'ఏపీలో 225కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు' | Andhra pradesh MLA seats increased in 2019 elections, says Chandrababu | Sakshi
Sakshi News home page

'ఏపీలో 225కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు'

Published Sun, Jan 17 2016 7:24 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

'ఏపీలో 225కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు' - Sakshi

'ఏపీలో 225కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు'

విజయవాడ : మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆనం సోదరులిద్దరు టీడీపీ చేరారు. ఆనం సోదరులిద్దరికి పచ్చ కండువా కప్పి చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 225 కి పెరుగుతాయన్నారు. పార్టీలో కొత్తగా చేరేవారికి అప్పుడు అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే, సహాజనటి జయసుధ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... శనివారం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement