లండన్లో వాణిజ్య, వ్యాపారవేత్తలతో చంద్రబాబు భేటీ | chandrababu naidu london tour in 1st day | Sakshi
Sakshi News home page

లండన్లో వాణిజ్య, వ్యాపారవేత్తలతో చంద్రబాబు భేటీ

Published Fri, Mar 11 2016 6:33 PM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

chandrababu naidu london tour in 1st day

లండన్‌ : లండన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం శుక్రవారం అక్కడి వాణిజ్య, వ్యాపారవేత్తలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ గురించి సీఈవో నికిల్ రాఠీ ...చంద్రబాబు బృందానికి వివరించారు.

 

అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు మౌలికి సదుపాయాల కల్పనపై ఈ భేటీలో చర్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు బృందం లండన్‌లోని థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న 'లండన్‌ ఐ'ని సందర్శించింది.  చంద్రబాబు 13వ తేదీ వరకూ అక్కడే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement