
ఉత్తరాంధ్ర జానపద కాణాచి, ప్రజా వాగ్గేయా కళాకారుడు వంగపండు ప్రసాదరావు(77) మృతికి తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంతాపం ప్రకటించింది. ప్రసాదరావు ఆకస్మిక మరణం కళా రంగానికి తీరని లోటని పేర్కొంది. మే 31న ప్రారంభమైన తానా ప్రపంచ సాహిత్య వేదికకు వంగపండు ముఖ్య అతిధిగా హాజరై తమ బృందంతో అంతర్జాలంలో అద్భుతమైన పాటలు పాడి అందరిని అలరించారని తానా ప్రతినిధులు తెలిపారు. అదే ఆయన చివరి కార్యక్రమం కావడం దురదృష్టకరమని అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సంతాపం తెలియజేశారు.
అదే విధంగా ప్రసాదరావు మృతికి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పంతాపం ప్రకటించింది. ఆయనకు 2017లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జానపద కళారత్న అవార్డును అందజేశామని అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు.