
గాయకుడి అవతారమెత్తిన మాజీ ఎమ్మెల్యే ఆనం
నెల్లూరు : జనాలను ఆకట్టుకోవటంలో ఆయన రూటే సపరేట్. బైక్పై దూసుకుపోవటం అయినా, పబ్లిక్గా దమ్ము కొట్టడం, చీర సింగారించుకోవటంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సదరు రాజకీయ నేతగారి అలవాటు. సందర్భానికి అనుకూలంగా మారిపోవటం ఆయన స్టైల్. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా, ఆయనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి.
తాజాగా ఆయన గాయకుడి అవతారం ఎత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆయన భక్తిగీతాలు ఆలపించారు. నెల్లూరులోని మూలపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఆనం వివేకానందరెడ్డి అక్కడ భక్తులతో పాటు గొంతు కలిపారు. తన గానంతో అక్కడవారిని మెప్పించారు. ప్రసంగాలే కాదు... పాటలు పాడటంలోనూ తనకు తానే సాటి అన్నట్టుగా ఆనం ప్రొఫెషనల్ సింగర్ పాడినట్లు భక్తి గీతాలు పాడటం విశేషం.