Anam Vivekananda reddy
-
వివేకా భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు
-
‘వివేకాకు ప్రత్యేక స్థానం ఉంది’
సాక్షి, నెల్లూరు: తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అమరావతి నుంచి నెల్లూరు చేరుకున్న చంద్రబాబు ఏసీ సెంటర్లోని ఆనం వివేకానందరెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు పుష్ఫాంజలి ఘటించారు. అనంరం వివేకా సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ఆనం వివేకా అని కొనియాడారు. చరిత్రలో వివేకాకు ప్రత్యేక స్థానం ఉందని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని తెలిపారు. వివేకాకు సినిమాలంటే ఎంతో ఇష్టమని చంద్రబాబు తెలిపారు. మంత్రి పదవిని సైతం ప్రజలకోసం త్యాగం చేశారన్నారు. మనస్సుకు నచ్చిన విధంగా నడుచుకుంటూ, ఎవ్వరికీ భయపడని వ్యక్తి అన్నారు. వివేకా ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వివేకా ఇకలేరన్న సంగతి తెలుసుకున్న ప్రజలు, అభిమానులు ఆయన్ని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. -
ఆనం కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, గన్నవరం : మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. గురువారం ఆనం కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఫోన్లో ఆనం రామనారాయణ రెడ్డి, విజయ్‌కుమార్ రెడ్డిలతో మాట్లాడారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రోస్టేట్ క్యాన్సర్‌తో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చికిత్సకు శరీరం సహకరించక తన సోదరుడు తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికాయానికి నెల్లూరులో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు
-
షో మ్యాన్..మాస్ వివేకా
-
విలక్షణ నేత ఆనం వివేకా కన్నుమూత
-
ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రాంగోపాల్‌పేట్: మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. మూత్రకోశ క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అయన బుధవారం ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వివేకానందరెడ్డి ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు వివేకానందరెడ్డి శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించారు.మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు ఆసుపత్రికి వచ్చి నివాళులర్పించారు. నెల్లూరుకు భౌతికకాయం ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నెల్లూరులోని ఏసీ సెంటర్లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విలక్షణ నేత : 1950 డిసెంబర్ 25 నెల్లూరులో జన్మించిన వివేకానందరెడ్డి విలక్షణ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి, తన తండ్రి ఆనం వెంకటరెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని 1980లో నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో నెల్లూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. వివేకానందరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి కాగా, రెండో కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి ప్రస్తుతం నెల్లూరులో కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. సీఎం చంద్రబాబు సంతాపం సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆనం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆనం కుంటుంబీకులకు జగన్ సానుభూతి సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. వివేకా కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తమ్ సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రఘువీరా, కేవీపీ దిగ్భ్రాంతి వివేకానందరెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఆనం వివేకా మృతిపట్ల వెంకయ్య సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు తీరని లోటని వెంకయ్య అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ్యునిగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎల్లప్పుడూ చురుకుగా, చమత్కారాలతో ఆయన మాట్లాడే మాటలు ఇప్పటికీ గుర్తుకువస్తున్నాయన్నారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. గత కొన్నిరోజులుగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆనం వివేకానందరెడ్డి హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి నెల్లూరులో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
-
టీడీపీ నేత ఆనం వివేకా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీడీపీ నేత ఆనం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు తొలుత నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే కిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆనం వివేకా మృతిపట్ల ప్రముఖుల సంతాపం ఆనం వివేకా మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకా మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనం కుటుంబ సభ్యులకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కళా వెంకట్రావు, నారాయణ, నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆనం వివేకా మృతిపట్ల సంతాపం తెలిపిన అనంతరం నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. ఓ విలక్షణ రాజకీయ నాయకుడిని కోల్పోయామన్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, పలువురు టీడీపీ నేతలు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆనం వివేకాను పరామర్శించిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఆనం అనారోగ్యంతో బాధపడుతున్నారని, రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావు కొన్ని రోజుల కిందట తెలిపారు. గురువారం అంత్యక్రియలు రేపు (గురువారం) నెల్లూరులో ఆనం వివేకా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతల్లో ఆనం వివేకానందరెడ్డి ఒకరు. ఆనం వివేకా సోదరుడు, టీడీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా, ఆర్థికమంత్రిగా గతంలో పలు శాఖలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించే ఆనం వివేకా.. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొంది మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన 1950 డిసెంబర్ 25న జన్మించారు. ఆనంకు భార్య హైమావతి ఆనం, సంతానం ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం రంగా మయూర్ రెడ్డి ఉన్నారు. -
ఆందోళనకరంగా ఆనం వివేకా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వివేకాకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వివేకానందరెడ్డిని పరామర్శించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణతో కలిసి ఆయన కిమ్స్ ఆసుపత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాస్కర్‌రావు మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు. -
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆనం వివేకా
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. గురు వారం సాయంత్రం ఆయన ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణలతో కలసి ఆస్పత్రికి వచ్చారు. వివేకాను పరామర్శించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు. -
సుప్రీం కోర్టులో ఆనం సోదరులకు ఎదురుదెబ్బ
నెల్లూరు (టౌన్): సుప్రీం కోర్టులో ఆనం సోదరులకు ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ విద్యాసంస్థల కమిటీపై ఏబీవీపీ పూర్వ విద్యార్థులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు చాలా ఏళ్లు కొనసాగింది. హైకోర్టులో పూర్వవిద్యార్థులకు గతంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనం సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఈ కేసుపై పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం మంగళవారం పాత కమిటీని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిటీని జూలైలోపు ఎన్నుకోవాలంటూ తీర్పు జారీ చేసింది. జిల్లా కోర్టు పర్యవేక్షణలో పాత రాజ్యాంగం ప్రకారం ఎన్నిక జరపాలని నిర్ణయించింది. దీంతో సుప్రీం కోర్టులో ఆనం సోదరులకు ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ విద్యా సంస్థలకు సుమారు రూ.1,000 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు 31 ఏళ్ల నుంచి ఆనం సోదరుల అధీనంలో నడుస్తున్నాయి. అక్కడ నిధులు దుర్వినియోగం అయ్యాయని, కమిటీ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఏబీవీపీ పూర్వ విద్యార్థి ఆమంచర్ల శంకరనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీఆర్ విద్యాసంస్థలకు కొత్త కమిటీ అనివార్యమైంది. -
టీడీపీలో చేరి తప్పు చేశా..!
► అందరికీ పదవులు ఇస్తున్నారు మాకు తప్ప.. ► సన్నిహితుల వద్ద ఆనం ఆవేదన.. నెల్లూరు: టీడీపీలో చేరడంపై మాజీ నెల్లూరు ముఖ్యనేత ఆనం వివేకానంద రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నెల్లూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిన తర్వాత తన ప్రాభల్యం కోల్పోయారు. పార్టీలో చేరుతున్నప్పుడు పదవులు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చేరిన తర్వాత ముఖం చాటేస్తున్నారని వాపోయినట్లు సమాచారం. తెలుగుదేశంలో చేరి తప్పు చేశానని, మోసపోయామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. అంతేకాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామన్న సీఎం హామీ నెరవేరకపోవడంతో ఆయన కలత చెందిదనట్లు సమాచారం. దీంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎమ్మెల్సీ దక్కేనా? గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఆనంకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉంది. నంద్యాలలో 45వేల ముస్లిం ఓట్లు ఉన్ననేపధ్యంలో ఉపఎన్నికల్లో గెలవడానికి ఫరూక్‌కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగిచేందుకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఆనం బ్రదర్స్‌కు ఇవ్వాల్సిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి చేజారడంతో ఆయన అనుచరులు డీలా పడ్డారు. -
టీడీపీ నేతలు చీ కొడుతున్నారు మిమ్మల్ని
-
‘టీడీపీకి గుడ్‌బై’పై క్లారిటీ ఇచ్చిన ఆనం
అమరావతి: టీడీపీ తరఫున ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా చక్రంతిప్పిన ఆనం సోదరులిద్దరూ.. తెలుగుదేశం పార్టీలో చేరాక చేదు అనుభవాలు ఎదుర్కొన్నారని, దీంతో పార్టీని వీడతారని జోరుగా ప్రచారం సాగింది. ఒక దశలో వారు టీడీపీ నుంచి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళతారనే వార్తలు గుప్పుమన్నాయి. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆనం.. సోషల్ మీడియా వేదికగా సాగుతోన్న ప్రచారాలపై స్పష్టత ఇచ్చారు. తాము తెలుగుదేశం పార్టీననుంచి బయటికి వస్తున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వివేకానందరెడ్డి చెప్పారు. తనతోపాటు సోదరుడు రామనారాయణ రెడ్డి కూడా టీడీపీలోనే ఉంటామని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి కూడా స్పష్టం చేశామని తెలిపారు. తమ సేవలు ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబుకు తెలుసని, ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడిన ఆనం సోదరులు.. పలు ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిసింది. వివేకానంద రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్ధానం చేయడంవల్లే ఆ ఇద్దరూ టీడీపీలో చేరారని, చివరికి బాబు అవేవీ నెరవేర్చకపోవడంతో ఆనం సోదరులు కినుక వహించారని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. (చదవండి: టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం) -
సోమిరెడ్డి బలప్రదర్శన
► ఆనం సోదరులు, ఆదాల డుమ్మా ► ఒక వైపు స్నేహ హస్తం అందిస్తూనే మరో వైపు సత్తా చాటే వ్యూహం ► పార్టీ మొత్తం తన వెంటే ఉందని చూపించే ప్రయత్నం ► నెల్లూరులో భారీ ర్యాలీ, బహిరంగ సభ సాక్షి ప్రతినిధి – నెల్లూరు: పదమూడేళ్ల తర్వాత మంత్రి పదవి దక్కించుకుని శుక్రవారం తొలిసారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు నగరం వేదికగా బల ప్రదర్శన చేశారు. ఒక వైపు పార్టీలోని వైరి వర్గాలకు స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేస్తూనే వారికి తన బలం ఏమిటో చూపించే ప్రయత్నం చేశారు. సోమిరెడ్డి స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. పార్టీ హై కమాండ్ ఆదేశం మేరకు మంత్రి నారాయణ ఆద్యంతం సోమిరెడ్డి వెంటే ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో పాటు సర్వేపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు నియోజక వర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో లేకపోవడం, 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థల అధినేత నారాయణకు పెత్తనం దక్కడంతో సోమిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది. కొంతకాలం పాటు పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఎమ్మెల్సీ అయ్యాక అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు జిల్లా నాయకులతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. తన మద్దతు దారులకు పార్టీ, అధికార పదవుల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వక పోయినా ఎక్కడా వివాదాలకు పోకుండా సమయం కోసం వేచి చూస్తూ వచ్చారు. మంత్రి పదవి సాధించి జిల్లా రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని గురి పెట్టి ఏడాది కాలంగా సర్వ శక్తులు ఉపయోగించి, తెలివిగా అడుగులేస్తూ వచ్చారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం కోసం మంత్రి నారాయణ బీసీ కార్డుతో బీద రవిచంద్రను తెర మీదకు తెచ్చినా తన ఆగ్రహాన్ని మనసులోనే దాచుకుని జాగ్రత్తగా వ్యవహరించారు. ఇదే సందర్భంలో జిల్లా పాలనా యంత్రాంగం మీద మంత్రి నారాయణకు పట్టు లేకపోవడం, ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ లాంటి వైఫల్యాలను తెలివిగా వాడుకున్నారు. మంత్రి పదవి చేతికి రాగానే జిల్లాలోని వైరి వర్గాలతో పాటు, తటస్థంగా ఉన్న వారిని సైతం తన నాయకత్వంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ రకంగా చేయడం ద్వారా 2019 ఎన్నికల నాటికి జిల్లా పార్టీ మీద పూర్తి ఆధిపత్యం సాధించే దిశగా అడుగులు ప్రారంభించారు. ఆ ముగ్గురూ డుమ్మా సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం సోమిరెడ్డి నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభకు హాజరు కాలేదు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన సోమిరెడ్డి రెండు రోజుల కిందట వీరికి స్వయంగా ఫోన్ చేసి ర్యాలీ, బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. తన మనుషులను ఆనం, ఆదాల మద్దతు దారుల ఇళ్లకు పంపి కార్యక్రమానికి ఆహ్వానించారు. బీద రవిచంద్ర ఆనం వివేకా, రామనారాయణ ఇళ్లకు వెళ్లి మరీ ఆహ్వానించి వచ్చారు. అయితే ముందుగా ఊహించిన విధంగానే ఆనం సోదరులు శుక్రవారం నాటి కార్యక్రమాలకు ముఖం చాటేసి సోమిరెడ్డిపై తమ అసంతృప్తిని బహిర్గత పరిచారు. రామనారాయణరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఆనం వివేకానందరెడ్డి నగరంలోనే ఉన్నా కార్యక్రమాలకు హాజరు కాలేదు. తన ఇంటికి కూత వేటు దూరంలోని నర్తకి సెంటర్లో బహిరంగ సభ జరుగుతున్నా వివేకా ఇంట్లోనే ఉండిపోయారు. అత్యవసర పనుల పేరిట మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. పార్టీ హై కమాండ్ ఆదేశం మేరకు మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర వీఆర్సీ సెంటర్లో ర్యాలీ ప్రారంభమై నర్తకి సెంటర్లో బహిరంగ సభ ముగిసే వరకు సోమిరెడ్డితో పాటే ఉన్నారు. స్వయంగా ఫోన్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి జిల్లాకు వస్తున్న తన పర్యటనను విజయవంతం చేసుకోవడం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాలోని ముఖ్య నేతలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, సాయికృష్ణ యాచేంద్ర, బీద మస్తాన్‌రావు, పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం, తాళ్లపాక రమేష్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అజీజ్, గూడూరు, వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్లు దేవసేనమ్మ, దొంతు శారద, నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు హాజరయ్యారు. విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, బీజేపీ నేతలు సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఆంజనేయరెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ జెడ్.శివప్రసాద్, కోవూరు నియోజకవర్గ ముఖ్య నాయకుడు పెళ్ల కూరు శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు సైతం సోమిరెడ్డి ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నాయకులంతా సోమిరెడ్డిని ప్రజా నాయకుడు, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడని పొగడ్తలతో ముంచెత్తడం వేదిక మీదే ఉన్న మరో మంత్రి నారాయణను కాస్త ఇబ్బంది పెట్టినట్లుగా కనిపించింది. -
రోదన వెనుక కోట్ల వేదన
నారాయణా పాహిమాం : వివేకా శరణు పోరాడుతున్న పూర్వపు విద్యార్థుల సంఘాలు సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆనం కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మంత్రి పొంగులేటి నారాయణ శరణు కోరడం వెనుక రూ.కోట్లు విలువ చేసే వి.ఆర్. విద్యా సంస్థల ఆస్తుల వ్యవహారమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. నగరం నడిబొడ్డున వి.ఆర్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 16 ఎకరాలు, అందులోని భవనాల మార్కెట్ విలువ రూ.500 కోట్ల పైచిలుకే అన్నది అంచనా. విద్యా సంస్థల్లో 300 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది ఉండటం, విభిన్న పద్ధతుల్లో నెలకు సుమారు పాతిక లక్షల రూపాయల వరకు సముపార్జన ఉండటంతో వాటిపై పట్టు చేజార్చుకోకుండా ఉండటానికే ఆనం నానా పాట్లు పడుతున్నారనేది బహిరంగ రహస్యమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే మంత్రి నారాయణ వద్దకు వెళ్లి అంతలా బతిమలాడాల్సిన అగత్యం వివేకానందరెడ్డికి ఏర్పడిందని గుర్తుచేస్తున్నారు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో అంటున్నారు. నారాయణా నన్ను రక్షించవా అంటూ వివేకా బుధవారం మంత్రిని వేడుకున్న తీరు.. ‘ఇందుకంటయ్యా! రాజకీయాలు, పదవులు అంటూ కోటీశ్వర్లు సైతం వెంపర్లాడుతుంటారు. ఏమైనా కానీ రాజకీయాల్లో భలే మజా ఉందయ్యా’..అని తన అనుయాయుల వద్ద మంత్రి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆనం సోదరుల మధ్య రగడ నెల్లూరు నగరంలో వి.ఆర్ విద్యా సంస్థలు అంటే ప్రస్తుతం ఆనం కుటుంబం గుర్తుకు వస్తుంది. అన్నదమ్ముల బిడ్డలైన ఆనం కుటుంబాలకు చెందిన వారి మ«ధ్య రగడ తలెత్తడం, వి.ఆర్. విద్యాసంస్థలకు సంబం«ధించి 1993లో పాలకమండలి ఎన్నికలు సహేతుకంగా జరగలేదని, ఆ కమిటీ ఎన్నికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కొంతకాలం కిందట తీర్పును వెలువరించింది. కమిటీని రద్దు చేసి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించిన సంగతి తెలిసిందే. వి.ఆర్ విద్యాసంస్థలకు ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌గా, ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కమిటీ రద్దయిన పక్షంలో ఆనం సోదరులకు వి.ఆర్.పై పెత్తనం పోతుంది. తద్వారా ఆర్థికమూలాలు దెబ్బతింటాయి. దేవాదాయశాఖకు చెందితే... వి.ఆర్. విద్యాసంస్థల పూర్వపు పాలకవర్గం ఈ సంస్థకు చెందిన ఆస్తిపాస్తులను దేవాదాయశాఖకు రాసిచ్చింది. ఆరు నెలల కిందట దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రూ.18 లక్షలను ప్రస్తుత కమిటీ నుంచి కట్టించుకుంది. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను బట్టి విద్యాసంస్థల ఆస్తిపాస్తులన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోతాయి. అదే జరిగితే ఆనం సోదరులకు నగర రాజకీయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవని రాజకీయ పక్షాలతో సహా అన్ని వర్గాల అభిప్రాయం. వీటన్నింటి నేపథ్యంలోనే ఎలాగైనా సరే ప్రత్యేక అధికారి పాలనలోకి, దేవాదాయ శాఖ పరిధిలోకి విద్యా సంస్థలు వెళ్లకుండా చూడాలని వివేకానందరెడ్డి కాళ్లావేళ్లా పడుతున్నారని అధికారపార్టీ వాళ్లే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. నాడలా.. నేడిలా.. తనకు కావాల్సిన ఓ మహిళా మాజీ ప్రజాప్రతినిధి తరఫు వారికి మెడికల్ సీటు ఉచితంగా ఇవ్వాలని కళాశాల యజమాని నారాయణకు అప్పటి ఎమ్మెల్యే ఆనం వివేకా సూచించారు. సీటు ఇవ్వనందుకు తన ప్రతాపం చూపిస్తానంటూ హూంకరించి మీ కాలేజీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కార్పొరేషన్ అ«ధికారులను పంపి రెడ్‌టేప్ వేయించడం, కొంత భాగాన్ని పడకొట్టించడం చేశారు. అప్పట్లో ఈ సంఘటన నెల్లూరు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వద్దకు పి.నారాయణ వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నా తను చేయగలిగింది ఏమీ లేదని, వివేకానందరెడ్డి వద్దే ఏదైనా తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే వివేకా ఇంటి వద్ద ఆరు గంటల పాటు ఎదురుచూశాక ఆనం ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. ఇదంతా 2013 నవంబరులో జరిగింది. తాజాగా ఇదీ సంగతి... వి.ఆర్. విద్యాసంస్థల కమిటీ ఎన్నిక చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ అంశంపై అధికారపార్టీలో భాగస్వామి అయిన బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం ప్రెస్‌మీట్ పెట్టి మరీ కళాశాల కమిటీని రద్దుచేసి ప్రత్యేక అధికారిని నియమించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మంత్రి వద్దకు వెళ్లి ‘సర్, ఈ పరిస్థితుల్లో మీరు తప్ప మరెవరూ మమ్మల్ని కాపాడలేరు’ అంటూ కాళ్లా వేళ్లా పడి భోరున విలపించారు. 2013లో తనకు ఎదురైన సంఘటనను గుర్తుచేస్తూ రాజకీయాల్లో ఇంత మజా ఉంటుందా అయ్యా అని మంత్రి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో విస్తృత చర్చనీయాంశంగా మారాయి. -
టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం
► ఆనంకు చేదు అనుభవం ► ఎమ్మెల్సీ సీటుపై దక్కని హామీ ► మనస్తాపంతో అనుచరుల వద్ద ఆవేదన నెల్లూరు సిటీ: కాంగ్రెస్ పార్టీలో తాము చెప్పిందే వేదం..తాము చెప్పిన వారికే పదవులు అన్న విధంగా ఏలిన ఆనం కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోవడంతో ఆనం వివేకానందరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా టీడీపీలో చేరామని అనచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆనంపై బాబు ఆగ్రహం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం తనను కలిసిన ఆనం సోదరులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే, పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడినట్లు తెలిసింది. పార్టీలోకి ఆహ్వానించే ముందు ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇచ్చేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఆనం సోదరులు టీడీపీలో చేరి చ క్రం తిప్పుదామని ముందుగానే వ్యూహరచన చేశారు. రామ నారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్ , వివేకా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు, తనయడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. బాబు ఆగ్రహంతో ఆనం సోదరుల ముందస్తు వ్యూహాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఏమి ఇవ్వాలో నాకు తెలుసు ఎమ్మెల్సీ సీటు కోసం ఆనం వివేకాందరెడ్డి స్వయంగా వెళ్లి సీఎంను కలిశారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా రెండు రోజులు విజయవాడలో బస చేసి చివరికి 2 నిమి షాలు మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్చార్జిగా అవకాశం కల్పించామని, ఇంకా ఏమి ఇవ్వాలో తెలుసునని, అడగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. భంగపడ్డ ఆనం టీడీపీలో చేరి తప్పుచేశానని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆశలపై నీళ్లు తనకు ఎమ్మెల్సీ స్థానం..తన కుమారుడికి నగర ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి ఆనం టీడీపీలో చేరారు. తన అనుచరులకు రానున్న రోజుల్లో టీడీపీని మనమే లీడ్ చేస్తామని చెప్పారు. అమరావతి మూడ్రోజుల పర్యటనతో ఆనం అం చనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్‌ని ఏ విధంగా లీడ్ చేశామో.. అలాగే టీడీపీని లీడ్ చేయవచ్చని వివేకా అనుకున్నారు. అయితే లోకేష్ మీ పని మీరు చూసుకోవాలని, మేయర్ జోలికి వెళ్లద్దని సూచించడం.. బాబు సైతం పార్టీలో విభేదాలకు కేంద్ర బిందువుగా మారవద్దని హెచ్చరించడంతో వివేకా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆనం కంట కన్నీరు ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని విమర్శించడం..అవకాశం వచ్చినప్పుడల్లా తన శైలిలో ఎకసెక్కాలు ఆడడం మామూలే..అయితే విలేకరుల సమావేశంలో ఎన్నడూ లేని విధంగా వ్యవహరించారు. తమ సొదరుల మధ్యన చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతూ కన్నీటి పర్వంతమయ్యారు. తాము చివరి వరకు రాజకీయాల్లోనే ఉంటామని తెలిపారు. సహనం కోల్పోయి..విలేకరులు అడిగిన ప్రశ్నకు సైతం సమాధానం ఇవ్వకుండా ఒంటి కాలిపై లేచారు. తనను ఇంక ప్రశ్నించవద్దని, చాలు అని గట్టిగా ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పర్యటన అనంతరం ఆనంలో వచ్చిన మార్పు అటు టీడీపీ, ఇటు ఆనం వర్గంలో చర్చినీయాంశమైంది. -
ఆనం వివేకాకు సమన్లు జారీ చేసిన కోర్టు
మార్చి 8న హాజరుకావాలని ఆదేశం ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణం సాక్షి, హైదరాబాద్/నెల్లూరు సిటీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పరువునష్టం కేసులో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 8న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం బుధవారం ఆయన్ని ఆదేశించింది. తన పరువుకు భంగం కలిగించేలా వివేకానందరెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ రోజా గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం విచారించారు. రోజా తరఫున వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2016, ఫిబ్రవరి 29న వివేకానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా, ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సీడీని న్యాయస్థానానికి సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. వివేకానందరెడ్డికి సమన్లు జారీ చేశారు. -
‘ఆనం’కు నోటీసులు జారీచేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనం వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బుధవారం ఆనం వివేకానందరెడ్డికి నోటీసులు జారీ చేసింది. న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రోజా తరఫున వాదనలు వినిపించారు. -
ఆదాల, అజీజ్‌కు ఆనం చెక్
ఎస్సీ సబ్‌ప్లాన్ పనులు తమ చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహం కాంట్రాక్టర్లతో నేరుగా ఆనం సోదరుల చర్చలు తమ వారినీ రంగంలోకి దించి లెస్‌కు టెండర్లు దాఖలు చేయించేందుకు నిర్ణయం ఈ పనులతో సిటీ, రూరల్ నియోజక వర్గాల్లో పట్టు పెంచుకునే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి – నెల్లూరు నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాల్లో తమ పట్టు పెంచుకోవడానికి ఆనం సోదరులు మళ్లీ రంగంలోకి దిగారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ 42 కోట్లతో నిర్మించనున్న పనులను ఆయుధంగా మలుచుకుని తమ ప్రత్యర్థులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అజీజ్‌కు చెక్ పెట్టడానికి వ్యూహ రచన చేశారు. శాసనసభ ఎన్నికల అనంతరం జిల్లాలో జరిగిన రాజకీయ కుప్పి గంతుల తర్వాత నెల్లూరు టీడీపీలో కొత్త గ్రూపులు తయారయ్యాయి. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన మేయర్ అబ్దుల్ అజీజ్ నగరంలో తన పట్టు పెంచుకోవడానికి ఉవ్విళ్లూరారు. సామాజక సమీకరణలో వచ్చే సారి తనకు అవకాశం రాకపోదా అనే ఆశతో పనిచేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కార్పొరేషన్ మొత్తం పరిధిలో తన వారిని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రూరల్ నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డితో విబేధాలకు దిగారు. ఈ పరిణామాలు నడుస్తున్న తరుణంలోనే ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం నెల్లూరులో అందరికంటే ఎక్కువ అజీజ్‌కే ఆందోళన కలిగించింది. తనను గట్టిగా వ్యతిరేకించే ఆనం కుటుంబం తానున్న పార్టీలోకే వస్తే తనను మడిచేస్తారనే ఆందోళన ఆయనలో వ్యక్తం అయ్యింది. కొంత కాలం పాటు లోలోన ఉన్న విబేధాలు ఇటీవల బహిర్గతం అయ్యాయి. ఆక్రమణల కూల్చి వేత సమయంలో ఆనం వివేకానందరెడ్డి నేరుగా మేయర్ మీద దాడికి దిగారు. అజీజ్ కూడా గట్టిగానే ఎదురు దాడి చేశారు. ఈ వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టేలా తయారు కావడంతో హై కమాండ్ రంగంలోకి దిగడంతో వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆనంతో ఎప్పకైనా ఇబ్బందే అనే అభిప్రాయంతో మేయర్ అజీజ్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో స్నేహం ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని రూరల్నియోజక వర్గంలో ఆదాలకు మేయర్, సిటీ నియోజక వర్గంలో మేయర్‌కు ఆదాల సహరించుకునేలా రాజీ ఒప్పందానికి వచ్చారు. ఈ విషయం తెలిసుకున్న ఆనం సోదరులు అటు ఆదాల, ఇటు అజీజ్‌కు ఒకే సారి చెక్ పెట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. రూ 42 కోట్ల పనులతో ఆధిపత్యం కార్పొరేషన్ పరిధిలో 8 ప్యాకేజీల కింద రూ 42 . 21 కోట్లతో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల కింద చేపట్టే పనుల్లో పూర్తిగా తన ముద్రే ఉండాలని మేయర్ అజీజ్ వ్యూహరచన చేశారు. కాల్వలు, సిమెంటు రోడ్లు, తారు రోడ్ల పనులు మొత్తం తాను చెప్పిన వారికే దక్కేలా టెండరు నిబంధనలు తయారు చేయించారనే ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్, ఆర్ అండ్బి శాఖలు పెట్టే టెండర్ నిబంధనలను తొలిసారి కార్పొరేషన్ పనుల్లో అమలు చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా రాజకీయం నడిపారు. ఈ పనులకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఆనం సోదరులు తమ మద్దతు దారులైన పెద్ద కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు. మేయర్ ప్రతి పనికీ తక్కువతో టెండర్లు దాఖలు కాకుండా ఏర్పాటు చేయించుకున్నందున ప్రతి పనికీ 10 శాతం తక్కువతో టెండర్లు దాఖలు చేయాలని తమ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన సుమారు 10 మంది కాంట్రాక్టర్లతో ఆనం సోదరులు నేరుగా మాట్లాడారని సమాచారం. తాము చెప్పిన వారికే పనులు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఒక వైపు తమ మద్దతు దారులైన కాంట్రాక్టర్లను రంగంలోకి దించి తక్కువతో టెండర్లు దాఖలు చేయించడం, ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన వారిని తమ దారిలోకి తెచ్చుకుని అజీజ్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. ఇక పోతే రూరల్ నియోజక వర్గ పనులకు సంబంధించి కూడా కాంట్రాక్టర్లతోనేరుగా మాట్లాడి పనులు తమ చేతుల్లోకి తెచ్చుకుంటే ఆదాల ఆధిపత్యానికి కూడా చెక్ పెట్టే వ్యూహం అమలు చేశారు. తమ నియోజక వర్గంలో చేయబోతున్న పనులకు సంబంధించి ఆనం సోదరులు కాంట్రాక్టర్లతో మాట్లాడటం పట్ల ఆదాల ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టబోయే పనులు అగ్రవర్ణనేతల మధ్య రాజకీయ పో రాటానికి అస్త్రాలుగా మారడంపై అటు అధికార వర్గాలు, ఇటు టీడీపీ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. -
'మా నాయకుడి ముందు నువ్వు బచ్చా'
అజీజ్.. నువ్వు ముస్లింల పరువు తీస్తున్నావు ఆనం వర్గం మైనార్టీ నాయకుడు మునాఫ్ నెల్లూరు : ‘ఆనం వివేకానందరెడ్డి ముందు నువ్వు బచ్చా’ అని మాజీ కార్పొరేటర్ మునాఫ్ మేయర్ అబ్దుల్ అజీజ్ పై మండిపడ్డారు. ఏసీ సెంటర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనార్టీలను అడ్డంపెట్టుకుని రూ.కోట్లు దండుకున్న అజీజ్ తమ నాయకుడు వివేకానందరెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. ఎంతో మంది మైనార్టీలు నెల్లూరులో నాయకులుగా ఎదిగారన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లకే అజీజ్‌కు అవినీతిపరుడుగా ముద్రపడిందన్నారు. ఆయన వల్ల మైనార్టీలందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. రొయ్యలు వ్యాపారం చేసుకో కానీ ఆనం వివేకాందరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అజీజ్ నెల్లూరు కార్పొరేషన్లో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ అజీజ్‌ను తిక్క పనులు చేస్తున్నావని చెప్పిన విషయం గుర్తుచేశారు. అజీజ్ పోటీ చేసిన, ఆయన తమ్ముడు పోటీ చేసిన స్థానంలో గెలుపొందేందుకు రూ.4 కోట్లు ఖర్చు చేశారన్నారు. నెల్లూరులో ఆనం బలం తెలుసు కాబట్టే చంద్రబాబునాయుడు స్వయంగా కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తన కార్పొరేటర్లను అజీజ్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికైనా శ్రీని వాసులురెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆనం వర్గీయులు ముజీర్, అలియాజ్, షమీమ్, ఏజాస్, నిస్సార్ పాల్గొన్నారు. -
ఆనం vs అజీజ్
► అవినీతికి మారుపేరైనా ఆనంవివేకానందరెడ్డి అవినీతి గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది - మేయర్ అబ్దుల్ అజీజ్ ► నెల్లూరు కార్పొరేషన్ పాలనను మేయర్ అబ్దుల్ అజీజ్ భ్రష్టు పట్టించారు- మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ► పందులు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటాయని వివేకా విమర్శ ►ముస్లిం మేయర్ కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని వివేకాపై అజీజ్ ఎదురుదాడి ►సొంత కార్పొరేషన్లో అవినీతితో నారాయణకు తలనొప్పి ► నేతలిద్దరి ఆరోపణలతో పార్టీకి నష్టమని చంద్రబాబుకు బీద ఫిర్యాదు నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో ఆదివారం జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు తెలుగుదేశం పార్టీలో రాజకీయ దుమారాన్ని రాజేశాయి. ఇంత కాలం గుంభనంగా ఉన్న మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సోమవారం నువ్వు అవినీతి పరుడివంటే నువ్వే అవినీతి పరుడివని ఆరోపణలు చేసుకున్నారు. ‘పందులకు బురదలో దొర్లితేనే ఆనందంగా ఉంటుంది’ అని వివేకానందరెడ్డి పరోక్షంగా అజీజ్ మీద అవినీతి దాడి చేశారు. నువ్వేం నెల్లూర్ కానవాబ్, నెల్లూర్‌కా సుల్తాన్ అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదని తీవ్రమైన విమర్శలు చేశారు. ఆనం వివేకా తనను పందితో పోల్చి మతాన్ని కించపరచారని అజీజ్ మతం కార్డు విసిరారు. ముస్లిం మైనారిటీ మేయర్ కావడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారని ఎదురుదాడికి దిగారు. నెల్లూరు నగర పాలక సంస్థలో ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించారనీ, రెండేళ్లుగా ఈ వ్యవహారం శృతి మించిందని టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. మేయర్‌కు పాలన మీద పట్టు లేక పోవడం, మేయర్, ఆయన సోదరుడు జలీల్ దందాల కారణంగా అధికారులు సైతం ఎవరికి దొరికనంత వారు దోచేస్తున్నారని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీలోకి తమ రాకను అడ్డుకునే ప్రయత్నం చేసిన మేయర్ అజీజ్ కథ చూడాలని ఆనం కుటుంబీకులు సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కొంత కాలం కిందటి వరకు ఒకరి మీద ఒకరు పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో మంత్రి నారాయణకు అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి నారాయణ మేయర్ మీద బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ మరుసటి రోజే ఆనం రంగమయూర్‌రెడ్డి మేయర్ మీద బహిరంగ విమర్శలకు దిగారు. అజీజ్ పాలనలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలో అన్ని కొర్పొరేషన్లకంటే వెనుకపడిందని ఆరోపించారు. రంగ మయూర్ ఆరోపణలపై గుర్రుగా ఉన్న అజీజ్ అప్పట్లోనే ఘాటుగా స్పందించాలనుకుని ఆగిపోయారు. కార్పొరేషన్ మీద పట్టు సాధించలేకపోతే టీడీపీలోని తన వ్యతిరేకులు తొక్కేస్తారనే భయంతో అజీజ్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తాను చెప్పినట్లే వినాలనే ఒత్తిడి పెంచారు. తనను వ్యతిరేకిస్తున్న పెద్ద నాయకులతో పొసగని వారందరినీ తన గూట్లోకి తెచ్చుకునేందుకు చాపకింద నీరుగా పావులు కదుపుతున్నారు. సమయం, సందర్భం చూసి అజీజ్‌ను దెబ్బకొట్టాలని ఆనంతోపాటు టీడీపీలోని మిగిలిన కొందరు నేతలు ఎదురు చూస్తున్నారు. వివేకా వర్సెస్ అజీజ్ కార్పొరేషన్ పై ఏసీబీ దాడుల నేపథ్యంలో సోమవారం వివేకానందరెడ్డి మేయర్ అజీజ్ మీద నేరుగా దాడికి దిగారు. అజీజ్ అవినీతి వల్ల మంత్రి నారాయణ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందనీ, జిల్లాలో టీడీపీకి కూడా చెడ్డపేరు వచ్చిందని తెలివిగా ఈ వ్యవహారాన్ని మంత్రికి, పార్టీకి చుట్టేశారు. ఇదే విధంగా ఉంటే సీఎం కౌన్సిల్‌ను రద్దు చేసే పరిస్థితి వస్తుందని పరోక్షంగా మేయర్‌ను హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ మేయర్‌ను, ఆయన తమ్మున్ని బుక్ చేయలేక సిబ్బందిని బుక్ చేశారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా వ్యాఖ్యల్ని తొలుత తేలిగ్గా తీసుకున్న అజీజ్ ఆయన విమర్శలు చేస్తూనే ఉంటారు అని వ్యాఖ్యానించి వదిలేశారు. సాయంత్రం టీడీపీ నగర అధ్యక్షుడు, వివేకా రాజకీయ విరోధి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపిం చుకుని చర్చించారు. వివేకాకు ఇప్పుడే గట్టిగా సమాధానం చెప్పకపోతే మరింత రెచ్చిపోతారని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విలేకరుల సమావేశం పెట్టి అజీజ్, కోటంరెడ్డి ఇద్దరూ వివేకా మీద విరుచుకుపడ్డారు.‘‘ మేయర్ భానుశ్రీ హయాంలో వివేకా కార్పొరేషన్లో చేయని అవినీతి లేదని, కార్పొరేషన్ ఏమైనా వివేకా జాగీరా, మీరు, మీ తాబేదార్లే మేయర్‌గా ఉండాలా? ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి మేయర్ అయితే ఓర్వలేక పోతున్నావు? నువ్వు టీడీపీని బాగు చేయడానికి వచ్చావా? నాశనం చేయడానికి వచ్చావా’’ అని తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేశారు. నీ పదేళ్ల హయాంలో కార్పొరేషన్లో జరిగిన అవినీతి మీద విజిలెన్స్ విచారణ జరిపించి నీ అవినీతి బండారం బయటపెడతానని మేయర్ హెచ్చరించారు. ఆనం వైఎస్సార్సీపీ వారితో కలిసి పోయి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణకు తలనొప్పే నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి విజృంభిస్తోందని సొంత పార్టీ వారే చెప్పడం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు తలనొప్పి తెచ్చేలా ఉంది. కార్పొరేషన్లో జరుగుతున్న వ్యవహారాలపై ఇప్పటికే జనం అసంతృప్తిగా ఉన్నారు.చంద్రబాబు దృష్టికి వివాదం నెల్లూరుకార్పొరేషన్ అవినీతి వ్యవహారాలపై మేయర్, మాజీ ఎమ్మెల్యే చేసుకున్న బహిరంగ ఆరోపణలను జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారని తెలిసింది. -
టీడీపీలో టోల్గేట్ చిచ్చు
► వివాదంపై మంత్రి నారాయణ, శిద్దా అసహనం ► మాజీ మంత్రి ఆనం బినామీ పేరుతో టెండర్ దక్కించుకున్నారని ఆరోపణలు ► ఏడాదికి రూ.24 కోట్లు కొల్లగొట్టేలా స్కెచ్ వేశారని టీడీపీ వర్గాల ప్రచారం ► తాను అలాంటి బ్యాచ్ వాడిని కాదని, కాంట్రాక్టర్లతో మాట్లాడలేదన్న ఆనం నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల్లో టోల్ గేట్ చిచ్చు భగ్గు మంది. కర్నూలు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో కలిసి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బినామీ పేరుతో టోల్గేట్ చేజిక్కిం చుకునేలా రాజకీయం నడిపారని పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. టోల్‌గేట్‌ను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించినా మళ్లీ ఈ వ్యవహారం తెర మీదకు రావడంపై మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొండాయపాలెం వద్ద జాతీయ రహదారుల సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) గత ఏడాది టోల్గేట్ ఏర్పాటుకు ప్రయత్నించింది. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో టోల్గేట్ ఏర్పాటు చేయరాదు. కొండాయపాలెం టోల్గేట్ ఈ నిబంధనకు విరుద్ధం కావడంతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజల తరపున పోరాటం ప్రారంభించారు. సమస్యను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీధర్‌రెడ్డి పోరాటానికి సిటీ ఎమ్మెల్యే అనికుమార్యాద్వోతోపాటు అఖిలపక్ష నాయకులు మద్దతు పలికారు. వీరంతా టోల్‌గేట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేయడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్ పడింది. టోల్గేట్ ఏర్పాటు రద్దు చేసినట్లు మంత్రులు నారాయణ, శిద్దారాఘవరావు ప్రకటించారు. రహస్యంగా టెండర్లు టోల్గేట్ విషయాన్ని జనం మరచిపోయారు. అయితే గత నెల 29వ తేదీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆన్లైన్లో టోల్గేట్ ఏర్పాటుకు ఆన్‌లైన్‌తో టెండర్లు ఆహ్వానించింది. ఈనెల 5వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి గడువుగా నిర్ణయించింది. ఆర్నెల్లకు రూ.26.06 కోట్లు వసూలు లక్ష్యంగా నిర్ణయించింది. రహస్య టెండర్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి ఆందోళనకు దిగారు. టెండర్ల దాఖలుకు చివరి రోజైన గురువారం ఆన్లైన్లో ఐదుగురు కాంట్రాక్టర్లు నామినేషన్లు వేయగా, గడువు ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కర్నూలుకు చెందిన శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. వెంకటాచలం టోల్గేట్లో రోజుకు రూ .4 లక్షల నుంచి రూ.15 లక్షలు వసూలు అవుతోంది. కొండాయపాలెం టోల్గేట్లో కూడా కాస్త అటు ఇటుగా అంతే మొత్తం వసూలు కావాలి. ఈ లెక్కన ఏడాదికి రూ.54 కోట్ల దాకా వసూలు కావాలి. అయితే టెండర్ ధర ఖరారులోనే దీన్ని సగానికి సగం తగ్గించి రూ.26.06 కోట్లుగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారు. ఇందులో నెలకు రూ.2 కోట్లు చొప్పున ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వ్యూహం అమలు చేశారు. రోజుకు రూ.14 లక్షల దాకా వసూలయ్యే టోల్‌గేట్‌ను రోజుకు రూ 6.60 లక్షలు చెల్లించేలా టెండర్ ఖరారు చేయడానికి తెర చాటు వ్యవహారాలన్నీ పూర్తి చేశారు. ఆనం ఎంటరయ్యారా? టోల్గేట్ ఏర్పాటే వద్దని ప్రజలు తిరగబడుతుంటే కర్నూలు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి సన్నిహిత సంస్థతో కలిసి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బినామీ పేరుతో ఈ టోల్గేట్ దక్కించుకోవడానికి రాజకీయం చేశారని టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. ఈ విషయం గురించి కాంట్రాక్టర్లతో ఆయనే స్వయంగా మాట్లాడారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు పడిన తాము ఇంకా అలాగే ఉంటే, పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీలోకి వచ్చిన ఆయన సెలైంట్‌గా ఈ తరహా వ్యవహారాలు చేస్తున్నారని ఆ వర్గం మండిపడుతోంది. టోల్గేట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినా మళ్లీ ఈ వ్యవహారం తెర మీదకు రావడానికి ఈ రాజకీయమే కారణమని టీడీపీ కార్పొరేటర్లు సైతం ఆఫ్‌ది రికార్డ్‌లో ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఈ తంతు తనకు కూడా రుచించలేదనీ సీఎంతో మాట్లాడి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీద ఒత్తిడి తెచ్చి టోల్గేట్లేకుండా చేస్తానని మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యుల వద్ద చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అధికార పార్టీలో పెద్ద చిచ్చే రగిల్చే పరిస్థితి తీసుకుని వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. నగరం మొత్తం ప్రమాదాల జోన్ అవుతుంది కొండాయపాలెం వద్ద టోల్గేట్ ఏర్పాటు అయితే వాహనాలు ఈ పన్ను తప్పించుకోవడానికి అయ్యప్యగుడి మీ దుగా నగరంలోకి వచ్చి చిన్న పిల్లల పార్కు మీదుగా టోల్గేట్ దాటుకుని వెళ్లడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా నగరంలో రోడ్డు భారీగా దెబ్బ తినడంతో పాటు, నగరం మొత్తం ప్రమాదాల జోన్‌గా మారుతుంది. ఈ కారణంగానే ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేను అలాంటి బ్యాచ్ కాదు : ఆనం రామనారాయణరెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నలుగురైదుగురు మాజీ మంత్రులు ఉన్నారు. వీరిలో ఎవరు టోల్గేట్ వ్యవహారంలో తల పెట్టారో నాకు తెలియదు. నేనైతే ఇలాం టి వ్యవహారాలు నడిపే బ్యాచ్ కాదు. కొండాయపాలెం టోల్గేట్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. బినామీ పేరుతో టోల్గేట్ దక్కించుకోబోతున్నాని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏ కాంట్రాక్టర్‌తోనూ తాను మాట్లాడలేదని ఆనం అంటున్నారు. -
పిలుపు వస్తే టీడీపీ కార్యాలయానికి వెళ్తా
► మంత్రి నారాయణ అడ్మినిస్టేటర్, నాయకుడు కాదు ► టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు, సిటీ: టీడీపీ కార్యాలయం నుంచి తనకు పిలుపు రాలేదని, ఎవరైనా తనను బాధ్యతాయుతంగా పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీ సెంటర్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు జన్మదినం ఈ ఏడాది ప్రత్యేకమైందన్నారు. కొత్త రాజధాని నిర్మిస్తున్నారన్నారు. అందరూ రాజకీయాలు పక్కనపెట్టాలన్నారు. టీడీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్లడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి రంగనాయకులపేట వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పిలవడంతో వెళ్లడం జరిగింది. మంత్రి నారాయణ రాజకీయనాయుడు కాదని, అడ్మినిస్ట్రేటర్ మాత్రమేనన్నారు. ఇటీవల వచ్చిన మంత్రుల ర్యాంకుల్లో నారాయణకు చివరి ర్యాంకు రావడంపై ఆనం స్పందిస్తూ అందరిలాగా రాజకీయ వ్యక్తి కాదన్నారు. రాజధాని నిర్మాణంలో సృష్టి కర్త చంద్రబాబు అయితే అమలు చేసేది నారాయణ అని తెలిపారు. మరో రెండు సంవత్సరాలు గడిస్తే పూర్తిస్థాయి రాజకీయ నేతగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రంరెడ్డి మాధవ్‌రెడ్డి, గిరి, శ్రీగిరిచక్రవర్తి, రంగమయూర్‌రెడ్డి, నజీర్, మునాఫ్, పేరారెడ్డి, ఇలియాజ్, రాధాకృష్ణారెడ్డి, ముజీర్ పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో తారస్థాయికి రచ్చ
అంతర్గత బదిలీల్లో రాజకీయం మేయర్‌ను వ్యతిరేకిస్త్తున్న ఓ వర్గం ఆనం పాత్ర ఉందంటూ మేయర్ వర్గం ఆరోపణ నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థలో రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య రేగిన వివాదం రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెడుతోంది. నెల్లూరు కార్పొరేషన్లో శానిటరీ సూపర్వైజర్, ఇన్స్పెక్టర్ల అంతర్గత బదిలీల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. మేయర్ అజీజ్ వ్యవహారంపై ఓ సామాజికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ వర్గాన్ని అణిచేస్తున్నారని మండిపడుతున్నారు. మేయర్‌పై మంత్రి నారాయణకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఆనం వివేకా హస్తం ఉందంటూ మేయర్ వర్గం ఆరోపిస్తోంది. కార్పొరేషన్లో పట్టు కోసం సామాజికవర్గాలను రెచ్చగొడుతున్నారని మేయర్ వర్గం విమర్శలు చేస్తోంది. కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ మాల్యాద్రిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే మేయర్, వివేకా మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో ఓ సామాజికవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి ఆనం వర్గీయుడు పిండి సురేష్ హాజరయ్యారు. ఆరోజు మేయర్ వ్యవహారంపై సుదీర్గంగా చర్చించారు. మంత్రి లేదంటే.. సీఎంను కలిసి వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదేక్రమంలో గురువారం ఆనం వర్గీయులైన కిన్నెర మాల్యాద్రి, రంగమయూర్‌రెడ్డి అనుచరులు కమిషనర్‌ను కలిసి బదిలీ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కమిషనర్ మాత్రం బదిలీలను నిబంధనల మేరకే చేశామని చెప్పారు. సామాజికవర్గాన్ని రెచ్చగొడుతున్న వైనం : కార్పొరేషన్ పరిధిలో ఇటీవల జరిగిన టెండర్ల రద్దు.. అధికారుల బదిలీలను అస్త్రాలుగా చేసుకుని ఆనం ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్లో పనిచేసే అధికారులకు ఈ విషయం తెలియడంతో వణికిపోతున్నారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనం వివేకా ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని తెలుసుకున్న మేయర్ తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా గురువారం రాత్రి అదే సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం మేయర్ అజీజ్‌ను కలవడం గమనార్హం. అయితే ఈ విషయంలో మేయర్ వర్గానికి చెందిన కొందరు కార్పొరేషన్ ఉద్యోగులను కలిసి ఈ విషయంలో తలదూర్చవద్దని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మొన్నటి వరకు కలిసి ఉన్న కొందరు ఉద్యోగులు ఆ వర్గంతో దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఆనం, మేయర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు సామాజిక వర్గాన్ని బలిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
చంద్రబాబు దేవుడు కాదు
నెల్లూరు, సిటీ: ఇచ్చిన హామీలను అన్నింటిని ఒకేసారి నెరవేర్చడానికి సీఎం చంద్రబాబునాయుడు దేవుడు కాదని, క్రమంగా నెరవేరుస్తారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఏసీ సెంటర్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడలో రాజధాని నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బర్నాబాస్, చక్రవర్తి, కేవీ రాఘవరెడ్డి, రాజేష్, ప్రేమ్, ముజీర్, పేరారెడ్డి, చిన్ని శేఖర్, మునాఫ్, ముజావీర్, శివ, మదన్, తదితరులు పాల్గొన్నారు. -
టార్గెట్ ఆనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని టార్గెట్ చేశారు. కొద్దిరోజులుగా ఆనం వివేకానందరెడ్డి తన కుమారుడు రంగమయూర్‌రెడ్డి ద్వారా చేయిస్తున్న విమర్శలపై టీడీపీ నాయకులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో భాగంగా సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆనం, ఆయన వర్గీయుల తీరుపై చర్చించారు. గతంలో ఆనం వర్గీయులు టీడీపీ నేతల పట్ల వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అనూరాధ తమ పట్ల ఆనం వివేకా ప్రవర్తించిన తీరును జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పదవులు పోవటానికి దారి తీసిన సంఘటనలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరించినట్లు సమాచారం. అదేవిధంగా మేయర్ అబ్దుల్ అజీజ్ ఇప్పటికే ఆనం వర్గీయులపై ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. నగరపాలక సంస్థలో మేయర్‌కు వ్యతిరేక వర్గాన్ని తయారుచేయడం, టెండర్లలో తలదూర్చటం వంటి కార్యక్రమాలతో మేయర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మేయర్ వర్గీయులు కూడా ఆనం వివేకా, కుమారుడు రంగమయూర్రెడ్డిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో ఆనం చేయిస్తున్న కార్యక్రమాలను బీద రవిచంద్ర వద్ద ఫిర్యాదు చేశారు. ఇకపోతే నగరపార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇప్పటికే ఆనంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం కూడా తనదైన శైలిలో ఆనంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగరపార్టీ తరుపున ఆనం, ఆయన వర్గీయులపై పార్టీ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు తెలిసింది. అదేవిధంగా మిగిలిన మరి కొందరు ముఖ్యమైన నేతలు కూడా ఆనంపై ఫిర్యాదు చేశారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనం చేస్తున్న వాటిని అధినేత చంద్రబాబు, మంత్రి నారాయణకు ఫిర్యాదు చేయాలని పట్టుబట్టారు. పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇకపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం ఆపేయాలని బీద రవిచంద్ర గట్టిగా చెప్పినట్లు సమాచారం. మూకుమ్మడి దాడి.. ఆనం సోదరులు టీడీపీలో చేరడాన్ని జిల్లా నేతలకు మొదటి నుంచి ఇష్టం లేదు. ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తప్ప మిగిలిన వారంతా ఆనం వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే. అధిష్టానానికి పలురకాలుగా ఫిర్యాదులు చేశారు. పార్టీ నాయకుల మనోభావాలను పక్కనపెట్టిన అధినేత ఆనం సోదరులను పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొద్దిరోజులపాటు ఆనం సోదరులు స్తబ్దుగానే ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు పెద్ద ఎత్తున మంజూరు కావడం, ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలవటంతో రగడ రాజుకుంది. ఆనం వర్గీయులు టెండర్లు వేయటం, వాటిని మేయర్ నిలిపివేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య ఆగ్గి రాజుకుంది. మేయర్‌ను ఎలాగైనా దింపే పథకం కూడా వేశారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మేయర్ వర్గం ఎదురుదాడికి దిగటంతో అగ్గి రాజకుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఒకరు చేసిన తప్పులు ఒకరు బయటపెట్టుకున్నారు. ఇన్నాళ్లు గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. టీడీపీకి ఓట్లేసిన వారు ‘ఛీ’ కొట్టటం ప్రారంభించారు. అభివృద్ధి పనులు చేసి జనం ఆదరణ పొందమని ఓటేస్తే డబ్బుల కోసం జనం సమస్యలను పక్కనపెట్టటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆనం సోదరులకు ఎదురుదెబ్బ!
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ తగలనుంది. ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. శనివారం వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలను కలసి ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు. అనంతరం ఆనం విజయ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలు తనకు నచ్చాయని, ఆయన నేతృత్వంలో పార్టీలో పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అనుచరులతో మాట్లాడి త్వరలో పార్టీలో చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీలో చేరడం పట్ల విజయ్‌కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. -
'ఏపీలో 225కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు'
విజయవాడ : మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆనం సోదరులిద్దరు టీడీపీ చేరారు. ఆనం సోదరులిద్దరికి పచ్చ కండువా కప్పి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 225 కి పెరుగుతాయన్నారు. పార్టీలో కొత్తగా చేరేవారికి అప్పుడు అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే, సహాజనటి జయసుధ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... శనివారం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. -
వామ్మో వాళ్ల స్పీడును ఎవ్వరూ చేరుకోలేరు..
వామ్మో వాళ్ల స్పీడును ఎవ్వరూ చేరుకోలేరు అంటున్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలు. ఇటీవల నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఆపార్టీని వీడారు. పచ్చ కండువా కప్పుకున్నారు. రాజకీయ అవసరాల కోసం ఒక పార్టీని వీడి మరో పార్టీలో చేరటాన్ని టీడీపీ నేతలు కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వాటిని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఈ ఇరువురు నేతలు టీడీపీలో చేరేందుకు విజయవాడలోని సీఎం నివాసానికి అలా బయలుదేరారో లేదో వెంటనే వారి నివాసాల్లో ఉన్న పాత ఫొటోలన్నింటినీ తొలగించేశారట. ఏంటయ్యా ఇది అంటే మరి మనం పార్టీ మారాం కదా పాత వాసనలు ఎందుకని తీసి పక్కన పెట్టాం అని చెప్తున్నారట. వీరికంటే ముందు అధికార పార్టీలోకి జంప్ చేసిన ఓ నేత వామ్మో వాళ్ల స్పీడును నా బోటి వారు అందుకోలేరు..! నేను పార్టీ మారి ఏడాదిన్నర అవుతోంది. ఇంత వరకూ గతంలో ఉన్న పార్టీలోని నేతలతో తీయించుకున్న ఫొటోలను ఇప్పటికీ తీసేయలేదు. అవి మధురమైన జ్ఞాపకాలు. కండువాలు మార్చినపుడల్లా జ్ఞాపకాలు మార్చలేం కదా అని వ్యాఖ్యానించారు. -
టీడీపీలో చేరిన ఆనం సోదరులు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆనం సోదరులు బుధవారం టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తమ జిల్లాకు చెందిన మంత్రి పి.నారాయణతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబు.. ఆనం సోదరులకు పచ్చకండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారి హోదాను గుర్తించి పార్టీలో ఆనం సోదరులకు తగిన గౌరవం, పదవులు దక్కుతాయని బాబు పేర్కొన్నట్లు సమాచారం. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు భావించాలని బాబు వారికి సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిక అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తమ నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించుకున్నందున నేడు అధికారికంగా వివరాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నా తాము.. గత ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా బరిలో దిగామని, అధిష్ఠానం వైఖరిలో మార్పు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏదైనా తప్పు జరిగిందని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికీ భావించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకతతో టీడీపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
టీడీపీ గూటికి ఆనం బ్రదర్స్
-
ఎవరు పార్టీని వీడినా నష్టమేమి లేదు : రఘువీరా
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భైరవకోనలో మట్టి సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగేలా లక్ష ప్రదేశాల నుంచి మట్టి సేకరించి పంపుతామని తెలిపారు. ఇక ఆనం రాంనారాయణ రెడ్డి సోదరులు పార్టీని వీడటంపై రఘువీరారెడ్డి పరోక్షంగా స్పందించారు. ఎవరు పార్టీని వీడినా కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమి లేదని ఆయన వ్యాఖ్యానించారు. (త్వరలో ఆనం సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న విషయం తెలిసిందే) ఈ కార్యక్రమంలో ప్రకాశం డీసీసీ అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ఆనం బ్రదర్స్ గుడ్‌బై
కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన ఇంట్లో అన్న ఆనం వివేకానంద రెడ్డితో కలిసి తమ మద్దతుదారులతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మాటలను అధిష్ఠానం పెడచెవిన పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వివరించారు. తాము కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా ఉన్నామని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచే జిల్లాలో తమ రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందన్నారు. ఈ చర్చకు తెరదించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. కార్యకర్తలు తాను ఏ పార్టీలో చేరినా అండగా నిలబడతామని చెప్పడం సంతోషకరమని రామనారాయణరెడ్డి అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా పార్టీలో చేరాల్సిందిగా తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల గ్రాఫ్ ఇప్పుడు మరింత దిగజారిపోయిందని తెలిపారు. తమను నమ్ముకున్న ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే బలమైన పార్టీలో చేరడం తప్పదని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని తెలిపారు. టీడీపీలో చేరే తేదీలను మరో మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. -
సింహపురి టీడీపీలో చిచ్చు
-
రఘువీరాపై ఆనం అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డిపై ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలో పలు పదవులను పీసీసీ తమను సంప్రదించకుండానే భర్తీ చేసిందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు తాము నిర్వహిస్తుంటే... పదవులు మాత్రం ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ల సిఫార్స్ మేరకు పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ పద్దతి బాగాలేదని రఘువీరారెడ్డికి చెప్పినట్లు ఆనం వివేకానందరెడ్డి వివరించారు. -
టీడీపీని గెలిపించినందుకు ప్రజలే సిగ్గుపడుతున్నారు
తిరుమల : కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓటు వేసి గెలిపించామా అని ప్రజలే సిగ్గుపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టే వరకు బీజేపీ, తెలుగుదేశం నిద్రపోలేదన్నారు. హామీలు, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీల వంటి మాయమాటలు విని ప్రజలు మోసపోయారన్నారు. ఈ విషయాలను గుర్తిం చిన ప్రజలు బీజీపీ, తెలుగుదేశం పార్టీలకు అధికారాన్ని ఇచ్చి తప్పుచేశామని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజన కు ప్రధాన కారణం చంద్రబాబు నా యుడు, వెంకయ్య నాయుడేనన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోగా చట్టబద్ధతలేదని కుంటిసాకులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఆకలిచావులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేయటం సరికాదన్నారు. -
'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా'
నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిచ్చి చేష్టలపై త్వరలో సినిమా తీయనున్నట్టు సినీ నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరులోని రామ్‌నగర్‌లో ఉన్న స్థలంపై కమీషన్ కోసం వివేకా కావాలనే వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2008లోనే మక్సూద్ అలీ వద్ద స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు కళ్యాణ్ చెప్పారు. అప్పట్లో ఆ స్థలం మైనార్టీల శ్మశానం అంటూ కొందరు కోర్టుకు వెళ్లగా.. అది తప్పని, ఆ స్థలం ప్రైవేటుదేనని కోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. రామ్‌నగర్‌కు కార్పొరేటర్‌గా, అప్పటి మేయర్‌గా కొనసాగిన భానుశ్రీకి తాను అక్కడ 100 అంకణాల స్థలం ఇచ్చినట్లు అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయని, వాటిని వివేకా చూసి ఖండించాల్సిందిగా తనను ఆ రోజు కోరారన్నారు. ఆ రోజు 100 అంకణాల స్థలం ఇవ్వలేదని ఈ రోజు రాజకీయం చేస్తావా? అంటూ వివేకానుద్దేశించి కళ్యాణ్ ప్రశ్నించారు. వివేకాకు అధికారం పోయిన తర్వాత పిచ్చి పట్టిందని, అందువల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. -
'ఆయన అక్రమాలపై సినిమా తీస్తాను'
-
'ఆంధ్రప్రదేశ్ లో లోకేశ్ పాలన'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేశ్ పాలన కొనసాగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఏప్రిల్‌లో విధుల నుంచి తొలగించిన అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలను ఇబ్బందులు పెడుతూ వారి ఉసురు పోసుకోవద్దని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. ప్రజలను అన్ని రకాలుగా మోసంచేస్తున్నారని వివేకా మండిపడ్డారు. ఇంత మంది ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు ఐదేళ్లు పదవిలో ఉండబోరన్నారు. నారా లోకేశ్ కు ఏం సంబంధం ఉందని ఆయన వెంట అధికారులను అమెరికాకు పంపారని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి మాట్లాడుతూ చంద్రబాబు పదవిలోకి వచ్చీ రాగానే అంగన్వాడీలను అణగదొక్కడం మొదలు పెట్టారన్నారు. ఆడవాళ్లే కదా నోరెత్తి మాట్లాడలేరని 15 మంది అంగన్వాడీలను తొలిగించారన్నారు.. వీరికి మద్దతుగా దీక్షల చేస్తున్న అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చారన్నారు. దీనిని చూస్తే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? నియంత పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఐసీడీఎస్‌ను కాపాడుకునేందుకు సేవ్ ఐసీడీఎస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. -
'పవన్...చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు'
హైదరాబాద్ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా వాడుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో జయప్రద, బాబుమోహన్ వంటి సినీ ప్రముఖులను చంద్రబాబు రాజకీయంగా వాడుకుని వదిలేశారని ఆయన మంగళవామిక్కడ అన్నారు. ఈ వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని, చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి సూచించారు. పవన్ కల్యాణ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆనం అన్నారు. ఏపీ రాజధానికి 500 ఎకరాలు జరిపోతాయని, సింగపూర్‌కు తాకట్టు పెట్టేందుకే చంద్రబాబు వేల ఎకరాల భూ సేకరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, నరేంద్ర మోదీ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. -
'అష్టమాస పాలనలో ఫలితం శూన్యం'
తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అష్టమాస పాలన సాగించాయని, సాధించిన ఫలితం మాత్రం శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అష్టమాస పాలనలో ఏమి జరిగిందయ్యా అంటే... కేంద్రం సలహాలిస్తే, రాష్ట్రం సూచనలు మాత్రమే చేసిందన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కన్సెల్టెన్సీ పాలన చేస్తున్నాయని ఆరోపించారు. భూసేకరణ బిల్లును అన్ని రాజకీయ పార్టీనేతలు వ్యతిరేకిస్తున్నా తెలుగుదేశం, బీజేపీ నేతలు మాత్రం బలవంతంగా తీసుకురావాలని కోరుకోవడం దారుణమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకిచ్చిన రుణమాఫీని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిద్వారా చంద్రబాబు సాహసోపేతంగా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ మాఫియాకు తెరతీసాడని, సింగపూర్, జపాన్ దేశ కాంట్రాక్టర్లతో కలసి లాండ్ పూలింగ్ పేరుతో ల్యాండ్ మాఫియా నడిపిస్తున్నారని ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. భూసేకరణ చట్టం మీద పెట్టిన దృష్టి పేదలు, రైతులను ఆదుకునే రుణమాఫీ అమలుపై చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. మూడు సంవత్సరాలుగా రుణాలు కట్టొద్దుంటూ ఢంకా మోగించిన చంద్రబాబు రైతుల పరువు తీశారన్నారు. -
ఆనం మాస్టర్‌ప్లాన్
సాక్షి: ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరానికి సంబంధించి తాజా మాస్టర్‌ప్లాన్‌పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభ్యంతరాలతో అందులోని లొసుగులు వెలుగుచూస్తున్నాయి. మొన్నటి వరకు నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దశాబ్దానికి పైగా రాజకీయం చేసిన ఆనం కుటుంబం ఈ వ్యవహరం వెనుక కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. మాస్టర్‌ప్లాన్‌లోని లొసుగులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బయటపెట్టడంతో ఆనం వర్గీయులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో ఎవరి ప్రమేయం ఉండదంటూ తాజా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గళం విప్పడం ఇందుకు నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా తమ హయాంలో నగరంలో ఎక్కడా రోడ్ల విస్తరణ జరగలేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2008లో ప్రారంభమైన తాజా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కసరత్తు 2011కు పూర్తయింది. ఆ ఏడాదిలోనే అప్పటి మేయర్ భానుశ్రీ అధ్యక్షతన కౌన్సిల్ ఆమోదం పొందింది. 2013లో ఈ మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోద ముద్ర వేసింది. ఇదంతా ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగానూ, ఆయన సోదరుడు రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖ మంత్రిగానూ వ్యవహరించినప్పుడు జరిగింది. అప్పట్లో ప్రైవేటు ఏజెన్సీ మాస్టర్‌ప్లాన్ పూర్తి చేసి కౌన్సిల్‌కు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందడం వంటి కీలక పరిణామాలు కింగ్మేకర్లగా వ్యవహరించిన ఆనం సోదరులకు తెలియవనుకుంటే పొరబాటే. ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయాల్సి వస్తే వ్యాపారులకు, పలు ప్రార్థనా మందిరాలకు నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గొంతు చించుకుంటున్నారు. అప్పట్లో ఆయన దీనిపై ఎందుకు స్పందించలేదనేది ఆయనకే తెలియాలి. వారి హయాంలోనే స్టౌన్‌హౌస్‌పేట, వాకర్స్‌రోడ్డు, జీఎన్టీ రోడ్డు, రైల్వేఫీడర్స్‌రోడ్డు వంటి ప్రధాన రోడ్ల విస్తరణ జరిగింది. ఈ పరిస్థితుల్లో తాజా మాస్టర్‌ప్లాన్ అమలునుద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొండాయపాళెం రోడ్డు వెడల్పు తగ్గడంలో మతలబు 1978 తరువాత 2011 సంవత్సరంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని చోట్ల రోడ్ల విస్తీర్ణం తగ్గడంలో ఆనం ప్రమేయం ఉన్నట్లు బహిరంగంగానే విమర్శలున్నాయి. కొండాయపాళెం మార్గంలో 60 అడుగుల రోడ్డును తాజా మాస్టర్‌ప్లాన్‌లో 40 అడుగులకు తగ్గించడం వెనుక సొంత మనుషులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ ప్రాంతంలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత భూములున్నాయి. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో రోడ్ల విస్తీర్ణాన్ని పెంచడానికి బదులు తగ్గించాడని చెబుతున్నారు. మాగుంట లేఅవుట్ సమీపంలో రైల్వే లైన్‌కు పడమర వైపు మాజీ మేయర్‌కు సంబంధించిన బినామీల ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా జాతీయ రహదారి నుంచి అయ్యప్పగుడి వరకు 200 అడుగులు, అక్కడి నుంచి శబరిక్షేత్రం వరకు 150 అడుగులు, అక్కడి నుంచి ఆత్మకూరు బస్టాండు వరకు 100 అడుగులు విస్తరించాలన్న నిర్ణయం కూడా అప్పట్లోనే జరిగింది. తమ కనుసన్నల్లో జరిగిన మాస్టర్‌ప్లాన్‌ను ఆనం ఇప్పుడు వ్యతిరేకించడం హాస్యాస్పదమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
నగరాన్ని శిథిలం కానివ్వను
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారంతా ద్రోహులే ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు (విద్యుత్) : రోడ్ల విస్తరణ పేరుతో నెల్లూరు నగరాన్ని శిథిలం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఏసీ సెంటర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనం మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రజలు, మేధావులు, వ్యాపారులతో చర్చించకుండా రోడ్ల విస్తరణ పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. కార్పొరేషన్ అధికారులు కొలతలు చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ అప్రజాస్వామిక చర్యను అడ్డుకునేందుకు ఈ నెల 6న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. విస్తరణకు ముందస్తు నోటీసులు, గృహస్తులు, వ్యాపారులకు వారు కోరిన మార్కెట్ విలువలను కచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందన్నారు. పరిహారం చెల్లించే విధానంలో వ్యాపార విభాగాలకు మూడు రెట్ల మార్కెట్ విలువను అందించాలని చట్టం సూచిస్తుందన్నారు. ‘ప్రజల్లో నుంచి వచ్చాం కాబట్టి మా కుటుంబానికి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కోట్లు గడించే కార్పొరేట్ అధినేతలకు ప్రజా సమస్యలు ఏం అర్థమవుతాయి’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నగర కార్పొరేటర్లకు, కార్పొరేషన్ అధికారులకు మధ్య తీరని అగాధం ఉందన్నారు. ముందు కింది స్థాయి నుంచి సమావేశాలు నిర్వహించి, కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలే తప్ప మోనార్క్‌లాగా వ్యవహరించడం తగదని ఆయన కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్ బాబుకు చురకలంటించారు. నమ్మక ద్రోహులు పార్టీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందాక టీడీపీలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ద్రోహులేనంటూ ఆనం మండిపడ్డారు. కాంగ్రెస్ పునాదులపై ఈ స్థాయికి వచ్చి నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అంటే తల్లి పాలు తాగి, రొమ్ము గుద్దిన* చందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో వీరంతా పరస్పరం ద్రోహం చేసుకుంటారనడంలో సందేహం లేదన్నారు. సమావేశంలో నగర ఇన్చార్జ్ ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, బర్నా బాస్ తదితరులు పాల్గొన్నారు. -
గాయకుడి అవతారమెత్తిన మాజీ ఎమ్మెల్యే ఆనం
నెల్లూరు : జనాలను ఆకట్టుకోవటంలో ఆయన రూటే సపరేట్. బైక్‌పై దూసుకుపోవటం అయినా, పబ్లిక్‌గా దమ్ము కొట్టడం, చీర సింగారించుకోవటంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సదరు రాజకీయ నేతగారి అలవాటు. సందర్భానికి అనుకూలంగా మారిపోవటం ఆయన స్టైల్. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా, ఆయనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. తాజాగా ఆయన గాయకుడి అవతారం ఎత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయన భక్తిగీతాలు ఆలపించారు. నెల్లూరులోని మూలపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆనం వివేకానందరెడ్డి అక్కడ భక్తులతో పాటు గొంతు కలిపారు. తన గానంతో అక్కడవారిని మెప్పించారు. ప్రసంగాలే కాదు... పాటలు పాడటంలోనూ తనకు తానే సాటి అన్నట్టుగా ఆనం ప్రొఫెషనల్ సింగర్ పాడినట్లు భక్తి గీతాలు పాడటం విశేషం. -
ఆనం వివేకానందుడు గాయకుడుగా మారితే!
-
'ఇందిరమ్మ మాట - కాంగ్రెస్ బాట'
-
తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి ఎప్పుడు వస్తామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎన్నికలు రానే వచ్చాయి. తర్వాత సైకిల్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది 'తముళ్ల'లో ఆనందం తాండవమాడింది. అయితే ఈ ఆనందం క్రమక్రమంగా ఆవిరైపోతుంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అధినాయకుడు పెద్దపీట వేయడం 'పాతతరం' నేతలకు మింగుడు పడటం లేదు. దాంతో తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం టీడీపీలోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన హవా దాదాపుగా తగ్గిపోయింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో అదే జిల్లాకు చెందిన మంత్రి పి. నారాయణ అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో సోమిరెడ్డి వెనుకబడిపోయారు. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అంతేకాదు రాజధాని ఎంపికపై ప్రభుత్వం నియమించిన కమిటీకి ఆయనను అధ్యక్షుడిని చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాకే చెందిన కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు ఆనం సోదరులు నేడే రేపో పచ్చ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆనం సోదరులు కూడా పార్టీలో చేరితే తన పరిస్థితి ఎలా వుంటుందోనని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. అటు అధినేత ఆదరణ కూడా కరువవడంతో సోమిరెడ్డి హడలిపోతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో తన పరిస్థితిని సోమిరెడ్డి... చంద్రబాబు ముందు ఏకరువు పెట్టినా ఆయనకు ఊరట లభించలేదు(ట). జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లోనే పచ్చ జెండా రెపరెపలాడిందంటూ బాబు... సోమిరెడ్డికి క్లాస్ తీసుకున్నారని సమాచారం. దాంతో సోమిరెడ్డి మరింత డీలా పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నుంచి పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో సోమిరెడ్డి ఓటమిపాలైన ఆయనకు పార్టీలలోనూ ఊరట దక్కడం లేదు. పలు జిల్లాల్లో సీనియర్ నాయకుల 'ఆత్మఘోష' ఇలాగే ఉందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. -
టీడీపీలో ఆనం సోదరులు?
లోకేష్ వద్దకు పంచాయితీ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డిల కోరిక ఫలించే అవకాశం కనబడుతోంది. ఈ మేరకు ఆనం సోదరులు నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. అయితే పార్టీలో వారి చేరికపై సీనియర్ నాయకులు, ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాకే చెందిన మంత్రి నారాయణ ఓకే చెప్పినప్పటికీ పార్టీలోకి వస్తే ఆనం సోదరుల ఆధిపత్యం పెరిగిపోతుందని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొంతకాలం వరకు వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు.. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఆనం సోదరులతో సమావేశమైనట్లు సమాచారం. ఆనం సోదరుల విషయాన్ని పరిశీలించాలని పార్టీ వ్యవహారాలు చూస్తున్న లోకేష్‌కు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనం సోదరులతో లోకేష్ ఫోన్లో సంభాషించినట్లు సమాచారం. ఈనెల 24న చంద్రబాబు నెల్లూరు రానున్నారు. ఆలోపే ఆనం సోదరుల వ్యవహారాన్ని తేల్చాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలిసింది. -
బాబును కలసిన ఆనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం సాయంత్రం క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఆనం వివేకానందరెడ్డితో పాటు ఆయన సోదరుడు మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం తెలిసిందే. రుణ మాఫీ అమలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కమిటీవేయడం మంచి నిర్ణయ.మని ఆనం సోదరులు ఇటీవల పొగడ్తలతో ముంచెత్తుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆనం బాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన త్వరలోనే టీడీపీ గూటికి చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఆనం చూపు.. టీడీపీ వైపు!
-
వలస వచ్చిన కేసీఆర్ సీఎం కావచ్చు కానీ...
హైదరాబాద్: తన సోదరుడు అనం రామ్‌నారాయణ రెడ్డితోపాటు తాను తుది శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి స్ఫష్టం చేశారు. టీడీపీ, బీజేపీలో తాము చేరుతున్నామంటూ వస్తున్న వార్తలను వివేకా ఈ సందర్బంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. విజయనగరం నుంచి గతంలో కేసీఆర్ తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తెలంగాణకు రాష్ట్రానికి సీఎం కావొచ్చు కానీ ఏళ్ల తరబడి స్థానికంగా ఇక్కడే ఉంటున్నవారు స్థానికులు కారని చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక అయితే లక్షలాది కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానికత విషయంలో తన వైఖరిని మార్చుకోవాలని కేసీఆర్‌కు ఈ సందర్భంగా వివేకా హితవు పలికారు. -
'డిక్కీ డక్కా రాజాల వల్లే పార్టీ నాశనం'
విజయవాడ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి పార్టీ అధిష్టానం పెద్దలపై నోరు పారేసుకున్నారు. డిక్కీ డక్కా రాజాలు వచ్చే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని ఆయన విమర్శించారు. అసలు నాయకుడికి పెళ్లేలేదు...ముసలి నేతలకు రెండేసి పెళ్లిళ్లా అంటూ ఆనం వ్యాఖ్యలు చేశారు. డిగ్గీ, థరూర్ వంటి బఫూన్లను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌లో కొందరు మంత్రులుగా పదవులు అనుభవించి...కోట్లు సంపాదించి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడారని ఆనం విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేధోమథనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవలి కాలంలో చంద్రబాబును ఆనం సోదరులిద్దరూ పొగడ్తలతో ముంచెత్తుతున్న నేపథ్యంలో ఇరువురూ టీడీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. -
టీడీపీ వైపుకు ఆనం చూపులు?
-
ఆనం బ్రదర్స్ గాలి ఎటు పోయిందో?
నెల్లూరు జిల్లాను తమ కంచుకోటగా భావించి.. ఇన్నాళ్లూ ఏకఛత్రాధిపత్యంగా జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం సోదరులు ఎన్నడూ లేనట్లుగా ఏకంగా ఈసారి పోటీకే దూరం అవుతున్నారు. సోదరులిద్దరిలో అన్న ఆనం వివేకానందరెడ్డి ముందుగానే తాను ఎన్నికల బరిలోకి దిగకుండా.. తన పెద్ద కొడుకు ఆనం చెంచుసుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి)ని నెల్లూరు సిటీ స్థానం నుంచి బరిలోకి దింపారు. ఇప్పుడు అన్నగారి బాటలోనే తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు అసెంబ్లీ స్ధానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన రామనారాయణ రెడ్డి, ఇప్పుడు దాన్ని విరమించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని, విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఈసారి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న భావనతోనే ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకొనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. వాస్తవానికి ఇదే ఉద్దేశంతో ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా ఆనం సోదరుల వెంట ఉన్న ప్రధాన నాయకులు చాలామంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీవైపు వెళ్లారు. దాంతో అనుచరులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగడం ఆత్మహత్యాసదృశం అవుతుందని, అందుకే నామినేషన్ ఉపసంహరించుకోవాలని రామనారాయణరెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఈసారి ఆయన పోటీ చేయకపోతే.. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు కూడా ఎవరూ ఉండేట్లు లేరు. డమ్మీలుగా నామినేషన్లు దాఖలు చేసినవాళ్లు కూడా ఉపసంహరించుకున్నారని, అందువల్ల రామనారాయణరెడ్డి బరిలో ఉండాల్సిందేనని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు నచ్చజెబుతున్నట్లు సమాచారం. -
'సమైక్యాంధ్ర ' ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం
ఆనం సోదరులపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఆదివారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. గతంలో తమ తాతలు... తండ్రులు ప్రజా బలం కోసం తాపత్రయ పడ్డారని... ప్రస్తుతం వివేకానంద, రాంనారాయణ రెడ్డిలు ధనబలం పెంచుకునే క్రమంలో దిగజారిపోయారని ఆరోపించారు. రావణాసురిడి గుణం వివేకానంద రెడ్డిలో ఉందని జయకుమార్ రెడ్డి విమర్శించారు. వివేకాంద, రాం నారాయణలు ఇద్దరు ఇద్దరే అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సీటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు జయకుమార్ రెడ్డి వెల్లడించారు. -
ఆనం వారి ఫ్యామిలీ ప్యాకేజి
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల వరకు ఓ నిబంధన పెట్టుకుందని చెబుతున్నారు. ఒక కుటుంబలో ఒకరికే టికెట్ ఇస్తామని చెప్పారు. ఆ నిబంధన వల్ల చాలామంది సీనియర్ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపలేకపోయారు. కొంతమందయితే వారసుల కోసం తాము త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే, కొంతమందికి వర్తించిన ఈ నిబంధనను అందరికీ వర్తింపజేయలేదు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం ఏకంగా ఫ్యామిలీ ప్యాకేజి తీసేసుకుంది. ఒక కుటుంబంలో రెండు టికెట్లు రావడమే కష్టం అనుకుంటే ఆనం కుటుంబం నుంచి ముగ్గురు ఈసారి అదే జిల్లా నుంచి ఎమ్మెల్యే స్థానాలకు పోటీ పడుతున్నారు. ఆనం కుటుంబ పెద్ద, మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఆత్మకూరు నుంచే బరిలో దిగుతున్నారు. వాస్తవానికి ఆయన ఈ స్థానంలో పోటీ చేయాలా వద్దా అనే ఊగిసలాటలో కొన్నాళ్లు ఉన్నా, చివరకు అదే స్థానాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడూ చిత్ర విచిత్రాలు చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోను, బయట కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉండే ఆనం వివేకానందరెడ్డి ఈసారి పోటీ చేయట్లేదు. తనకు బదులుగా ఆయన తన పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి)ని రంగంలోకి దించుతున్నారు. ఈయన నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దాదాపుగా ఖరారు చేసిన జాబితాలో కూడా ఏసీ సుబ్బారెడ్డి పేరు ఉంది. ఇక ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం విజయకుమార్ రెడ్డి ఈసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ స్థానం ఆనం కుటుంబానికి ఎప్పటి నుంచో బాగా తెలిసుండటం, దాదాపు అన్ని గ్రామాల్లో తమకు పట్టు ఉండటంతో విజయకుమార్ రెడ్డిని అక్కడినుంచి దింపాలని ఆనం బ్రదర్స్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇలా ఆనం కుటుంబం నుంచే నెల్లూరు జిల్లాలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అలాగే, నల్లగొండ జిల్లాలో కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి, ఆయన భార్య పద్మావతికి కూడా టికెట్లు ఇచ్చేశారు. ఈ మినహాయింపును సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకు లభించలేదు. సీనియర్ నాయకుడు పాల్వాయ గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతికి టికెట్ నిరాకరించడంతో ఆమె రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఇలా ఒక్కొక్కళ్లకు ఒక్కో రూల్ పెట్టి కాంగ్రెస్ పెద్దలు తమ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. -
క్రియాశీల రాజకీయాల్లోకి ఏసీ
నెల్లూరుకు కొత్తగా ఎవరైనా వెళ్తే ఏసీ మార్కెట్ అనే పేరు విన్నప్పుడు ఒకింత వింతగా అనిపిస్తుంది. కూరగాయల మార్కెట్ కూడా ఏసీ చేశారా అనుకుంటారు. కానీ, ఆనం కుటుంబంలో తొలి తరం నాయకుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏసీ సుబ్బారెడ్డి) పేరు మీద వచ్చిన మార్కెట్ అని ఆ తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఈయన ఆనం కుటుంబంలో మూడోతరం నాయకుడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పెద్ద కుమారుడు. ఇప్పటికే వివేకా చిన్న కొడుకు రంగ మయూర్ రెడ్డి కార్పొరేషన్‌కు పోటీచేశారు. తాజాగా ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. నెల్లూరు సిటీ స్థానాన్ని తనకు గానీ, తన కొడుకు సుబ్బారెడ్డికి గానీ ఇవ్వాలని ఇటీవల జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని ఆనం వివేకా కోరారు. దీనికి పార్టీ అధిష్ఠానం కూడా దాదాపు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సన్నాహకంగా మాజీ మంత్రి రామనారాయణరెడ్డి ఇంట్లో ఓ సమావేశం జరిగింది. అక్కడే ఏసీ సుబ్బారెడ్డి రాజకీయ ప్రవేశం విషయాన్ని స్థానిక నాయకులందరితో ఆనం సోదరులు చర్చించినట్లు తెలిసింది. అయితే, కుటుంబానికి ఒకటే టికెట్ అనే నిబంధనను కచ్చితంగా అమలుచేస్తే, ఆనం కుటుంబంలో ఇప్పటికే ఉన్న ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలలో ఒకళ్లకే టికెట్ దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో సిటింగ్ ఎమ్మెల్యేలు. మరి ఆనం కుటుంబం నుంచి ఈసారి ఎంతమందికి టికెట్లు ఇస్తారో చూడాల్సి ఉంది. -
ఆక్రమణలకు ఆనం అండ
నెల్లూరు నగరం ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఆక్రమణదారులకు ఆనం సోదరుల అండే అర్హత అయింది. మరోవైపు ఆనం సోదరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆక్రమణలను అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు కోట్లు కొల్లగొడుతున్నారు. పర్యవసానంగా సింహపురిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఏదైనా పని కోసం నగరంలోనికి వెళ్లాలంటే ఎన్ని గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సి వస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. జనాన్ని ఉద్దరించడానికే పుట్టామని గొప్పలు చెప్పే ఆనం సోదరులు నగరం ఆక్రమణల సంగతి పట్టించుకోక పోవడం విశేషం. నిర్మాణ దశలో పార్కింగ్ ప్లేస్‌లు చూపించి యజమానులు ప్లాన్ అప్రూవల్ పొందుతున్నారు. ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టి కార్పొరేషన్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి నిర్మాణ సమయంలో పార్కింగ్‌లకు ఎగనామం పెడుతున్నారు. ఉదాహరణకు గ్రౌండ్ప్లోర్ను పార్కింగ్‌కు చూపించి ఆ తర్వాత వాటిని షాపింగ్ మాల్స్‌గా మారుస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో సైతం గ్రౌండ్‌ప్లోర్‌లో రూములు నిర్మించి పార్కింగ్ లేకుం డా చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన కనకమహల్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ట్రంకురోడ్డు, పెద్దబజారు, బాలాజీనగర్ తది తర ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్మెంట్లు, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, మాల్స్, కల్యాణ మండపాల్లో 95 శాతం నిర్మాణాలకు పార్కింగులు లే వు. దీంతో ఇక్కడికి వచ్చే వారు వాహనాలను ప్రధానరోడ్లపై పెట్టాల్సి వస్తోంది. ఈ కారణంగా నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో నగరం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. పర్యవసానంగా ప్రమాదాలు పెరుతుండటంతో పాటు తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. కార్పొరేషన్ అధికారుల అవినీతి పుణ్యమాని నగరం అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంద కోట్లకు పైనే అవినీతి జరిగినట్టు తెలుప్తోంది. అవినీతి నిరోధకశాఖ దాడుల్లో ఇది బయటపడింది. గ తంలో నెల్లూరుకు వచ్చిన అప్పటి పురపాలక శాఖామంత్రి మహీధర్‌రెడ్డి సైతం టౌన్‌ప్లానిం గ్ అక్రమాలపై అధికారులను చీవాట్లు పెట్టిన విషయం విదితమే. అక్రమ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, నెలరోజుల్లోపు అన్ని రెక్టిఫై చేసుకోవాలని మంత్రి కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అయినా ఇవేవీ పట్టని ఘనత వహించిన కార్పొరేషన్ అధికారులు అందినకాడికి ముడుపులు దండుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి స్థానిక అధికారుల అక్రమాలకు అడ్డుకట్టవేసి నగరంలో అక్రమ నిర్మాణాలకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.అధికారిక లెక్కలప్రకారం కార్పొరేషన్లో 11 షాపింగ్‌మాల్స్, 233 కాంప్లెక్స్‌లు, 31 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటిలో 95 శాతం వాటికి పార్కింగ్ స్థలాలు లేవు. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కార్పొరేషన్ అధికారు లు కళ్లు మూసుకోవడంతో అక్రమ నిర్మాణాల కు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఇంటి నిర్మాణాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, క ల్యాణమండపాలు అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టాలంటే కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి. నిబంధనల మేరకు కచ్చితంగా పైవాటిని నిర్మించే సమయంలో పార్కింగ్ స్థలం కేటాయించడం తప్పనిసరి. ప్లాన్అప్రూవల్లోనే పార్కింగ్ స్థలాన్ని కచ్చితంగా చూపించాలి. అప్పుడే అధికారులు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఏకంగా విలువైన ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రయివేటు స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలలో కలిపేసుకుంటున్నారు. బాధితులు ఫి ర్యాదులు చేసినా పట్టించుకొనేవారులేరు. ఈ లెక్కన కార్పొరేషన్లో వందకోట్లకు పైనే అవి నీతి జరిగింది. ఈ విషయం ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో బయటపడినట్లు సమాచారం. నగరంలోని మాగుంట లేఔట్లో 60 అడుగుల మేర ఉన్న విలువైన రోడ్డు స్థలాన్ని అధికార పార్టీ అండదండలున్న కొందరు ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. డాక్యుమెంటరీ ప్రకారం 11.11 అంకణాల స్థలం ఉండగా 17.33 అంకణాల్లో నిర్మాణం చేపట్టారు. సెట్‌బ్యాక్ వదలక పోవడంతో పాటు రెండువైపులా ప్రభుత్వ, ప్రయివేటు స్థలాన్ని ఆక్రమించారు. అంతేకాక బిల్డర్ జీప్లస్ వన్‌కు దరఖాస్తు చేసి జీప్లస్ ఫోర్ ( 5 అంతస్తులు) నిర్మాణం చేపట్టారు. తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టాడంటూ బాధితుడు, రిటైర్డ్ ఇరిగేషన్ అధికారి నెల్లూరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తొలుత విచారించిన అధికారులు ఇది అక్రమ నిర్మాణమేనని, తాము అనుమతులు మంజూరు చేయలేదంటూ చేతులు దులుపుకున్నారే తప్ప చర్యలు తీసుకోలేదు. అధికారులు సరిగ్గా స్పందించక పోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణంపై కోర్టు స్టే మంజూరు చేసింది. నిర్మాణాలను తొలగించిన తర్వాతే అనుమతులివ్వాలంటూ ఆదేశాలిచ్చింది. ఏం జరిగిందో తెలియదు కాని అక్రమ నిర్మాణం ఆగలేదు. బిల్డర్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. బాధితులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. భారీ ముడుపులతో అధికారులకు ఎర భారీ ఎత్తున ముడుపులు ముట్టడంతోనే అధికారులు మిన్నకుండి పోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓప్రముఖ ఫ్యాన్సీషాప్స్ అధినేత కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాడు. నిబంధనల మేరకు కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన ప్లాన్‌లో గ్రౌండ్ ప్లోర్‌ను పార్కింగ్‌కు ఇస్తున్నట్టు చూపించాడు. అనుమతి వచ్చేసింది. అసలే ఆర్టీసీ కూడలి.. అంత విలువైన స్థలాన్ని పార్కింగ్‌కు వదిలితే ఏమొస్తుందని భావించి కార్పొరేషన్ అధికారుల చేతులు బలంగా తడిపాడు. పార్కింగ్ స్థలం మాయమైంది. దానిస్థానంలో షాపింగ్ మాల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు వాహనాలన్నీ రోడ్లపైనే. ఒక్క షాపింగ్ మాల్సేకాదు నగరంలో ప్రధాన కూడళ్లలోని కల్యాణమండపాలు, అపార్ట్మెంట్లు,షాపింగ్‌కాంప్లెక్స్‌లు... వేటికీ పార్కింగ్ స్థలాలు లేవు. నెల్లూరు కార్పొరేషన్ అక్రమ కట్టడాలు,నోపార్కింగ్లకు నిలయంగా మారింది. దీంతో వాహనాలన్నీ రోడ్లపైనే. పర్యవసానంగా నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఆనం సోదరులు మాత్రం పట్టించు కోలేదు. -
ముంగమూరుతోనే ఢీ
= నెల్లూరు నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న వివేకా = ఆదాలతో జతకట్టడాన్ని జీర్ణించుకోలేకే... = శ్రీధర కృష్ణారెడ్డికి మూడు చెరువుల నీళ్లు తాగించాలని పట్టుదల సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ నేటి దాకా తన మిత్రుడైన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి మీద రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పోటీకి సై అంటున్నారు. 2009 ఎన్నికల్లో తమ సహకారంతో గెలుపొందిన ఆయన ఇప్పుడు తమ ఇష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని వివేకా జీర్ణించుకోలేక పోతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముంగమూరుకు మూడు చెరువుల నీళ్లు తాగించాలనే లక్ష్యంతోనే వివేకా నగరం నుంచి పోటీకి కాలుదువ్వేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకా పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అనిల్‌కుమార్ యాదవ్‌తో పొసగక పోవడంతో పీఆర్పీ నుంచి పోటీచేసిన ముంగమూరు విజయానికి పరోక్షంగా సహకరించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల తర్వాత ఐదేళ్లూ ఆనం, ముంగమూరు ఎంతో సఖ్యతతో ఇద్దరిదీ ఒకే మాట. ఒకే బాట అనేలా వ్యవహరించారు. సిటీలో జరిగే అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివేకా హాజరయ్యేవారు. రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ముంగమూరు పాల్గొనే వారు. వివేకా అనారోగ్యం పాలైన సమయంలో సిటీలో జరిగిన అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముంగమూరుతో పాటు వివేకా కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ముంగమూరు ఆనం రాజకీయ వ్యతిరేకి ఆదాలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగితే ముంగమూరు ఆయనకు జైకొట్టారు. ఈ పరిణామాన్ని ఆనం సోదరులు జీర్ణించు కోలేకపోయారు. ఒక దశలో వివేకా ఈ విషయమై ముంగమూరును నిలదీశారనే ప్రచారం కూడా జరిగింది. ఆదాలతో కలసి ముంగమూరు తెలుగుదేశంలో చేరడానికి ఏర్పాట్లు చేసుకోవడం, సిటీ నుంచి టికెట్ కూడా ఖరారు చేయించుకోవడం వివేకాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన మదిలోని కోపాన్ని ఆయన ఎక్కడా బయట పెట్టకుండా ముందుకుపోతున్నారు. కార్పొరేషన్ పనులపై దృష్టి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబం కాంగ్రెస్ వైపే నిలబడి, జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగాలని నిర్ణయించిన నేపథ్యంలో ముంగమూరు తమతోనే వస్తారని ఆనం సోదరులు ఆశించారు. అయితే ఆయన ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వివేకాకు మరింత ఆగ్రహం తెప్పించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మారే ఆలోచనతో వున్న వివేకా గత ఎన్నికల్లో తాము ఎవరినైతే గెలిపించామో అతన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలకు వచ్చారని సమాచారం. ఇందులో భాగంగానే వివేకా నెల్లూరు సిటీ నుంచి పోటీచేయడానికి మానసింకగా సిద్ధపడినట్లు ఆయనే ప్రకటించారు. ఎన్నికల కోణంలోనే ఆయన కొర్పొరేషన్ పనుల మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులకు తమ మద్దతుదారులకు దక్కేలా చేయడానికి స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి వివేకా కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చుని ఇప్పటికే నిధులు మంజూరైన పనులను ఎవరికి ఇవ్వాలో నిర్దేశించారని సమాచారం. నిన్నటి వరకు మిత్రులుగా కొనసాగిన వివేకా, ముంగమూరు ఎన్నికల వేడి పెరిగే కొద్దీ మరింత దూరం కానున్నారు. -
20 నిమిషాల్లో రాష్ట్రాన్ని చీల్చారు: ఆనం
నెల్లూరు: కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు ఎన్నో తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు మాత్రమే చేసిందని ఆయన సమర్థించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వదిలిన బాణాల్లో ఒక్కటి కూడా లక్ష్యాన్ని తగల్లేదని ఆయన ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రాన్ని 20 నిమిషాల్లో చీల్చిన ఘనత అన్ని పార్టీలదీ అని విమర్శించారు. సీఎం రేసులో తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి లేరని తెలిపారు. కాగా, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఉదయం గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని గవర్నర్‌ను వీరుకోరినట్టు సమాచారం. తాము గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని ఆనం తెలిపారు. -
మహిళలతో ఆనం నృత్యం
-
జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ: ఎమ్మెల్యే ఆనం
నెల్లూరు: సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఎపీ ఎన్జీవోల సంఘం నెల్లూరు తాలూకా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ బిల్లు ప్రతులను, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌ను కూల్చివేస్తామని, ఆఖరు బంతికి బదులు బాంబులు వేస్తామని తీవ్రపదజాలం వాడుతున్న ఎంపీ పొన్నం ప్రభాకర్ చర్యలు ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ నేతలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు వీరెలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 12 మంది తెలంగాణ ప్రాంతం వారే ముఖ్యమంత్రులుగా పనిచేశారన్నారు. టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేంద్ర చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడారని విమర్శించారు. సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతినే మాట్లాడటం సమంజసం కాదన్నారు. -
ఏడాదంతా పోరే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బలుపు కాదు వాపు అని కాంగ్రెస్‌కు, ఇంకా బతికే ఉందని టీడీపీకి, ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పిన సంవత్సరం 2013. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం జిల్లా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపగా, వామపక్షాలు మునుపటి నిస్తేజంతోనే ఎన్నికల సంవత్సరంలోకి వెళ్తున్నాయి. స్థానిక, సహకార సంఘాల అధికారం అండతో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటకీ పంచాయతీ ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నాయకులు కొందరు ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. సమైక్యాంధ్ర సమరంలోనూ కాంగ్రెస్, టీడీపీలు మొక్కుబడిగా పాల్గొనగా వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరుబాటన నడిచింది. ఇదీ స్థూలంగా 2013లో రాజకీయపార్టీల పరిస్థితి. మరోవైపు ఏడాదంతా సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అధికారానికి ఎదురొడ్డి విజయాలు సాధించిన వైఎస్సార్సీపీ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజల హృదయాల్లోనే నిలిచి ఉందని ఈ ఏడాది కూడా నిరూపించుకుంది. ప్రజల పక్షాన ఒక వైపు పోరాటం చేస్తూనే అధికారపక్షాన్ని ఎదురొడ్డి విజయాలను సొంతం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించి సత్తా చాటుకుంది. జిల్లాలో పార్టీకి లభిస్తున్న ఆదరణతో రాష్ట్ర నాయకత్వం కూడా కొందరు నేతలను సీఈసీలోకి తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేయడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం వెలువరించిన రోజు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకొని పనిచేసింది. సమైక్య శంఖారావంలో భాగంగా వైఎస్ షర్మిల జిల్లా పర్యటన జరిపారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి పట్టణాల్లో నిర్వహించిన సభలకు జనం వేలాదిగా తరలివచ్చారు. గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ ... జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున నలుగురు శాసనసభ్యులు ఉండగా అందులో ఇద్దరు ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. మిగిలేదల్లా ఆనం సోదరులు మాత్రమే. ఇక చాలా నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. పంచాయతీలో బతికే ఉన్నాననిపించిన టీడీపీ.. ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలు జిల్లాలో టీడీపీకి ఊపిరిపోశాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా జిల్లాలో ఆ పార్టీ ఇంకా బతికే ఉందన్న అభిప్రాయాన్ని కల్పించాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో అవకాశం దొరక్క దేశంవైపు చూస్తున్నారు. ఇది ఆ పార్టీలో ఇప్పటికే అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న నేతల అసంతృప్తికి దారి తీస్తోంది. కార్యకర్తలు సంతోషపడాలో, బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి 2013లో పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కింది. కాగా పార్టీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం కీలక పాత్ర పోషించలేక విమర్శలపాలైంది. -
ఆనం సోదరులకు షాక్ : వైఎస్ఆర్సిపిలో చేరిన పెంచల్‌రెడ్డి
హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరులకు నెల్లూరులో పెద్ద షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వంటనూనె వర్తకుల సంఘం అధ్యక్షుడైన పెంచల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరారు. ఆయనతోపాట వివిధ వ్యాపార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. -
కిరణ్ సమైక్యవాది కాదంటున్న మంత్రులు
-
ఆనం వివేకాపై తిరుగుబాటు ధోరణిలో కాంగ్రెస్ నేతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు నగరంలో బాస్‌కు ఎదురుగాలి వీస్తోంది. కనుసైగ శాసనంగా భావించే నాయకులు, అధికార యంత్రాంగంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పట్టు కోల్పోతున్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని కిందటి ఏడాది నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల ప్రజలు తేల్చి చెప్పారు. నగర కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా శ్రమించినా, అధికార యంత్రాంగం కొమ్ముకాసినా అప్పట్లో ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు అటు సొంత పార్టీ నాయకులతో పాటు అధికార యంత్రాంగంలో కూడా ఆయన మాటకు విలువ లేకుండాపోతోంది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, అహంకారపూరిత శైలి వారిని కూడా దూరం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు అందుకు నిదర్శనం. వీటికి అద్దం పడుతూ సోమవారం రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వివేకాకు అత్యంత ముఖ్యులైన మాజీ కార్పొరేటర్లు చాట్ల నరసింహారావు, పిండి సురేష్ గైర్హాజరయ్యారు. కరెంట్ ఆఫీస్ సెంటర్లోని రిత్విక్ ఎన్‌క్లేవ్‌లో మాజీ మేయర్ భానుశ్రీ బంధువులు రిజర్వు స్థలంలో చేసిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నగరంలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా నడుస్తున్న తరుణంలో అటు సొంత అనుచరులు ఇటు అధికారులు ఆనంకు ఝలక్ ఇచ్చారు. భానుశ్రీకి ప్రాధాన్యంతో అసంతృప్త జ్వాలలు నెల్లూరులో మాజీ మేయర్ భానుశ్రీకి రాజకీయంగా పూర్తి అండదండలు అందించడం ఎంతో కాలంగా ఆనం వివేకానందరెడ్డిని నమ్ముకున్న ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఎమ్మెల్యే తనతో సమాన ప్రాధాన్యం భానుశ్రీకి ఇస్తున్నారు. నగరంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ఆమె పేరు, ఫొటో లేనిదే జరగడం లేదంటే అతిశయోక్తి లేదు. ఈ పరిస్థితుల్లో ఆమెను వ్యతిరేకించే వారిని బాస్ పక్కనబెడుతున్నారు. కనీసం అసంతృప్తుల అభిప్రాయాలను చెవికెక్కించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో వారిని అవమానపరిచిన ఘటనలూ ఉంటున్నాయి. దీంతో ఆనం అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నెల రెండో వారంలో జరిగిన రొట్టెల పండుగ స్వాగత ఫ్లెక్సీలూ వివాదాస్పదంగా మారాయి. వేదాయపాలెం నుంచి బారాషహీద్ దర్గా వరకు రోడ్డు డివైడర్ల మధ్య ఫ్లెక్సీల్లో (లాలీపప్స్) ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డితో పాటు భానుశ్రీ ఫొటోలు ఏర్పాటు చేశారు. దర్గా కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో ఆమెకు ఏ హోదాతో ఇంత ప్రచారం కల్పించారనేది వారికి మింగుడు పడటం లేదు. దర్గా ఆవరణలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాళ్ల కాంట్రాక్టులు ఎక్కువ భాగం భానుశ్రీ అనుచరులకే దక్కాయి. ఇవన్నీ ఆనం అనుచరుల్లో అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆనం కుటుంబానికి ఎంతో కాలంగా నమ్మినబంటుగా ఉం టున్న చాట్ల నరసింహారావుతో పాటు వివేకాకు అత్యంత సన్నిహితులైన సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పిండి సురేష్ తదితరులకు కూడా రచ్చబండ ఆహ్వానాలు మొక్కుబడిగా అందాయి. వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సోమవారం జరిగిన రచ్చబండకు చాట్లతో పాటు పిండి కూడా గైర్హాజరయ్యారని చెబుతున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు బేఖాతరు రిత్విక్ ఎన్‌క్లేవ్‌లోని మున్సిపల్ రిజర్వుడు స్థలంలో భానుశ్రీ సమీప బంధువులు అక్రమంగా నిర్మించిన ఇంటిని మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఈ ఇంటిని కూల్చకుండా అధికారులకు ఎమ్మెల్యే సిఫార్సు చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు కూడా కార్పొరేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే చేసేదేమీలేక మిన్నకుండి పోయినట్టు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్యేకు అటు అధికారులు ఇటు పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న అనుభవాలు చికాకుగా మారాయని అంటున్నారు. -
జగన్‌ను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన: ఎంపీ మేకపాటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ... వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆనం సోదరులపై మేకపాటి నిప్పులు చెరిగారు. రాజకీయాన్ని వ్యాపారమయం చేసిన ఘనత ఆనం బ్రదర్స్దని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. -
నేత్రపర్వంగా భవానీల ఊరేగింపు
నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: నగరంలోని దర్గామిట్టలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో ఇరుముడిధారణ చేశారు. వేదాయపాళెంలోని బాలయోగీశ్వరాశ్రమంలో గురుస్వామి వెంకటశేషయ్య ఆధ్వర్యంలో వేకువజామున అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఇరుముడి కట్టారు. ఆశ్రమంలో అమ్మవారి భజనలు చేశారు. రాత్రి వేదాయపాళెం నుంచి భవానీలందరూ అమ్మవారి కీర్తనలు పాడుతూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. కలశాలు, ఇరుముడితో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఆదివారం వేకువజామున జరిగిన మహాభిషేకంలో అమ్మవారిని ధ్యానించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పాయసం నాగేశ్వరరావు, ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, ముఖ్యఅర్చకుడు కుప్పచ్చి సుబ్బారావుస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
దిగ్విజయ్ సింగ్‌ను రీకాల్ చేయాలి: అనం వివేకానందరెడ్డి
-
'ఆత్మగౌరవం తెలుగువాడి మీసంలో ఉంది'
హైదరాబాద్: పార్టీలను పక్కనపెట్టి జేఏసీగా ఏర్పడదామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పిలుపునిచ్చారు. అందరం డ్రామాలు ఆపేద్దామని, పార్టీలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర ఎజెండాతో ముందుకెళదామని కోరారు. రాష్ట్రంలో ఎక్కువ మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఆత్మగౌరవం తెలుగువాడి మీసంలో ఉందన్నారు. తెలుగువాడి రోషంలో ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. మిగతా పార్టీలు కూడా ఇదే దారిలో నడవలన్నారు. చంద్రబాబు నాయుడు నాటకాలు కట్టిపెట్టి సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలన్నారు. రథయాత్రలు కట్టిపెట్టాలన్నారు. పాములా బుస కొడుతున్న సమైక్య ఉద్యమానికి నీరుపోయాలన్నారు. గతంలో తెలంగాణ నాయకులు వ్యవహరించిన విధంగా ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నాయకులను కలుద్దామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీ ఎజెండా వారిదే అన్నారు. అసెంబ్లీలో తీర్మానం వస్తే అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు. -
ఆనం చాంబర్లో ముగిసిన మంత్రుల భేటి
-
ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించొద్దు ఆనం జయకుమార్‌రెడ్డి
నెల్లూరు (హరనాథపురం), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించొద్దని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి ఆయన సోదరుడు జయకుమార్‌రెడ్డి సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా గాంధీబొమ్మ సెంటర్లో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘సమైక్య ఉద్యమం పేరుతో నెల్లూరులో నువ్వు డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. అందుకోసం కళాకారులు, ఉద్యమకారులు ఉన్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం సోనియాగాంధీ ఎదుట డప్పుకొట్టాలని వారికి సూచించారు. కాంగ్రెస్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలకు పోలీసులను కాపలాపెట్టుకునే దుస్థితి తలెత్తిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడినందున విభజన ఉద్యమాలేవీ జరగలేదన్నారు. ఆయన లాంటి నాయకులు లేనందునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందన్నారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తమ సోదరులు మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి కాంగ్రెస్ నాయకత్వంపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏసునాయుడు, ఆర్. శ్రీనివాసులు, కె.బాబు, వెంకటేశ్వర్లు యాదవ్, సలీం, గార్లపాటి విజయకుమార్ పాల్గొన్నారు. ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్:ఒకరి మృతి ముత్తుకూరు, న్యూస్‌లైన్: బ్రహ్మదేవి-తాళ్లపూడి మధ్య సోమవారం రాత్రి నిలిచివున్న ట్రాక్టర్‌ను మోటారుసైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 108 సిబ్బంది కథనం ప్రకారం..దొరువులపాళెం పంచాయతీలోని రొయ్యలపాళేనికి చెందిన ధారా సుబ్బారావు, శివకుమార్, వెంకటేష్ నెల్లూరులో సెంట్రింగ్ పని ముగించుకొని, భారీ వర్షంలో మోటారుసైకిల్‌పై ఊరికి బయల్దేరారు. బ్రహ్మదేవి దాటిన తర్వాత రోడ్డులో నిలిచిపోయిన పొట్టు లోడు ట్రాక్టర్ వీరికి కనిపించలేదు. చీకట్లో ట్రాక్టర్‌ను ఢీకొనగా బైక్ వెనక కూర్చున్న సుబ్బారావు (30) తలకు బలమైన గాయమైంది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ నడుపుతున్న వెంకటేష్‌కు ఎటువంటి గాయం తగలలేదు. ఇతని వె నక కూర్చున్న శివకుమార్ స్వల్పంగా గాయపడ్డాడు. బైక్ నడుపుతున్న వెంకటేష్‌కు చనిపోయిన సుబ్బారావు స్వయాన అన్న. వెంటనే 108 సిబ్బంది సుబ్బారావు మృతదేహాన్ని, గాయపడ్డ శివకుమార్‌ను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మహిళా భేరి
సాక్షి, నెల్లూరు : రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సింహపురివాసులు గర్జిస్తున్నారు. అందుకోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని నినదిస్తున్నారు. జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన ఉద్యమం శనివారానికి 46వ రోజుకు చేరింది. సమైక్య ఉద్యమకారులపై ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి దాడులు చేయించడాన్ని ఆయన సోదరుడు జయకుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. షర్మిలపై విమర్శలు చేయడం తగదని వివేకాకు హితవు పలికారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని జయకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుపై వంటావార్పుతో పాటు గంగిరెద్దులతో ఆటలు ఆడించి వినూత్న నిరసన తెలిపారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు వెంకటగిరిలో శనివారం బంద్ పాటించారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, ఆర్టీసీ, విద్యాలయాల బంద్ కొనసాగుతోంది. సింహపురి మహిళా గర్జన పేరుతో సర్వోదయ కళాశాల నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. కృష్ణం పల్లె పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్లో 27వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. సీతారాంపురంలో ఒక ఉపాధ్యాయుడు అరగుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. వెంకటగిరికి వచ్చే ప్రధాన ముఖద్వారాలను దిగ్బంధించారు. పట్టణంలోకి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పుర వీధులు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు మూసి వేశారు. ఆత్మకూరు ఆపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, జేఏసీ మహిళలు సోమశిల టర్నింగ్ నుంచి ర్యాలీగా బస్టాండ్ సెం టర్ వరకు వెళ్లి మానవ హారంగా ఏర్పడ్డారు. సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏఎస్‌పేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. సోమశిలలో గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ముత్తుకూరులోని సాంఘిక సం క్షేమ గురుకుల కళాశాల ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్షలు , విద్యార్థులు మానవహారం నిర్వహించారు. టీపీగూడూరు మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నేతలు టీపీ గూ డూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. డీఈఓ రామలిం గం ఈ యాత్రను ప్రారంభించారు. చిల్లకూరు మండలంలోని పారిచెర్లవారిపాళెంలో ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటా సమైక్యాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి దీక్షలో పాల్గొన్నారు. కోటలో ముస్లిం మతపెద్దలు సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. మల్లాం గ్రామంలో ఆర్టీసీ, విద్యార్జి జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలు, రైతులు, ఏపీఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మహాగర్జన నిర్వహించారు. సూళ్లూరుపేటలో జేఏసీ రిలే నిరాహారదీక్షలు 35వ రోజుకు చేరాయి. తడలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సం జీవయ్య వారికి సంఘీభావం తెలిపారు. నాయుడుపేటలో స్వర్ణముఖి గర్జన నిర్వహించేందుకు డీఈఓ మువ్వా రామలింగం ఏర్పాట్లు పరిశీలించారు. -
విద్యార్థి నేతలపై ఆనం అనుచరుల దాడి
నేడు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన : ఎన్జీవోలు నెల్లూరు (క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనుచరులు గురువారం రాత్రి సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. దాంతో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ప్రసాద్, నాయకుడు మధు గాయాలపాలయ్యారు. ‘ఆనంకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారా? మీరు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తే సహించేది లేదు’ అంటూ ఆనం అనుచరులు తమపై దాడికి దిగినట్టు బాధితులు చెప్పారు. వారు చెప్పిన వివరాల మేరకు... వేదాయపాళెం సెంటర్‌కు చెందిన యజ్దాని గురువారం సాయంత్రం విద్యార్థి జేఏసీ నేత ప్రసాద్‌కు ఫోను చేసి, ‘కాంగ్రెస్ పార్టీని, ఆనంను విమర్శిస్తే చంపుతా’మని బెదిరించాడు. దాంతో ప్రసాద్ తన స్నేహితులతో కలిసి యజ్దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రసాద్ ఎన్జీవో హోమ్‌లో సమావేశంలో పాల్గొని సహచరుడు మధుతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ముజీర్, అతని అనుచరులు అలీ, యజ్దాని, హాజీ మరో 30 మంది బైక్‌లపై వచ్చి వారిపై దాడి చేశారు. దీనిపై బాధితులు ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి నేతలపై దాడి అమానుషమని, నిందితులనను అరెస్టు చేయాలని ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు అన్నారు. దాడిని నిరసిస్తూ శుక్రవారం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. -
రాష్ట్రాన్ని విభజిస్తే జల యుద్ధాలే: సీమాంధ్రనేతలు