'సమైక్యాంధ్ర ' ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం | Anam Jayakumar Reddy takes on Anam Vivekananda Reddy and Anam Ram Narayana Reddy | Sakshi
Sakshi News home page

'సమైక్యాంధ్ర ' ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం

Published Sun, Apr 13 2014 1:56 PM | Last Updated on Mon, May 28 2018 4:15 PM

Anam Jayakumar Reddy takes on Anam Vivekananda Reddy and Anam Ram Narayana Reddy

ఆనం సోదరులపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఆదివారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. గతంలో తమ తాతలు... తండ్రులు ప్రజా బలం కోసం తాపత్రయ పడ్డారని... ప్రస్తుతం వివేకానంద, రాంనారాయణ రెడ్డిలు ధనబలం పెంచుకునే క్రమంలో దిగజారిపోయారని ఆరోపించారు.

 

రావణాసురిడి గుణం వివేకానంద రెడ్డిలో ఉందని జయకుమార్ రెడ్డి విమర్శించారు.  వివేకాంద, రాం నారాయణలు ఇద్దరు ఇద్దరే అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సీటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు జయకుమార్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement