20 నిమిషాల్లో రాష్ట్రాన్ని చీల్చారు: ఆనం | Anam Vivekananda Reddy criticise bifurcation process | Sakshi
Sakshi News home page

20 నిమిషాల్లో రాష్ట్రాన్ని చీల్చారు: ఆనం

Published Thu, Feb 20 2014 3:43 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

20 నిమిషాల్లో రాష్ట్రాన్ని చీల్చారు: ఆనం - Sakshi

20 నిమిషాల్లో రాష్ట్రాన్ని చీల్చారు: ఆనం

నెల్లూరు: కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. విభజన విషయంలో అన్ని పార్టీలు ఎన్నో తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు మాత్రమే చేసిందని ఆయన సమర్థించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వదిలిన బాణాల్లో ఒక్కటి కూడా లక్ష్యాన్ని తగల్లేదని ఆయన ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రాన్ని 20 నిమిషాల్లో చీల్చిన ఘనత అన్ని పార్టీలదీ అని విమర్శించారు. సీఎం రేసులో తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి లేరని తెలిపారు.

కాగా, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఉదయం గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించొద్దని గవర్నర్ను వీరుకోరినట్టు సమాచారం.  తాము గవర్నర్ను మర్యాదపూర్వకంగానే కలిశామని ఆనం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement