
సాక్షి, గన్నవరం : మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. గురువారం ఆనం కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఫోన్‌లో ఆనం రామనారాయణ రెడ్డి, విజయ్‌కుమార్ రెడ్డిలతో మాట్లాడారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, ప్రోస్టేట్ క్యాన్సర్‌తో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చికిత్సకు శరీరం సహకరించక తన సోదరుడు తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికాయానికి నెల్లూరులో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment