పిలుపు వస్తే టీడీపీ కార్యాలయానికి వెళ్తా
► మంత్రి నారాయణ అడ్మినిస్టేటర్, నాయకుడు కాదు
► టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి
నెల్లూరు, సిటీ: టీడీపీ కార్యాలయం నుంచి తనకు పిలుపు రాలేదని, ఎవరైనా తనను బాధ్యతాయుతంగా పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీ సెంటర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు జన్మదినం ఈ ఏడాది ప్రత్యేకమైందన్నారు. కొత్త రాజధాని నిర్మిస్తున్నారన్నారు. అందరూ రాజకీయాలు పక్కనపెట్టాలన్నారు. టీడీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి రంగనాయకులపేట వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పిలవడంతో వెళ్లడం జరిగింది.
మంత్రి నారాయణ రాజకీయనాయుడు కాదని, అడ్మినిస్ట్రేటర్ మాత్రమేనన్నారు. ఇటీవల వచ్చిన మంత్రుల ర్యాంకుల్లో నారాయణకు చివరి ర్యాంకు రావడంపై ఆనం స్పందిస్తూ అందరిలాగా రాజకీయ వ్యక్తి కాదన్నారు. రాజధాని నిర్మాణంలో సృష్టి కర్త చంద్రబాబు అయితే అమలు చేసేది నారాయణ అని తెలిపారు. మరో రెండు సంవత్సరాలు గడిస్తే పూర్తిస్థాయి రాజకీయ నేతగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రంరెడ్డి మాధవ్‌రెడ్డి, గిరి, శ్రీగిరిచక్రవర్తి, రంగమయూర్‌రెడ్డి, నజీర్, మునాఫ్, పేరారెడ్డి, ఇలియాజ్, రాధాకృష్ణారెడ్డి, ముజీర్ పాల్గొన్నారు.