టీడీపీలో చేరి తప్పు చేశా..!
► అందరికీ పదవులు ఇస్తున్నారు మాకు తప్ప..
► సన్నిహితుల వద్ద ఆనం ఆవేదన..
నెల్లూరు: టీడీపీలో చేరడంపై మాజీ నెల్లూరు ముఖ్యనేత ఆనం వివేకానంద రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నెల్లూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిన తర్వాత తన ప్రాభల్యం కోల్పోయారు. పార్టీలో చేరుతున్నప్పుడు పదవులు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చేరిన తర్వాత ముఖం చాటేస్తున్నారని వాపోయినట్లు సమాచారం. తెలుగుదేశంలో చేరి తప్పు చేశానని, మోసపోయామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. అంతేకాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామన్న సీఎం హామీ నెరవేరకపోవడంతో ఆయన కలత చెందిదనట్లు సమాచారం. దీంతో ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఎమ్మెల్సీ దక్కేనా?
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఆనంకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉంది. నంద్యాలలో 45వేల ముస్లిం ఓట్లు ఉన్ననేపధ్యంలో ఉపఎన్నికల్లో గెలవడానికి ఫరూక్‌కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగిచేందుకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఆనం బ్రదర్స్‌కు ఇవ్వాల్సిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి చేజారడంతో ఆయన అనుచరులు డీలా పడ్డారు.