'పవన్...చంద్రబాబు ట్రాప్లో పడొద్దు' | pawan kalyan don't trap in chandrababu naidu, says anam vivekananda reddy | Sakshi
Sakshi News home page

'పవన్...చంద్రబాబు ట్రాప్లో పడొద్దు'

Published Tue, Mar 3 2015 1:42 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్...చంద్రబాబు ట్రాప్లో పడొద్దు' - Sakshi

'పవన్...చంద్రబాబు ట్రాప్లో పడొద్దు'

హైదరాబాద్ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను రాజకీయంగా వాడుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో  జయప్రద, బాబుమోహన్ వంటి సినీ ప్రముఖులను చంద్రబాబు రాజకీయంగా వాడుకుని వదిలేశారని ఆయన మంగళవామిక్కడ అన్నారు. ఈ వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని, చంద్రబాబు ట్రాప్లో పడొద్దని ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి సూచించారు.

పవన్ కల్యాణ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆనం అన్నారు. ఏపీ రాజధానికి 500 ఎకరాలు జరిపోతాయని, సింగపూర్కు తాకట్టు పెట్టేందుకే చంద్రబాబు వేల ఎకరాల భూ సేకరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు, నరేంద్ర మోదీ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారని ఆనం మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement