నెల్లూరు (హరనాథపురం), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించొద్దని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి ఆయన సోదరుడు జయకుమార్‌రెడ్డి సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా గాంధీబొమ్మ సెంటర్లో సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘సమైక్య ఉద్యమం పేరుతో నెల్లూరులో నువ్వు డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. అందుకోసం కళాకారులు, ఉద్యమకారులు ఉన్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం సోనియాగాంధీ ఎదుట డప్పుకొట్టాలని వారికి సూచించారు.
కాంగ్రెస్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలకు పోలీసులను కాపలాపెట్టుకునే దుస్థితి తలెత్తిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడినందున విభజన ఉద్యమాలేవీ జరగలేదన్నారు. ఆయన లాంటి నాయకులు లేనందునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందన్నారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తమ సోదరులు మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి కాంగ్రెస్ నాయకత్వంపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏసునాయుడు, ఆర్. శ్రీనివాసులు, కె.బాబు, వెంకటేశ్వర్లు యాదవ్, సలీం, గార్లపాటి విజయకుమార్ పాల్గొన్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్:ఒకరి మృతి
ముత్తుకూరు, న్యూస్‌లైన్: బ్రహ్మదేవి-తాళ్లపూడి మధ్య సోమవారం రాత్రి నిలిచివున్న ట్రాక్టర్‌ను మోటారుసైకిల్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. 108 సిబ్బంది కథనం ప్రకారం..దొరువులపాళెం పంచాయతీలోని రొయ్యలపాళేనికి చెందిన ధారా సుబ్బారావు, శివకుమార్, వెంకటేష్ నెల్లూరులో సెంట్రింగ్ పని ముగించుకొని, భారీ వర్షంలో మోటారుసైకిల్‌పై ఊరికి బయల్దేరారు. బ్రహ్మదేవి దాటిన తర్వాత రోడ్డులో నిలిచిపోయిన పొట్టు లోడు ట్రాక్టర్ వీరికి కనిపించలేదు. చీకట్లో ట్రాక్టర్‌ను ఢీకొనగా బైక్ వెనక కూర్చున్న సుబ్బారావు (30) తలకు బలమైన గాయమైంది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ నడుపుతున్న వెంకటేష్‌కు ఎటువంటి గాయం తగలలేదు. ఇతని వె నక కూర్చున్న శివకుమార్ స్వల్పంగా గాయపడ్డాడు. బైక్ నడుపుతున్న వెంకటేష్‌కు చనిపోయిన సుబ్బారావు స్వయాన అన్న. వెంటనే 108 సిబ్బంది సుబ్బారావు మృతదేహాన్ని, గాయపడ్డ శివకుమార్‌ను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించొద్దు ఆనం జయకుమార్‌రెడ్డి
Published Tue, Sep 17 2013 4:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement