలుదేరింది. అందువల్ల నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ కుటుంబం లండన్ (లూకే) చేరుకుంది. అక్కడి లూటన్ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సీఎం జగన్‌ను చూడగానే జై జగన్ అంటూ అక్కడి వారు చేసిన నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. ఈ సందర్భంగా తనను కలిసిన వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా సభ్యులను, అభిమానులను సీఎం జగన్ పేరుపేరున పలకరించారు. మళ్లీ సీఎంగా జగనన్నే.. జూన్ 4వ తేదీన కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్ని ప్రపంచంలో తెలుగు వారంతా చూడబోతున్నారని వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతికుమార్ రెడ్డిలు ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మంచి చేసిన జగనన్న ప్రభుత్వాన్ని కొనసాగించుకునేందుకు పేదలు, మహిళలు, వృద్ధులు, సానుకూల ఓటింగ్‌తో తీర్పు ఇచ్చేశారని చెప్పారు. 2019లో సాధించిన స్థానాల కంటే అధిక స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చూసేందుకు ప్రపంచంలో తెలుగు సమాజం అంతా ఎదురు చూస్తోందన్నారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ యూకే కోర్ కమిటీ సభ్యులు చింతపంటి జనార్ధన్, గుర్రం చలపతి రావు, కిరణ్ ఇస్లావత్, వేలూరు సాయితేజ, పి.అశోక్ కుమార్, ముడియాల కుమార్ రెడ్డి, దేవరపల్లి చాళుక్య, కొరముట్ల పునీత్, మద్దాలి కుమారస్వామి తదితరులు ఉన్నారు. -
నేడు లండన్‌కు సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శనివారం రాత్రి 9.30 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు వీరు వెళుతున్నారు. తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: పొదుపు వ్యవస్థలో విప్లవం..వైఎస్ ‘పావలా వడ్డీ’ -
కన్ను కొట్టిన కెమిల్లా !
ప్రియా వారియర్.. రాహుల్ గాంధీ.. తాజాగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా పార్కర్ కన్ను కొట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్‌తో సంబంధాలు బలోపేతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా లండన్‌కి వచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్స్ చార్లెస్ వారికి ఆతి«థ్యమిచ్చారు. వారితో కలసి ఫొటో దిగాక చార్లెస్ భార్య కెమిల్లా పార్కర్..ట్రంప్ వెనుక నడుస్తూ పక్కకి తిరిగి కన్ను కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆమె ఎందుకు కన్ను గీటారనేది అర్ధం కాని విషయంగా మిగిలింది. బ్రిటన్ రాజకుటుంబీకురాలు కెమెరాల సాక్షిగా కన్ను కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు చెబుతున్నారు. మలయాళీ కుట్టి ప్రియా వారియర్ ఓ సినిమా కోసం కన్ను కొట్టే ఒకే ఒక్క సీన్ దేశం మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని కౌగిలించుకొని వచ్చి తన సీట్లో కూర్చొని జ్యోతిరాదిత్య సింధియావైపు చూస్తూ కన్ను కొట్టడం కూడా చర్చనీయాంశమయ్యింది. -
లండన్‌లో చదువుతున్న కుమార్తెను చూడటానికి వెళితే..!
సాక్షి, అమరావతి: ప్రతిదీ రాజకీయ దృష్టితో చూడటం.. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారి ఆరోపణలు చేయడంలో చంద్రబాబునాయుడిని మించినోళ్లు లేరని అంటారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవమని, అన్నింటిలో తానే సీనియర్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రాజకీయాల్లో కనీస మర్యాద, విలువలు పాటించకుండా ఎడాపెడా విమర్శలు చేసేస్తుంటారు. తాజాగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్‌లో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు వెళితే.. ఆ విషయంలోనూ రాజకీయ దుర్బుద్ధితో బాబు విమర్శలు చేశారు. హవాలా డబ్బు కోసమే వైఎస్ జగన్ లండన్‌కు వెళ్లారంటూ దుర్మార్గమైన ఆరోపణలకు దిగారు. పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు కుటుంబ విలువలు, మానవీయ సంబంధాలు తెలియవని, అందుకే ఏ విషయంలోనైనా అలవోకగా ఆరోపణలు చేస్తుంటారని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘లండన్‌లో చదువుతున్న కూతురు వర్షను చూడటానికి జగన్ వెళితే .. ఇంటర్ మీడియట్లో 99 % మార్కులు వస్తేనే కానీ ప్రఖ్యాత London School of Economics లో సీట్ రాదు. (Varsha succeeded in securing a seat for herself in the prestigious London school of Economics. Recently, Varsha has cleared her Class XII with Economics as main subject with flying colours. To get admission in the college, students must secure 99 per cent in the class XII examination-Indian Express) అటువంటి యూనివర్సిటీలో మెరిట్ సీట్ తెచ్చుకొని చదువుతున్న తన పెద్ద కూతురు వర్షారెడ్డిని చూడటానికి జగన్ లండన్ వెళితే.. తెలుగు డ్రామా పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు. జగన్ కూతుర్లు బంగీ జంప్ చేయాలని ఇష్టపడితే.. తన కూతుర్ల క్షేమం కోసమని ముందు జగన్ స్వయంగా బంగీ జంప్ చేసి ప్రమాదమేమీ ఉండదని నిర్ధారించుకున్నారు. అంత ప్రేమ కూతుర్లు అంటే..! 1994లో ఎన్టీఆర్ మద్యనిషేధం విధించినప్పుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బాబుకు డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోవడంలో కీలకపాత్ర పోషించాడని సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు చెప్పారు. అసలు విజయ్ మాల్యా లండన్ పారిపోయింది ఎప్పుడు? టీడీపీకి చెందిన కేంద్ర విమానాయానమంత్రి అశోక్ గజాపతిరాజు ఉండగానే కదా.. అసలు విజయ్ మాల్యాను తప్పించింది బాబే అని ఢిల్లీ వర్గాల్లో టాక్. అందుకే అప్పటినుంచి బాబు మీద మోదీ కోపంగా ఉన్నారని అంటారు. అయినా బ్యాంకులకు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రూ. 6 వేలకోట్లు ఎగొట్టాడని కోర్టులో కేసు వేశారు బ్యాంకుల వాళ్ళు. అటువంటి సుజనాకు పట్టుపట్టి మోదీని బతిమాలుకొని కేంద్ర మంత్రి పదవి ఇప్పించింది బాబు కదా! దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే !!! - సీవీ రెడ్డి (సోషల్ మీడియలో సీవీ రెడ్డి చేసిన పోస్టు ఇది) చదవండి: కూతురి దగ్గరికెళ్లినా రాజకీయమేనా? చంద్రబాబు మాటలు నీచాతినీచం: వైవీ -
లండన్ కాలింగ్
ఈ నెల చివర్లో కొత్త సినిమా కోసం లండన్ వెళ్లడానికి జాన్ అబ్రహాం ప్లాన్ చేశారు. ఇందుకోసం ఇలియానా కూడా సై అన్నారు. కానీ వీరి లండన్ ట్రిప్ నెక్ట్స్ మంత్కి వాయిదా పడింది. ఈ లోపు ఈ టీమ్‌తో కలిశారు కృతీ కర్భందా. ‘నో ఎంట్రీ, వెల్కమ్’ చిత్రాల ఫేమ్ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పాగల్ పంతి’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో ఒక కథానాయికగా ఆల్రెడీ ఇలియానాను తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్గా కృతీ కర్భందాను టీమ్ సెలక్ట్ చేశారు. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా ప్యాచ్ వర్క్‌తో బిజీగా ఉన్నారు కన్నడ భామ కృతీ కర్భంద. ఇది కంప్లీట్ కాగానే కొత్త సినిమా కోసం జాన్, ఇలియానాతో కలిసి కృతీ లండన్‌కి వెళతారు. తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కృతి ‘బ్రూస్లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్‌కే పరిమితమైన కృతి ఇప్పుడు నార్త్పై కూడా దృష్టి పెట్టారు. -
ప్రేమ ప్రయాణం!
‘సూయి ధాగా, కళంక్’ సినిమాలతో ప్రొఫెషనల్ లైఫ్‌లో కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నారు హీరో వరుణ్ ధావన్. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌కు టైమ్ కేటాయించారు. నటాషా దలాల్‌తో కలిసి వరుణ్ లండన్ వెళ్లారు. ఇంతకీ ఈ నటాషా ఎవరు? అంటే వరుణ్ ధావన్ గాళ్‌ఫ్రెండ్ అని బీటౌన్‌లో చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరూ పబ్లిక్‌గా ప్రేమను ఒప్పుకోవడం లేదు కానీ వీలైనప్పుడల్లా పార్టీలకు, పబ్‌లకు, డిన్నర్లకు కలిసే వెళ్తున్నారని చెవులు కొరక్కుంటున్నారు బాలీవుడ్ సినీవాసులు. అంతేకాదు.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్నది కొందరి ఔత్సాహికరాయుళ్ల ఊహ. ఆ ఊహ ఎంతవరకు నిజమవుతుందనేది కాలమే చెప్పాలి. నెక్ట్స్ థియేటర్స్‌లోకి రానున్న వరుణ్ మూవీ ‘సూయి ధాగా’. శరత్ కటారియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్కా శర్మ కథానాయిక. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆమెతో ట్రంప్ తింగరి చేష్టలు
బ్రిటన్ ప్రధానితోసహా దేశం మొత్తం గౌరవించే లండన్ రాణి ముందు.. అమెరికా అధ్యక్షుడు చేసిన ఓ ఫీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తీవ్ర నిరసనల మధ్యే డొనాల్డ్ ట్రంప్ యూకే పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం విండ్సోర్ క్యాసల్లో రెడ్ కార్పెట్‌పై ట్రంప్.. క్వీన్ ఎలిజబెత్-2(ఎలిజబెత్ అలెగ్జాండ్ర మేరీ)తో కలిసి సైనిక వందనం స్వీకరించారు. కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో రాణిని దాటేసి.. ట్రంప్ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ వెంటనే ఒక్కసారిగా ఆగి ఆమె కోసం వెనక్కి తిరగ్గా.. పక్కనుంచి క్వీన్ ముందుకొచ్చేశారు. ఇది సాధారణంగా అనిపించినప్పటికీ.. యూకే వాసుల మనోభావాలను మాత్రం దెబ్బతీసింది. ‘రాణిని దాటి ముందుకెళ్తావా? ఎంత ధైర్యం.. మహామహులే రాణి ముందు మోకరిల్లుతారు? నువ్వెంత.. అసలే నీ మీద కాకతో ఉన్నాం, ఇలాంటి సమయంలో తింగరి చేష్టలు చేస్తావా?’ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. 1992లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని పౌల్ కేటింగ్ రాణి వెనకాల చెయ్యేసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తూ కథనాలు వెలువడ్డాయి. నిరసనల మధ్యే... ఇదిలా ఉంటే ట్రంప్ పర్యటనను నిరసిస్తూ లండన్‌లో పెద్ద ఎత్తున్న నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ట్రంప్ లండన్‌లో అడుగుపెట్టే కొద్దిగంటల ముందు ట్రఫల్గర్ స్క్వేర్‌లో ట్రంప్ ముఖంతో ఉన్న ఆరెంజ్ బెలూన్ను ఎగరేసి నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. -
మా బంధం అత్యంత ప్రత్యేకం
లండన్: అమెరికా–బ్రిటన్ల బంధం విడదీయరానిదనీ, చాలా ప్రత్యేకమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాన్ని గతంలో విమర్శించిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. మే బ్రెగ్జిట్ విధానాలు.. అమెరికా, బ్రిటన్ల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని ‘చంపేసేలా’ ఉన్నాయని ట్రంప్ మూడ్రోజుల క్రితం ‘ద సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ద సన్ ప్రతిక ప్రచురించిందంతా అబద్ధమని, అదో ‘ఫేక్ న్యూస్’ (నకిలీ వార్తలు) పత్రిక అని ట్రంప్ ఆరోపించారు. 4 రోజుల పర్యటన కోసం ట్రంప్ తొలిసారిగా బ్రిటన్ వచ్చారు. చర్చల తర్వాత ట్రంప్, థెరెసా మీడియాతో మాట్లాడారు. ‘బ్రెగ్జిట్ చాలా సంక్లిష్టమైంది. బ్రిటన్ ఏం చేసినా అమెరికాతో వ్యాపారం కొనసాగిస్తే చాలు’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు చోటు చేసుకున్నాయి. -
వైరల్ అవుతున్న బోని కుమార్తెల సెల్ఫీ
అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత బోనీ కపూర్ ఫ్యామిలీ చాలా మార్పులే వచ్చాయి. అప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన బోని కపూర్ మొదటి భార్య మోనా శౌరి కపూర్, శ్రీదేవీ బిడ్డలు ఇప్పుడు కలిసి పోయారు. శ్రీదేవీ మరణం తర్వాత మొదటి భార్య సంతానం అన్షులా, అర్జున్ కపూర్లు, తమ చెల్లెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లకు తోడుగా నిలుస్తూ వస్తున్నారు. చెల్లలను ఎవరు ఏమన్నా.. అసలు సహించకుండా.. వెంటనే వారికి అర్జున్,అన్షులాలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఇటీవలే జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ధడక్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆ సమయాన కూడా జాన్హవి కపూర్‌కు, అర్జున్, అన్షులాలు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బోని కుమార్తెలందరూ కలిసి అందమైన నగరం లండన్‌లో విహరిస్తున్నారు. ధడక్ షూటింగ్ పూర్తయి, విడుదల కాబోతున్న తరుణంలో, ఇప్పుడు దొరికిన కాస్త విరామ సమయాన్ని జాహ్నవి లండన్‌లో సోదరీమణులు అన్షులా, ఖుషీలతో గడుపుతోంది. ఈ విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు తాజాగా ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తున్నాయి. తమ మధ్య ఉన్న అనుబంధం ఉట్టిపడేటా ఉన్న ఓ సెల్ఫీని బోనీ పెద్ద కుమార్తె అన్షులా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అన్షులా, జాహ్నవి, ఖుషీలతో పాటు ఈ సెల్ఫీలో బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ సంతోషి కూతురు తనీషా సంతోషి కూడా ఉంది. శ్రీదేవీ మరణించిన అనంతరం బోనీకి మాత్రమే సపోర్టుగా నిలువకుండా.. ఇటు చెల్లెల సాధకబాదకాలను అర్జున్, అన్షులాలు పట్టించుకుంటూ.. వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుండటంతో, బోనీ ఎంతో సంతోషిస్తున్నారు. అన్షులా పోస్టు చేసిన లండన్ వెకేషన్ ఫోటో... -
జాయ్ జాయ్ ఎంజాయ్
రొటీన్‌కి బ్రేక్ కొట్టి సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడే లైఫ్‌లో కిక్ ఉంటుంది. లేకపోతే బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒక్కోసారి చిన్నపిల్ల్లల్లా మారిపోతుంటాం. శ్రుతీహాసన్ అలానే చేశారు. పిల్లలు ఆడుకునే చెక్క గుర్రపు బొమ్మపై ఎక్కి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ఫన్నీ ఫొటోను ‘ప్యూర్ హ్యాపీనెస్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. లండన్ట్రిప్లో ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసి, హ్యాపీ మూడ్‌తో ఇండియా ప్రయాణం అయ్యారు శ్రుతీహాసన్. లండన్ నుంచి గోవా వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో రవితేజ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మనీష్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్ హీరోగా రూపొందనున్న సినిమాలో శ్రుతీనే హీరోయిన్. -
మోదీకి నిరసన సెగ.. జాతీయ జెండాకు అవమానం
లండన్ : ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భారత జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థాన్ ఆందోళనకారులు భారత జాతీయ జెండాను అవనతం చేసి.. చించి ఆపై తగలబెట్టారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో కామన్వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్) జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు స్క్వేర్ వద్ద మొత్తం 53 కామన్వెల్త్ దేశాల జెండాలను అధికారులు ఎగుర వేశారు. అయితే మోదీ రాకను వ్యతిరేకిస్తూ పాక్ చెందిన మత గురువు అహ్మద్ నేతృత్వంలో యూకే సిక్కు ఫెడరేషన్‌కు చెందిన ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు, మోదీ వ్యతిరేక మైనారిటీల గ్రూప్‌కు చెందిన 500 మంది అక్కడికి ర్యాలీగా చేరుకున్నారు. తొలుత వీరంతా అక్కడి మహాత్మగాంధీ విగ్రహం వద్ద జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఆపై జెండా కర్ర నుంచి భారతీయ పతాకాన్ని అవనతం చేసి చించేశారు. ఆపై దాన్ని కాల్చేసి.. అక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్ జెండాలను ఎగురవేశారు. ఇదంతా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. లండన్ పోలీసుల తీరుపై విమర్శలు... ఈ ఘటన జరుగుతున్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ భారతీయ సీనియర్ జర్నలిస్ట్ చిత్రీకరించగా.. అతనిపై కూడా దాడి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించిన లండన్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారతీయ జెండాను తొలగించిన దిమ్మె ఇదే భారత్ స్పందన... జాతీయ జెండాకు జరిగిన అవమానంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జెండాను అవనతం చేసి చించేయడంపై బ్రిటిష్ అధికారులకు మా నిరసన తెలియజేశాం. ఆ ఘటనకు వారు క్షమాపణలు చెప్పారు. ఇటువంటి శక్తులు సమస్యలు సృష్టించవచ్చని ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం. చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇది చోటు చేసుకోవటం దురదృష్టకరం. ఆ స్థానంలో జాతీయ జెండాను కొత్తది ఏర్పాటు చేశారు’’ అని ప్రధానితోపాటు పర్యటిస్తున్న బృందంలోని అధికారి ఒకరు తెలిపారు. -
రేపు హైదరాబాద్‌కు వైఎస్ జగన్ రాక
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని గురువారం (21వ తేదీ) హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్చడానికి ఈ నెల 11వ తేదీన ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లిన విషయం విదితమే. -
లండన్‌లో జగన్‌తో మీట్ అండ్ గ్రీట్
సాక్షి, లండన్: ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి యువనేతలతో సమావేశం కానున్నారు. లండన్‌లోని హౌన్స్లో, లాంగ్ఫోర్డ్లోని రివర్సైడ్ హాలులో ఆదివారం ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు లండన్‌లోని వైఎస్సార్సీపీ యువ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ ను కలిసి తమ అభిప్రాయాలను పంచుకోవాలనుకునే వాళ్లు కింది నంబర్లకు సంప్రదించాలని వారు ప్రకటనలో కోరారు. శివ-07745366516, వాసు:07843587459, అమర్:07948611677 నంబర్లను మరిన్ని వివరాల కోసం సంప్రదించవచ్చు. -
రాహుల్ గాంధీ ఎక్కడ..?
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని, విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. తాను కొన్ని రోజుల పాటు టూర్లో ఉంటానని రాహుల్ తెలిపారు. అయితే ఎక్కడకు వెళ్లారన్న విషయాన్ని వెల్లడించలేదు. రాహుల్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి లండన్ వెళ్లినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వ్యక్తిగత పర్యటన కోసం బుధవారం బ్రిటన్ వెళ్లారని, అక్కడే వారం రోజులు గడపనున్నట్టు పేర్కొన్నాయి. కాగా రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తోసిపుచ్చారు. జనవరి 1 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లవచ్చని చెప్పారు. గతేడాది కూడా ఆయన న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి విదేశాలకు వెళ్లారు. ప్రజలకు విషెస్ చెబుతూ కొన్ని రోజులు యూరప్ పర్యటనకు వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఎక్కడకు వెళ్లారన్న విషయాన్ని రాహుల్ వెల్లడించలేదు. శనివారం విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. శుక్రవారం రాత్రి లండన్ బయల్దేరినట్టు సమాచారం. I will be traveling for the next few days.Happy New Year to everyone,wishing you and your loved ones success & happiness in this coming year — Office of RG (@OfficeOfRG) 31 December 2016 -
లండన్‌లో వాణిజ్య, వ్యాపారవేత్తలతో చంద్రబాబు భేటీ
లండన్ : లండన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం శుక్రవారం అక్కడి వాణిజ్య, వ్యాపారవేత్తలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ గురించి సీఈవో నికిల్ రాఠీ ...చంద్రబాబు బృందానికి వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు మౌలికి సదుపాయాల కల్పనపై ఈ భేటీలో చర్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు బృందం లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న 'లండన్ ఐ'ని సందర్శించింది. చంద్రబాబు 13వ తేదీ వరకూ అక్కడే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. -
10న లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులపాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 10వ తేదీన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లండన్ బయలుదేరనున్నారు. 13వ తేదీ వరకూ అక్కడే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారని శనివారం ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెళ్లనున్నారు. -
లండన్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి
* విద్య, వైద్యం, టెక్నాలజీ, ఇండస్ట్రీకి ప్రాధాన్యం * అదే నమూనాలో రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ కృషి * లండన్ పర్యటనతో కొత్త అంశాలు నేర్చుకున్నాను * ‘సాక్షి’తో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత రాయికల్ : ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా పేరొందిన లండన్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని, ఆ నగర స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఈ నెల 2నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరఫున దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 మంది ఎంపీలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి కవితకు అవకాశం దక్కింది. సెమినార్ ముగించుకుని స్వరాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అక్కడి అనుభవాలను ఆమె శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘ఈ సెమినార్‌కు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి యువ ఎంపీలు హాజరయ్యారు. 14 మందిలో ఇద్దరం మహిళా ఎంపీలం ఉన్నాం. సెమినార్లో ముఖ్యంగా దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన సంస్కరణలు, అక్షరాస్యత పెరుగుదల, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, హక్కుల సాధన, ఆర్థిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వంటి సంస్కరణలపై చర్చ జరిగింది. భారత ఎంపీలం అందరం ఒకేచోట కలవడంతో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నాం. లండన్‌లో టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రీపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం ద్వారా అనూహ్యమైన ప్రగతిని సాధించినట్టు గమనించాను. అదేరీతిలో మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడమే నాన్న (కేసీఆర్) గారి మొదటి ఆశయం. ఇందుకు నా పర్యటనలో గమనించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇక లండన్‌లో తెలంగాణ ప్రవాసులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరాను. పెట్టుబడిదారులకు సర్కారు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించగా, మంచి స్పందన కనిపించింది. త్వరలోనే పెట్టుబడులు వస్తాయనే నమ్మకముంది. తెలంగాణ ఉద్యమం లండన్‌లోనూ విస్తరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ ఎన్నారెసైల్, తెలంగాణ జాగృతి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. నేను లండన్‌లో అడుగుపెట్టగానే వీరంతా ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో వందరోజుల పాలనపై ఏకంగా ఒక పుస్తకాన్నే రూపొందించారు. దానిని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది’’ అని కవిత తన పర్యటన విశేషాలను కుప్లంగా వివరించారు. -
బ్రిటన్ పర్యటనకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళుతున్న ఆయన 10వ తేదీ వరకు అక్కడ పర్యటిస్తారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డిని బ్రిటన్ పార్లమెంట్లో ప్రధాని డేవిడ్ కామెరాన్ సన్మానించనున్నారు. పర్యటన నేపథ్యంలో అక్కడ స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంతో పాటు అనంతపురం జిల్లాలో ఐటీ పరిశ్రమలను రప్పించేందుకు పల్లె రఘునాథరెడ్డి కృషి చేయనున్నారు.