Jai samaikyandhra party
-
మఖలో పుట్టి పుబ్బలో మాయం
సమైక్యాంధ్రకు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన్ని తలచుకోగానే గుర్తొచ్చేది మహాభారతంలోని ఉత్తరకుమారుడే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యం తెలుసుకుని కూడా ఆయన సీఎంగా ఉండగా... తన తుది శ్వాస ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ గొప్పలు పలికారు. పైలిన్ తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ ... పైలిన్ తుపాన్ ఆపలేకపోయినా విభజనను అడ్డుకుంటానంటూ ప్రకటించారు. అందులోభాగంగా రాష్ట్ర శాసనసభకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మంగళయాన్‌లా వెనక్కి పంపిస్తానన్నారు. అలాగే చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం కసరత్తు తుది రూపు దిద్దుకుంటున్న దశలో తాను ముమ్మాటికి సమైక్యవాది నంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పారేశారు. అనంతరం విభజన జరిగిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ సమైక్యంగా ఉంచేందుకు 'జై సమైక్యాంధ్ర పార్టీ' స్థాపించినట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందే ఆ పార్టీలో అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఆయన సన్నిహితులు ఒక్కొక్కరుగా కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ బై చెప్పారు. ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జెఎస్పీ ఒక్కటంటే ఒక్క సీటు కూడ గెలుచుకోలేక పోయింది. దాంతో ఆయన్ని నైరాశ్యం వెంటాడినట్లుంది. దాంతో పార్టీ వద్దు ఏమీ వద్దు అనుకున్నారో ఏమో మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఉన్న తట్టా బుట్టా కూడా సర్దేశారు. అది చేస్తా ఇది చేస్తా నంటూ కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోయింది. -
మాజీ సీఎం కిరణ్ దుకాణం మూసేశాడు!
హైదరాబాద్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) దుకాణం మూసేసింది. ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత మాజీ సీఎం, ఆపార్టీ అధినేత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర నాయకులు జేఎస్పీ కార్యాలయం రావడమే మానేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జైసమైక్యాంధ్ర ఉద్యమానికి, పార్టీకి కాలం చెల్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో దుకాణాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కూడా పార్టీ సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణ కూడా ఏమి లేకపోవడంతో కిరణ్ కుమార్ కూడా జై సమైక్యాంధ్రపై ఎక్కడా మాట్లాడకపోవడం, జన జీవన స్రవంతిలో కనిపించడం మానేసిన సంగతి తెలిసిందే. జై సమైక్యాంద్ర పార్టీని స్థాపించిన మూడు నెలల తర్వాత మాదాపూర్ లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయడం గమనార్హం. మాదాపూర్ లోని కృతికా లేఅవుట్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న ఐదు అంతస్తుల భవనానికి ఉన్న పార్టీ పోస్టర్లు, బ్యానర్లను, జెండాలను రెండు రోజుల క్రితం తొలగించారు. దాంతో అద్దెకు తీసుకునేందుకు ఆ భవనానికి ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల తాకిడి ఎక్కవైనట్టు సమాచారం. జేఎస్పీ కార్యాలయాన్ని గుట్టు చప్పుడుకాకుండా మూసేసినట్టు ఆపార్టీకి చెందిన సీనియర్ నేతలకే తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితమే కార్యాలయం నుంచి ఫర్నిచర్, స్టేషనరీని తరలించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్డడించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడం, బీజేపీ నేత కిషన్ రెడ్డితో భేటి కావడం కూడా పార్టీకి మంగళం పెడుతున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. జై సమైక్యాంధ్ర అంటూ ప్రజల్లోకి వెళ్లిన కిరణ్ .. రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీలోనే చేరడానికి ప్రయత్నించడం కొసమెరుపు. Follow @sakshinews -
జేఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్న 'అధికారిణి'
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లిలో ఎన్నికల అధికారి శ్రీలత జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జేఎస్పీకే ఓటు వేయ్యాలని ఆమె ఓటేసేందుకు వచ్చిన ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలో ఓటర్లకు ప్రభుత్వ వాహనంలో నగదు పంపిణీ చేస్తుందంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. అందులోభాగంగా శ్రీలతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జైఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సదరు అధికారిణి శ్రీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
నల్లారికి సబ్బం హరి షాక్
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి అనకాపల్లి ఎంపీ సబ్బం హరి షాక్ ఇచ్చారు. ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు కిరణ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైనప్పటి నుంచి సబ్బం హరి... కిరణ్ పంచన చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడానికి కారణమైన వారిలో సబ్బం హరి కూడా ఒకరు. ఇప్పుడు ఆయనే పార్టీని వీడారు. ఇంతకుముందు కిరణ్ వెంట నడిచిన పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్ తర్వాత తమదారి తాము చూసుకున్నారు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో చేరి కిరణ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా సబ్బం హరి కూడా కిరణ్‌ను వీడారు. పోలింగ్ ఒక రోజు ముందు మీడియా ముందుకు వచ్చిన సబ్బం హరి... పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అనారోగ్యం కారణంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సబ్బం హరి ఇచ్చిన షాక్ నుంచి కిరణ్ ఎలా కోలుకుంటారో చూడాలి. -
టీడీపీలో చేరిన జేఎస్పీ అసెంబ్లీ అభ్యర్థులు
గుంటూరు: ఎన్నికల సాక్షిగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిల కుమ్మక్కు మరోసారి బయటపడింది. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుండగా వీరి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు బట్టబయలయ్యాయి. మాచర్ల, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అభ్యర్థులు పచ్చ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడితో ఆగకుండా తమ పార్టీ ఓట్లు టీడీపీకి వేయిస్తామంటూ జేఎస్పీ అభ్యర్థులు ప్రకటించడం గమనార్హం. దీంతో తెరచాటుగా కుమ్మక్కు రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తోంది. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా విప్ జారీ చేసి కాపాడారని వైఎస్సార్ సీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు జరిగిన పలు ఎన్నికల్లో బాబు-కిరణ్ కుమ్మక్కు రాజకీయాలు చేశారని పేర్కొంది. -
టిడిపిలో చేరిన జై సమైక్య పార్టీ అభ్యర్దులు
-
చివరి బంతికి హిట్ వికెట్
చేతులెత్తేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మాజీ సీఎం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులెత్తేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి క్రికెట్ పరిభాషలో మాట్లాడి, రాష్ట్ర విభజనలోనూ అదే భాష ఉపయోగిస్తూ.. చివరి బంతి మిగిలే ఉందని అంటుండేవారు. తీరా చివరి బంతి వచ్చేసరికి ఆయనంతట ఆయనే హిట్ వికెట్‌తో ఔటైపోయారు. నామినేషన్ల చివరి రోజున ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి తన సోదరుడిని పోటీకి దింపి, ఆయన వెనక్కొచ్చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడున్నరేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించి, సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్ తీరా ఎన్నికలొచ్చేసరికి తప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటమి తప్పదనే ఆందోళనతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కిరణ్ వాయల్పాడు నుంచి మూడుసార్లు గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పీలేరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. రోశయ్య తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇటీవలి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జేఎస్పీ అభ్యర్థులను బరిలోకి దించాలని భావించారు. తాను పీలేరు నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య శనివారం ఉదయం పీలేరు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన తమ్ముడు కిషన్‌కుమార్‌రెడ్డి (కిశోర్‌కుమార్‌రెడ్డి)తో నామినేషన్ వేయించి వెనుదిరిగారు. అక్కడి నుంచి రోడ్‌షోగా బయల్దేరారు. తాను రాష్ట్రమంతా తిరగాల్సి ఉన్నందున, పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పారు. కిరణ్ రాజకీయ భవితవ్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న సంకేతాలున్న కారణంగానే ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈసారిపోటీ చేయకూడదని ఆయన కొద్ది రోజుల కిందటే నిర్ణయానికొచ్చినప్పటికీ, ఓ పార్టీ అధ్యక్షుడిగా పోటీలో లేకపోతే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతోనే నామినేషన్ల చివరి రోజున సోదరుడిని బరిలో దింపి, ఆయన తప్పుకున్నట్లు సమాచారం. జై సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటే కిరణ్ ఎన్నికల బరిలో నిలిచేవారేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేయడంలోని ఉద్దేశమే వేరని, అలాంటప్పుడు ఎందుకు పోటీ చేస్తారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీని స్థానించారని, ఓట్ల చీలిక ద్వారా టీడీపీకి ప్రయోజనం చేకూర్చాలన్నది కిరణ్ ఆలోచన అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయోమయంలో జేఎస్పీ అభ్యర్థులు సమైక్య ఛాంపియన్లుగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, సీపీఎంతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. చివర్లో పార్టీకి కెప్టెన్‌లాంటి కిరణ్ బ్యాటొదిలేసి క్రీజు నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. కిరణ్ తీరుపై మండిపడుతున్నారు. పలువురు అభ్యర్థులు రంగం నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టు చెబుతున్నారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్
-
ఎన్నికల బరి నుంచి తప్పుకున్నకిరణ్ కుమార్ రెడ్డి
పీలేరు : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఆయన తన సోదరుడిని పోటీకి దించారు. కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా తాను పోటీలో ఉంటే పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టమవుతోందని కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడిగా కిరణ్ ప్రజలను ఆకర్షించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు వాదులాడుకుంటున్నారు. అదేవిధంగా ఆశించినంతగా నేతలు పార్టీలో చేరకపోవడం కూడా ప్రజలు కిరణ్ పార్టీని ఆదరించడం లేదని తెలుస్తోంది. నిన్నటిదాకా కిరణ్ గురించి గొప్పగా చెప్పిన ఎంపీలు హర్షకుమార్, సబ్బంహరి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు కూడా ఆయన పేరు ఎత్తడానికి సాహసం చేయలేదు. పార్టీ అధ్యక్షుడే పోటీకి దూరంగా ఉంటే ఇక ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావటం లేదు. -
‘బరి’కి తుది రోజు నేడే
ఇప్పటి వరకూ 3 ఎంపీ స్థానాలకు 26, 19 అసెంబ్లీ స్థానాలకు 154 నామినేషన్లు 21న పరిశీలన, 23 వరకు ఉపసంహరణకు గడువు సాక్షి, కాకినాడ, సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెల 12న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలకు 26, 19 అసెంబ్లీ స్థానాలకు 154 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు పార్లమెంటు స్థానాలతో పాటు పి.గన్నవరం మినహా అన్ని అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ ముగియవచ్చినా తెలుగుదేశం సహా ఇతర ప్రధాన పార్టీలకు సంబంధించి చాలా నియోజక వర్గాల్లో నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు తేలక సతమతమవుతున్న తెలుగుదేశం పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలకు, కాంగ్రెస్ పార్టీ పెద్దాపురానికి ప్రకటించాల్సి ఉంది. నరాలు తెగే ఉత్కంఠకు లోనవుతున్న తెలుగుదేశం ఆశావహులు అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే తాము మాత్రం ఇంకా టిక్కెట్ల కోసం ఎదురు చూడాల్సిన దౌర్భాగ్యం దాపురించిందని వాపోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ కూడా నాలుగు నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాంగ్రెస్ టిక్కెట్లు ఖరారైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, కోసూరి కాశీ విశ్వనాథ్‌లతో పాటు ఆ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీల అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. పెద్దాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడు నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతుండగా తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీల అభ్యర్థులే ఖరారు కాలేదు. రాజమండ్రి సిటీ బరిలో 13 మంది ఇప్పటి వరకు కాకినాడ ఎంపీ స్థానానికి 11 మంది, అమలాపురం ఎంపీ స్థానానికి 9 మంది, రాజమండ్రి ఎంపీ స్థానానికి ఆరుగురు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ చూస్తే ఇప్పటి వరకు అత్యధికంగా రాజమండ్రి సిటీ నుంచి 13 మంది నామినేషన్లు వేయగా, అత్యల్పంగా ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, రాజానగరం నియోజకవర్గాలకు ఐదేసి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. తుని, పెద్దాపురం, మండపేటల నుంచి ఏడేసి, ప్రత్తిపాడు నుంచి పది, పిఠాపురం నుంచి ఆరు, కాకినాడ రూరల్, అనపర్తి, రామచంద్రపురంల నుంచి పదేసి, కాకినాడ సిటీ, అమలాపురం, జగ్గంపేటల నుంచి ఎనిమిదేసి, కొత్తపేట, రంపచోడవరంల నుంచి తొమ్మిదేసి, రాజమండ్రి రూరల్ నుంచి 12 చొప్పున నామినేషన్లు పడ్డాయి. చివరిరోజైన శనివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్లను ఈ నెల 21న పరిశీలించనున్నారు. ఉప సంహరణకు 23 వరకు గడువుంది. అదేరోజు బరిలో నిలిచే వారి జాబితాను ప్రకటిస్తారు. -
ఎన్నికల బరిలో సినీనటి హేమ
మండపేటనుంచి జేఎస్పీ తరఫున పోటీ 19న నామినేషన్ దాఖలు అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :సినీ నటి హేమ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థినిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఆమె పోటీకి రంగం సిద్ధమైది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ జేఎస్పీ అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సిటింగ్ ఎంపీ జీవీ హర్షకుమార్ వెంట ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమ విలేకరులతో మాట్లాడారు. మండపేట అసెంబ్లీ జేఎస్పీ అభ్యర్థిగా తాను ఈనెల 19న నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మునుపెన్నడూ రాజకీయాల్లో తాను పాల్గొనలేదని, అయితే ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కాకతాళీయంగానో, కాలక్షేపం కోసమో తాను పోటీ చేయడంలేదని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలన్న స్థిర సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె స్పష్టం చేశారు. తనను ఎన్నుకుంటే మండపేటలోనే మకాం ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తన సొంతూరు రాజోలు అని, తొలి నుంచి జిల్లాతో, ఇక్కడి ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు. -
సీపీఎంతో జై సమైక్యాంధ్ర పార్టీ పొత్తు
హైదరాబాద్: సీమాంధ్రలో సీపీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ)ల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. 18 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో సీపీఎంకు జై సమైక్యాంధ్ర పార్టీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికలకు వెళ్తామని జై సమైక్యాంధ్ర నేత కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఎం నాయకుడు పి. మధు అన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ కు, అందుకు తెరవెనుక సహకరించిన బీజేపీ, టీడీపీలకు ఎన్నికల్లో గుణపాఠం చెబుతామన్నారు. సీపీఐతో పొత్తు లేదా ఎన్నికల సర్దుబాట్లకు జేఎస్పీ నిరాకరించింది. తాము పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను జేఎస్పీ ఇప్పటికే ప్రకటించింది. -
'సమైక్యాంధ్ర ' ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం
ఆనం సోదరులపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఆదివారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. గతంలో తమ తాతలు... తండ్రులు ప్రజా బలం కోసం తాపత్రయ పడ్డారని... ప్రస్తుతం వివేకానంద, రాంనారాయణ రెడ్డిలు ధనబలం పెంచుకునే క్రమంలో దిగజారిపోయారని ఆరోపించారు. రావణాసురిడి గుణం వివేకానంద రెడ్డిలో ఉందని జయకుమార్ రెడ్డి విమర్శించారు. వివేకాంద, రాం నారాయణలు ఇద్దరు ఇద్దరే అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర పార్టీ తరఫున నెల్లూరు సీటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు జయకుమార్ రెడ్డి వెల్లడించారు. -
కిరణ్ షో
పుట్టపర్తి టౌన్/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్‌షోలకు జన స్పందన కరువైంది. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి పుట్టపర్తికి చేరుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. 11 గంటలకు ఎనుములపల్లి గణేష్ సర్కిల్ మీదుగా సాయి ఆరామం టూరిజం హోటల్‌కు చేరుకున్నారు. ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద కిరణ్‌కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ పుట్టపర్తి, హిందూపురం, రాప్తాడు, గుంతకల్లు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో పాటు ఐదారుగురు చోటామోటా నాయకులు వచ్చారు. సాయి ఆరామంలో కిరణ్‌ను కలవడానికి వచ్చిన నాయకులకంటే సెక్యూరిటీ, మీడియా ప్రతిని ధులే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ విషయాన్ని గ్రహించిన కిరణ్.. ‘ఏమ య్యా మీడియా సిబ్బందే ఎక్కువగా ఉన్నారే’ అంటూ పుట్టపర్తి నాయకులను అడిగారు. అంతలోనే అమడగూరు, ఓడిసీ మండలాల నుంచి నాలుగు వాహనాల్లో అక్కడికి చేరుకున్న 50 మందిని స్థానిక నాయకులు కిరణ్‌కు పరిచయం చేశారు. అనంతరం ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు సాయి ఆరామం నుంచి రోడ్‌షో కొనసాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల నుంచి వెళ్తున్నా జనం మాత్రం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. చివరకు హనుమాన్ సర్కిల్లో వాహనాన్ని ఆపి కిరణ్ ప్రసంగించారు. ఈ స మయంలో కూడా జనం పలుచగా కన్పించారు. ప్రజల్ని ఆకట్టుకునేందుకు కిరణ్ ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం చేసినా అంతంత మాత్రంగా స్పం దించారు. ఆ తర్వాత అనంతపురం బయలుదేరారు. మార్గంమధ్యలో చెన్నేకొత్తపల్లి వద్ద ఐదు నిమిషాలు ఆపి అభివాదం చేసుకుంటూ వెళ్లారు. సాయంత్రం ఆరు గంటలకు అనంతపురం చేరుకున్న కిరణ్.. ప్రధాన రహదారుల్లో రోడ్ షో కొనసాగించారు. జన స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. చివరకు సప్తగిరి సర్కిల్ వద్ద సభ నిర్వహించి కాసేపు మట్లాడారు. ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో వివరించి ప్రసంగం ముగించి ముందు కెళ్లారు. అంతలో మళ్లీ మైక్ తీసుకుని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయర్త చిరంజీవిరెడ్డిని నగరవాసులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీని గెలిపిస్తే విభజనను అడ్డుకుంటామన్నారు. రాత్రికి సీఆర్ఐటీ కళాశాల విశ్రాంతి గహంలో కిరణ్ బస చేస్తారని ఆ కళాశాల డెరైక్టర్ అరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ అనంతపురం క్రై ం, న్యూస్‌లైన్ : తుది విడత ప్రాదేశిక ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సెంథిల్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు మంచి ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్లను ఇబ్బందులు పెట్టేవారు.. నేర చరిత్ర ఉన్నవారిని బూత్‌లలో ఉంచొద్దన్నారు. తాడిపత్రి, రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో గతంలో జరిగిన గొడవలను దష్టిలో పెట్టుకుని భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రలోభాలకు గురి చేసినా.. భయపెట్టినా ఓటర్లు టోల్ ఫ్రీ నంబర్ 1009553707070కు కాల్ చేయాలన్నారు. -
నల్లారి బ్రదర్స్ పక్కచూపులు
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ సార్వత్రిక ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు తదితర పరిణామాల తరువాత తొలిసారిగా ఆయన గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన కొత్త పార్టీ ఆవిర్భావంపై ఆయన హైదరాబాద్‌లో అధికారికంగా ఒక ప్రకటన చేశారు. సరిగ్గా నెల రోజుల తరువాత సొంత జిల్లాకు వస్తుండటం గమనార్హం. పార్టీ ఏర్పాటు సమయంలో ఆయన వెంట నిలిచిన పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జారుకున్నారు. జిల్లాలో ఆయనకు బాసటగా నిలిచిన ప్రథమశ్రేణి నాయకులు ఒక్కరు కూడా లేరు. సీఎం హోదాలో హంగూ ఆర్భాటంతో వచ్చే కిరణ్ ఈసారి పర్యటన మాజీ సీఎం హోదాలో జరగనుండటంతో అందరి కళ్లు ఈ పర్యటనపై పడ్డాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో తర్జనభర్జనలు పడినప్పటికీ చివరికి నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈలోగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముంచుకురావడంతో జేఎస్పీ కార్యకలాపాలకు విరామం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తరువాత పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం మదనపల్లెలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి మదనపల్లెకు చేరుకుని రోడ్ షోలో పాల్గొన్న తరువాత స్వగ్రామమైన కలికిరి మండలం నగిరిపల్లెకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. తదుపరి పర్యటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జేఎస్పీ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన ప్రజలకు ఇచ్చే సందేశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. సీఎంగా రాజీనామా తరువాత సొంత ని యోజకవర్గం పీలేరులో పట్టు కోల్పోయిన కిరణ్ సోదరులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల ఆరో తేదీ జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్‌రెడ్డి చక్రం తిప్పారు. పలు మండలాల్లో కిరణ్ వర్గీయుల ను వైఎస్సార్సీపీలో చేర్పించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రభావం పరిషత్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల ప్రచారం లో కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా పెద్దగా పాల్గొనలేదు. ఫలితాలను ముందుగానే ఊహించే కిషోర్ ప్రచారానికి దూరంగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతపార్టీ జెండాతో సార్వత్రిక ఎన్నికలను ఒంటిరిగా ఎదుర్కోవడంపై కిరణ్ సోదరులు ఆందోళనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొత్త వ్యూహాలకు తెరతీస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పీలేరు నియోజకవర్గం నుంచి కిరణ్ ఈ దఫా అసెం బ్లీకి పోటీచేసే విషయంలో ముందూవెనకా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గెలిచినాఓడినా లోక్‌సభకు పోటీ చేయడం శ్రేయస్కరంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రాజంపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేసే అంశం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించడం వెనుక జాతీయస్థాయిలో కిరణ్ పావులు కదిపినట్టు టీడీపీ వర్గాలు బలం గా చెబుతున్నాయి. రాజంపేట నియోజకవర్గం పరిధిలో టీడీపీకి బలం ఉండటంతో పాటు పలువురు ముఖ్య నాయకులు టికెట్టు కోసం పోటీపడ్డారు. అయితే బీజేపీ ఒత్తిడి మేరకు ఆ స్థానాన్ని టీడీపీ వదులుకుంది. ముందుగానే బీజేపీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం మేరకు ఇక్కడ నుంచి బలహీనమైన అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించినట్టయితే తనకు కొంతవరకైనా మేలు జరుగుతుందని ఉద్దేశ్యంలో కిరణ్ ఉన్నట్టు చెబుతున్నారు. రాజంపేట టికెట్టు ఆశించిన టీడీపీ మాజీ ఎంపీ ఒకరు అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుండటం గమనార్హం. సొంత నియోజకవర్గమైన పీలేరులో కిరణ్ సోదరుడు కిషోర్‌ను బరిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. దీంతో టీడీపీ సహకారంతో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలనే వ్యూహం జేఎస్పీ నేతలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మేరకు రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో కిరణ్ తన వ్యూహాలను అమలు చేసేందుకు నియోజకవర్గానికి వస్తున్నట్టు సమాచారం. -
'ఆరోగ్యం బాగోలేదనే రాజకీయాలకు దూరం'
తిరుమల : తన ఆరోగ్యం సహకరించనందునే రాజకీయాలకు దూరంగా ఉన్నానని మాజీమంత్రి శైలజానాథ్ తెలిపారు. ఆయన బుధవారం తిరుమల విచ్చేసి వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటిస్తానని తెలిపారు. కాగా శైలజానాథ్ ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో చెస్ట్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక శైలజానాథ్ రాజకీయ పయనంపై సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఆయన ఏ పార్టీవైపు వెళతారోనన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా శైలజానాథ్ పనిచేశారు. పార్టీ అధిష్టానం ఎదుట సమైక్య నినాదాన్ని వినిపించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని శైలజనాథ్‌కు అప్పగించారు. అయితే ఆ పార్టీకి అనుకున్నంతగా ఆదరణ లేకపోవటంతో ఆయన ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
కిరణ్‌కు మిగిలేవి చెప్పులేనా?
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ గుర్తును ఏ ముహూర్తంలో నిర్ణయించుకున్నారో గానీ.. ఆయనకు మిగిలేది ఆ చెప్పుల జత ఒక్కటే అనిపిస్తోంది. నాయకులు అందరూ ఒక్కొక్కళ్లుగా జై సమైక్యాంధ్ర పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గరుండి పార్టీ పెట్టించిన వాళ్లంతా క్రమంగా జారుకుంటున్నారు. నమ్మిన బంటులా ఉన్న పితాని సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. అనుంగు అనుచరుడిగా భావించిన రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ తాను రాజంపేట నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కూడా చెప్పేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆశీస్సులు తీసుకుని మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమైపోయారు. (చదవండి: కిరణ్‌కు సాయిప్రతాప్ షాక్) దీంతో తాను నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక కిరణ్ కుమార్ రెడ్డి తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఎన్నికల గుర్తుగా పెట్టుకున్న చెప్పుల జత వేసుకుని కిరణ్ వెళ్లిపోవాల్సి ఉంటుందని అంటున్నారు. -
చంద్రబాబును తరిమి కొట్టండి
పొన్నూరు, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనకు సహకరించిన పార్టీలకు ఓట్లేయొద్దని, అలా వేస్తే మీరూ విభజనకు సహకరించినట్టేనని మాజీ ముఖ్యమంత్రి జై సమైక్యంధ్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నాడు తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే నేడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అదే జాతిని చీల్చిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయారని ధ్వజమెత్తారు. వరంగల్ సభలో చంద్రబాబు జై తెలంగాణ నినాదమిచ్చారని, ఆయనను తెలుగు ప్రజలు తరిమి, తరిమి కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జిల్లాలోని తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి పొన్నూరులో ఏర్పాటు చేసిన జై సమైక్యంధ్ర పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుజాతిని చీల్చిన పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. రాజకీయాల్లో అవకాశవాదానికి తావులేదని, అధికారం కోసం గడ్డితింటే ప్రజలు ఉరుకోరన్నారు. ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ అధిష్టానం దుర్మార్గంగా తెలుగు ప్రజలను విడదీయడం వల్లే ఆ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ తన కోసం కాదని తెలుగుజాతి కోసం పెట్టానని వివరించారు. పార్టీ గుర్తుగా పాదరక్షలు ఎంచుకున్నానని, ఢిల్లీ పెద్దలకు చెంపదెబ్బ కొట్టేలా తీర్పివ్వాలని ఓటర్లును కోరారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అమలు చేయలేని హామీలు ఇస్తున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు తరమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో జై సమైక్యంద్ర పార్టీ నాయకులు గంగాధర్, రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెలవెలబోయిన రోడ్‌షో తెనాలిలో కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు జన స్పందన అంతగా లభించలేదు. రోడ్డుపక్కనున్న జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగిపోవాల్సి వచ్చింది. సెంటర్లో నిర్వహించిన సభకు కూడా కొద్దిపాటి కార్యకర్తలే హాజరయ్యారు. పొన్నూరులో రాత్రి అయినప్పటికీ ఆశించిన జనస్పందన కనిపించలేదు. -
బహుముఖ పోరు.. ఎవరిదో టాప్ గేరు?
ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇప్పుడు ఆ సీటు మాటే. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అత్యధిక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలోనే పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా అవతరించిన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక్కడ విద్యావంతులకు తోడు దేశంలోని వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన జనం పెద్దసంఖ్యలో ఉండడంతో ఆశావహులు ఈ సీటుపై కన్నేశారు. కొత్తగా పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఇక్కడి నుంచి తమ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఇక్కడి నుంచి పోటీకి పెట్టాలని యోచిస్తోంది. ఉండవల్లిని బరిలోకి దింపడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని జై సమైక్యాంధ్ర పార్టీ భావిస్తోంది. తద్వారా తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, లోక్‌సత్తా తరపున జయప్రకాష్ నారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా చందన చక్రవర్తి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మిగతా పార్టీల తరపున రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ బహుముఖ పోరు తప్పదని అర్థమవుతోంది. మల్కాజ్గిరి సమరం రసవత్తరంగా సాగుతుందనడంతో ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా మల్కాజ్గిరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. -
కిరణ్‌కు మిగిలేది బెర్లిన్ గోడ ముక్కేనా?
దొంగలు పడ్డ ఆరు నెలలకు.. ఏదో అయినట్లు హడావుడి చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదు. నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఆయనతో పాటు పలు సందర్భాల్లో ఆయన చూపిస్తున్న బెర్లిన్ గోడ ముక్క కూడా ఉండేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అనుంగు అనుచరులుగా భావిస్తున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా ఆయన పెట్టిన పార్టీకి దూరం అయిపోతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోక ముందే జేఎస్పీకి నాయకులు దండం పెట్టేస్తున్నారు. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ పక్కచూపులు చూస్తున్నారు. అందరికంటే ముందుగా మేల్కొన్న వ్యక్తి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్. టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయినట్లు సమాచారం. మరో సీనియర్ నేత సాయిప్రతాప్ కూడా కిరణ్ పార్టీలో ఉంటే పరువు దక్కదని డిసైడైపోయారట. అందరికంటే ముందు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వెంట కుడిభుజంగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా నేత పితాని సత్యనారాయణ కూడా.. ఇప్పుడు జేఎస్పీలో ఉంటే కష్టమని నిర్ణయించుకుని టాటా చెప్పేద్దామనుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా చూస్తుంటే చివరాఖరుకు పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరు, ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న బెర్లిన్ గోడముక్క మాత్రమే మిగిలినా ఆశ్యర్యపోనవసరం లేదని జేఎస్సీ వర్గాలే గుసగుస లాడుతున్నాయట. -
ఆఖరి బంతి మిగిలే ఉంది
సమైక్య ఛాంపియన్...! ఇంకా ఆట ముగిసిపోలేదు...!! ఆఖరి బంది మిగిలే ఉంది....!!అని చెప్పుకుంటూ చివరి క్షణం వరకు సీఎం కుర్చీలో కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆఖరు బంతి అంటే చివరి వరకు అధికారంలో కొనసాగడమేనన్న విమర్శలు రావడంతో... విభజన జరిగినట్లు కాదు. ఇంకా చాలా తంతు ఉంది...! అని చెబుతూ ఆట ఇప్పుడే ప్రారంభమైందన్న రీతిలో కొత్త పార్టీ గురించి వివరించడం మొదలుపెట్టారట. ఆయన కొత్త పార్టీతో ఇంకా ఆట మొదలు కాకముందే ఒక వికెట్ కోల్పోయింది. నేనొస్తానంటూ చెప్పిన కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ ఒకరు ఆయన టీమ్‌లో చేరకుండానే బ్యాట్ కింద పడేశారు. టీమ్ లో ఒకరు లేనంత మాతాన ఆట ఆగదని మొదలు పెట్టిన లీడర్ తొలి వ్యాఖ్యలే మిగతా ఆటగాళ్లను నీరసపరిచాయట. ఇంకా మైదానంలోకి దిగకముందే ఆట ఎందుకు ఆడబోతున్నామో కిరణ్ చెప్పిన మాటలు క్రీడాకారులను (ఆ పార్టీలో చేరిన నేతలు)దిమ్మదిరిగేలా చేశాయట. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ ప్రజలు నోటా (పైవారెవరూ కాదు) బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారంతా మాకు ఓటు వేయాలి...అని కిరణ్ పిలుపిచ్చారు. ఓహో... ఇదేదో బాగుందే అని ఆ పార్టీలో చేరిన ఒక కొత్తనేతకు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇటీవల ఢిల్లీ, మధ్యప్రదేశ్్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తొలిసారి ఈవీఎంలో నోటా ప్రవేశపెట్టగా, అనేక చోట్ల నోటా మీట నొక్కిన వారు వందల్లో మాత్రమే ఉన్నారని తెలిసి.... మా పరిస్థితి అంతేనా అని సణుక్కున్నారు. -
'కేసీఆర్‌ను సీఎం చేయడానికే రాష్ట్ర విభజన'
కాంగ్రెస్ పార్టీపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించినట్లుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఉండవల్లి మాట్లాడుతూ ... ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు. దేశ విచ్చిన్నానికి కాంగ్రెస్ పూనుకుందని విమర్శించారు. సీపీఎం పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టికల్ - 3ని ప్రస్తావించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వచ్చే లోక్‌సభలో ఆ అంశంపై చర్చ జరగనుందని ఉండవల్లి తెలిపారు. -
జేఎస్పీలో లోక్‌సభ కోఆర్డినేటర్ల నియామకం
హైదరాబాద్: పార్లమెంటరీ స్థానాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ సమన్వకర్తలను నియమిస్తోంది. సీమాంధ్రలోని 20 సెగ్మెంట్లలో పనిచేసేందుకు 20 మంది నాయకుల్ని ఎంపిక చేసింది. ఆయా జాబితాను గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారు. కేవీ సత్యనారాయణ రెడ్డి (అమలాపురం), కొత్తన్న రాము (అనకాపల్లి), కాపారపు శివున్నాయుడు (అరకు), పీ రామతిరుపతిరెడ్డి (ఏలూరు), కొత్తపల్లి శివశంకర్ (గుంటూరు), బీ రామమూర్తి (కాకినాడ), షేక్ ముక్తియార్ (మచిలీపట్నం), భూపతిరాజు రవివర్మ (నర్సాపురం), సుమంత్‌రెడ్డి (నెల్లూరు), బాల నాగేంద్రయాదవ్ (ఒంగోలు), చెరుకూరి రామారావు (రాజమండ్రి), ఎస్. జగన్ (శ్రీకాకుళం), ఉమ్మడి ధన్‌రాజ్ (విజయవాడ), జేకే రాజు (విజయనగరం), కె. చిరంజీవిరెడ్డి (అనంతపురం), రెడ్డప్పరెడ్డి (చిత్తూరు), ఎంఎల్ఎన్ మూర్తి (హిందూపూర్), కె. నిరంజన్‌రెడ్డి (తిరుపతి), ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి (నంద్యాల), నరాల సత్యనారాయణ (ఖమ్మం)లను సమన్వయకర్తలుగా ఎంపిక చేశారు. కృష్ణాలో పర్యటన ... శుక్ర, శనివారాల్లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కృష్ణా జిల్లాలో రోడ్‌షో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జగ్గయ్యపేట చేరుకునే ఆయన చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు గ్రామాల్లో జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. సాయంత్రం 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ విజయవాడలో విద్యార్థి జేఏసీ, న్యాయవాదులు, డాక్టర్లు నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. 22న పామర్రు, పెడన, బంటుమిల్లి, ముదినేపల్లి, కైకలూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రోడ్‌షోల్లో పాల్గొంటారు. -
దిక్కు లేక.. బిక్కచచ్చి...
సాక్షి, రాజమండ్రి : పెద్దాయన కష్టంతో పునర్జన్మ పొందిన కాంగ్రెస్ పార్టీ నేడు జీవచ్ఛవంగా మారిపోయింది. జిల్లాలో పూర్తిగా కుప్పకూలిపోయింది. పుర సమరంలో ఎక్కడా పత్తా లేకుండా పోయింది. పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఇంతటి హీన స్థితి పార్టీకి కలిగి ఉండదని ఆ పార్టీ పెద్దలే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం ఇలా చుట్టుకుందంటున్నారు. ఇక్కడ గెలిస్తే ఇక అంతటా గెలిచినట్టేనని జిల్లాపై అన్ని పార్టీలకు గురి. మొన్న పుట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తొలి సభ రాజమండ్రిలో నిర్వహించి తొలి అడుగు వేసింది. పార్టీల విజయాలకు తొలి మెట్టుగా నిలిచే జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ మాత్రం పట్టుకోల్పోయింది. రానున్న శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరవయ్యారు. రాజమండ్రిలో పార్టీకి కార్పొరేటర్ అభ్యర్థులు కరువయ్యారు. తుని తప్ప జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది. నాటి చరిత్ర ఘనం ఎన్టీఆర్ ప్రభంజనంతో 1984లో కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో చావు దెబ్బతింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2003లో పాదయాత్ర చేసి పార్టీకి ప్రాణం పోశారు. 2004 ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుని, పిఠాపురం మినహా 16 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన బోస్ కాంగ్రెస్ గూటికే చేరారు. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనాన్ని కాంగ్రెస్ కొనసాగించింది. 2009లో మహానేత మరణంతో మళ్లీ పార్టీకి పతన దశ ప్రారంభమైంది. అది ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది. -
చెప్పు పార్టీకి ఉపాధ్యక్షుడి షాక్?
చెప్పులతో తమను కొట్టాలని పెట్టుకున్నారో ఏమో గానీ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా స్థాపించిన 'జై సమైక్యాంధ్ర పార్టీ'కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చెప్పులను తమ గుర్తుగా పెట్టుకున్న ఈ పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న మాజీమంత్రి సాకే శైలజానాథ్ ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అప్పట్లో సమైక్యాంధ్ర కోసం పోరాడినవాళ్లలో శైలజానాథ్ ముందు వరుసలో ఉండటం అందరికీ తెలిసిందే. సొంత పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. కానీ ప్రయోజనం మాత్రం కనిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన కొత్త పార్టీలో ఆయనకు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టినా, అది వద్దనుకుని ఇప్పుడు సైకిల్ ఎక్కాలని చూస్తున్నారట. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయో చూడాలి!! -
టీడీపీలో చేరేందుకు శైలజానాథ్ యత్నం
అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఝలక్ ఇవ్వనున్నారా? ఆదిలో టీడీపీలో చేరేందుకు తన సన్నిహితుడు ద్వారా జేసీ బ్రదర్స్‌తో నెరపిన రాయబారం విఫలమైందా? ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్ ద్వారా శైలజానాథ్ బేరసారాలు సాగిస్తున్నారా? అనే ప్రశ్నలకు టీడీపీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శింగనమలలో ఆదివారం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శమంతకమణి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు ఇదే విషయంపై మండిపడ్డాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. శాసనసభలో అడుగుపెట్టిన శైలజానాథ్.. 2009 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్ హఠాన్మరణం శైలజానాథ్‌కు అనూహ్యంగా స్థానం దక్కింది. జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అంతరంగికుడిగా శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. సీఎంగా కిరణ్ ఉన్న కాలంలో ఆయన దన్నుతో శైలజానాథ్ భారీ ఎత్తున అక్రమార్జన సాగించారనే ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. కిరణ్‌తో కలిసి సమైక్యరాగం ఆలపిస్తూ ఆయన వెన్నంటే నడిచారు. ఇందుకు ప్రతిఫలంగానే కిరణ్.. శైలజానాథ్‌ను సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. కాగా, కిరణ్.. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే శైలజానాథ్ పక్క చూపులు చూశారు. వైఎస్సార్సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే తన సన్నిహితుడు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని జేసీ బ్రదర్స్ వద్దకు రాయబారం పంపారు. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పించేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్న శైలజానాథ్ ప్రతిపాదనకు జేసీ బ్రదర్స్ అంగీకరించలేదు. ఆ సీటును తమ అనుచరుడు కంబగిరి రాముడుకు ఇప్పించుకుంటామని జేసీ బ్రదర్స్ తెగేసి చెప్పడంతోనే విధిలేని పరిస్థితుల్లో శైలజానాథ్.. కిరణ్ వెంట నడిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిరణ్ ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీకి భవిత లేదనే భావనకు వచ్చిన శైలజానాథ్.. మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్‌తో ఆయన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పిస్తే.. పార్టీ ఫండ్ రూపంలో భారీ ఎత్తున ముట్టజెపుతానని శైలజానాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ బంపర్ ఆఫర్‌ను చంద్రబాబు దృష్టికి సీఎం రమేష్ తీసుకె ళ్లగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించాలని ఎమ్మెల్సీ శమంతకమణిని ఆయన కోరినట్లు తెలిసింది. శింగనమల నుంచి తన కుమారుడిని గానీ.. కుమార్తెను గానీ టీడీపీ తరఫున బరిలోకి దింపాలని శమంతకమణి భావించారు. కానీ.. ఇటీవల ఆ ఆలోచనను ఆమె విరమించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎందుకు వెనక్కి తగ్గారన్నది శైలజానాథ్‌కే ఎరుకని టీడీపీ నేతలు చలోక్తులు విసురుతున్నారు. శైలజానాథ్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సీఎం రమేష్ సమావేశం ఏర్పాటు చేయమనగానే శమంతకమణి కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కానీ.. సమావేశంలో కార్యకర్తలు శైలజానాథ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అదే జరిగితే పార్టీని వీడుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల మనోభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ‘భారీ ప్యాకేజ్’ ద్వారా శైలజానాథ్‌కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్‌కు 5 శాతం ఓట్లు కూడా రావు : సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి, ఓట్ల కోసం ఆ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ నేత, ఎంపీ సబ్బం హరి దుయ్యబట్టారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ విభజన పిటిషన్‌పై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ద్వారా రాష్ట్రం విడిపోదనే నమ్మకం ఇప్పటికీ ఉందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 5% ఓట్లు కూడా రావన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీపై తనకు ప్రత్యేకంగా అభిప్రాయం లేదని, అయినా విభజనకు ముందే వవన్ స్పందించి ఉంటే బాగుండేదన్నారు. -
'గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ కు తెలియదు'
రాజమండ్రి: గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్‌కు తెలియదని తాజా మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జిల్లాల్లో నెగ్గిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకే జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టిందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినందుకే సీఎం పదవిని వదులుకున్నానని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ మాట్లాడారు. పెద్దమ్మ(సోనియా), చిన్నమ్మ(సుష్మా స్వరాజ్) కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించమని ఎవరు సిఫారసు చేశారని ప్రశ్నించారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని నిలదీశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఎలా ఆమోదిస్తారన్నారు. తెలుగుజాతి విడిపోయిందన్న బాధ ప్రతిఒక్కరిలో ఉందన్నారు. అయితే విభజన పూర్తిగా అయిపోలేదన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలన్నారు. తనకు ప్రజలే బీఫారం ఇస్తారని కిరణ్ అన్నారు. పదవి వదిలేసి తెలుగు ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర పార్టీ జెండాను కిరణ్ ఆవిష్కరించారు. లేత పసుపుపచ్చ, పచ్చరంగులో ఉన్న జెండా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పటం ఉంచారు. -
'ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారు'
రాజమండ్రి: తలుపు వేసి చీకట్లో దొంగచాటుగా రాష్ట్ర విభజన చేశారని కాంగ్రెస్ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించి పార్లమెంట్ పరిసరాలకు రాకుండా చేసి విభజన బిల్లు ఆమోదించారని చెప్పారు. విభజన జరిగిందంటే మెడమీద తలకాయ ఉన్నవాడెవడూ ఒప్పుకోడని అన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన సాధ్యం కాదన్నారు. రాజమండ్రిలోని జెమిని మైదానంలో జరుగుతున్న జై సమైక్యాంధ్ర పార్టీ తొలి బహిరంగ సభలో ఉండవల్లి మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవిని తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు. ఢిల్లీ వాళ్లకు కేసీఆరే చాలా అందంగా కనిపించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీట్లు వస్తాయనే ఆశతో రాష్ట్రాన్ని విడదీస్తే... కేసీఆర్ ఏది చేయాలనుకున్నారో అదే చేశారని అన్నారు. మోసం చేయడమే కేసీఆర్ నైజమని ఉండవల్లి విమర్శించారు. రాష్ట్ర విభజన జరగనిచ్చే ప్రసక్తే లేదన్నారు. -
ఇంట గెలవకనే.. రచ్చకు !
తిరుపతి: ఇంట గెలవకనే రచ్చ గెలిచేందుకు పోయినట్టుంది మాజీ సీఎం వ్యవహారం. ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షులుగా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ బుధవారం పురుడు పోసుకుంటోంది. ఇందుకు గోదావరి తీరం రాజమండ్రి వేదిక కానుంది. పలు రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన సొంత జిల్లాలోని తిరుపతిని కాకుండా అయన రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు పట్టులేకపోవడమే అని విమర్శకులు అంటున్నారు. .సుమారు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీపై గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై గానీ ఎప్పుడూ పట్టులేదు. జిల్లా ప్రజల్లోనూ తనదంటూ ముద్ర వేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించడమంటే ఇంట గెలవకనే రచ్చ గెలిచే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదన్నట్టు వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తరువాత తన వెంట జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యేను నిలుపుకోలేని పరిస్థితి ఆయనది. అభివృద్ధి పనులన్నింటినీ పీలేరుకు కేటాయించుకున్న కిరణ్ సొంత నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు టీడీపీకి చెందిన ఇంతియాజ్ అహ్మద్, జీవీ శ్రీనాథరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్పించారు. ఒకరికి సమాచార కమిషనర్ పదవిని మరొకరికి టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఇప్పించుకోగలిగారు. అంతకు మించి జిల్లాలో ఆయన వల్ల రాజకీయంగా ప్రయోజనం పొందిన వారు లేరంటే అతిశయోక్తి లేదు. జిల్లాను ఏ మాత్రం పట్టించుకోని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లాను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే అపవాదును మాజీ సీఎం మూటగట్టుకుంటున్నారు. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారు. -
టీడీపీ అసంతృప్తులకు కిరణ్ తమ్ముడి గాలం
అసంతృప్త నేతలకు గాలం వేయడానికి కిరణ్ పార్టీ తరఫున ప్రయత్నాలు మొదలవుతున్నాయి. విశాఖపట్నం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలోని అసంతృప్త నేతలతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు సంతోష్ కుమార్ రెడ్డి మంతనాలు మొదలుపెట్టారు. నేతల ఇళ్లకు వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపిస్తున్న జై సమైక్యాంధ్ర పార్టీలో చేరాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. నగరంలోని ఐదు నియోజక వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు సంతోష్‌కుమార్‌రెడ్డి వెళ్లారు. అయితే ఇప్పటివరకు ఎవరి నుంచి హామీలు లభించినట్లు మాత్రం సమాచారం లేదు. -
కాంగ్రెస్‌కు రాంరాం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి పూర్తిగా కోల్పోవడంతో, నేతలు ఇతర పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు. ఏ పార్టీకి వెళితే తమకు మనుగడ ఉంటుందో అని ఆరా తీస్తున్నారు. అయితే వారు వెళ్లాలనుకుంటున్న పార్టీలు ఇప్పటికే ఫుల్ కావడంతో, ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే మార్గంలో మరికొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. సోమవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రె స్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీ వైపునకు వెళ్లాలనే విషయంపై తన సహచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ కూడా నేడో, రేపో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన సోమవారం ఒంగోలు చేరుకుని, తన సహచరులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. ఈనెల 14వ తేదీన ఆయన ఏపార్టీలో చేరాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు పార్టీలతో సంప్రదింపులు జరుపుతుండగా, ఒక పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇంకా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా పార్టీ వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, తన సహచరులతో సమావేశం కావాల్సి ఉండగా, ఈ సమావేశాన్ని ఈనెల 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆయన ఒక పార్టీకి చెందిన ప్రముఖ నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అవసరమైతే ఆయన పార్లమెంటుకు పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే ఈనెల 12న సమావేశమయ్యాక, ఏపార్టీలో చేరతారనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేస్తారని గతంలో వార్తలు వచ్చినా ఆయన అటువైపునకు మొగ్గడం లేదని తెలిసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డారు. కొంత మంది వైఎస్సార్ కాంగ్రెస్ వైపునకు రావాలనే ప్రయత్నంలో ఉండగా, కొందరు టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది. టీడీపీలోకి వచ్చే నాయకులకు ఆపార్టీ నేతలు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. -
రెండు రాష్ట్రాలను మళ్లీ కలుపుతాం
మా పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర’ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన రాష్ట్రం ఇంకా విడిపోలేదు.. సుప్రీంకోర్టుపై మాకు ఆశ ఉంది తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య గోడను ప్రజలే కూల్చేశారు తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది రాష్ట్ర విభజనకు చంద్రబాబునాయుడే కారకుడు గవర్నర్ నరసింహన్ సూపర్‌మేన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు కిరణ్ అధ్యక్షుడిగా 16 మందితో కొత్త పార్టీ కార్యవర్గం రేపు రాజమండ్రి సభలో పార్టీ గుర్తు ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఇంకా విడిపోలేదని.. సుప్రీం కోర్టుపై తమకింకా ఆశ ఉందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రం విడివడినా తూర్పు, పశ్చిమ జర్మనీలు కలసిపోయిన మాదిరిగానే ప్రజల పోరాటంతో రెంటినీ తిరిగి కలుపుతామని చెప్పారు. ‘‘తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య 1961లో అడ్డుగోడ కట్టారు.. 1991 నాటికి ప్రజలే దాన్ని కూల్చి ఒకటి చేశారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది.. తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది’’ అని కిరణ్ అభిప్రాయపడ్డారు. బెర్లిన్ గోడ కూల్చినప్పటి ఆ గోడ ముక్కను తన మిత్రుడొకరు తెచ్చారని, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక దాన్ని తెప్పించానంటూ ఒక చిన్న సంచిలోంచి రాయిముక్కను తీసి చూపించారు. తాను ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కిరణ్ ప్రకటించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన ప్రైవేటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పేరుతో పాటు 16 మందితో పార్టీ కార్యవర్గాన్నీ ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడు కాగా.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా చుండ్రు శ్రీహరిరావు, ఉపాధ్యక్షులుగా ఎ.సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, జి.వి.హర్షకుమార్, సాకే శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.తులసిరెడ్డి, కేశిరాజు శ్రీనివాస్ (గజల్ శ్రీనివాస్), టి.దొరస్వామి, ఎం.వి.రత్నబిందు, జి.గంగాధర్, కోశాధికారిగా భమిడిపాటి రామమూర్తి, సభ్యులుగా మహ్మద్ అబ్దుల్‌ఖాదిర్, బండి సుధాకర్‌లను నియమించారు. ఈ నెల 12వ తేదీన రాజమండ్రి సభలో పార్టీ గుర్తు తదితర అంశాలను ప్రకటిస్తామని కిరణ్ తెలిపారు. తమ పార్టీలోకి అన్ని వర్గాల ప్రజలు రావాలని, ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచే విలీన పోరాటం ప్రారంభమవుతుందని పేర్కొన్న కిర ణ్ ప్రకటించిన పార్టీ కార్యవర్గంలో ఆ ప్రాంతం నుంచి ఒక్క కీలక నేత కూడా లేకపోవటం గమనార్హం. పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు అందాయి... రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించినందున లగడపాటి రాజగోపాల్‌ను తమ పార్టీ కార్యవర్గంలోకి తీసుకోలేదని, అయితే ఆయన సలహాలు సూచనల ప్రకారం పార్టీ నడుస్తుందని కిరణ్ పేర్కొన్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు గురించి మీడియా అడగగా.. ‘‘ఇష్టమున్నదీ, లేనిదీ తెలుసుకున్నాకే ఈ కార్యవర్గాన్ని ఏర్పాటుచేశాం. ఇంకా ఏమైనా ఉంటే తరువాత ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. తమ పార్టీ తరఫున పోటీచేయడానికి అనేక మంది నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అయితే తాము టికెట్లను అమ్మబోమని, ప్రజల కోసం పనిచేసేవారికే ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన తాను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సలహాలు వినాల్సిన పనిలేదన్నారు. టీడీపీకి మద్దతు ఇవ్వాలంటున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజనపై తన వైఖరేమిటో ఇప్పటికీ చెప్పలేకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజనకు ఆయనే ప్రధాన కారణమన్నారు. విలేకరుల సమావేశంలో లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, చుండ్రు శ్రీహరిరావు, తులసిరెడ్డి, నీరజారెడ్డి, వాసిరెడ్డి వరదరామారావు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. ఆ ‘సూపర్‌మేన్’ ఉండగా ఎన్నికలు ఎందుకు? రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌పై కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘తెలంగాణలో అన్నీ చేయడానికి ఉన్నారు కదా.. ఇక్కడ ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? గవర్నర్ అన్నీ తానే చేసేస్తానంటున్నారు కదా? ఆ సూపర్‌మేన్ ఉండగా మళ్లీ ఎన్నికలు ఎందుకు? ఆయనకే అన్నీ వదిలేస్తే సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. -
కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
-
కిరణ్ పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర'
హైదరాబాద్: తాను పెట్టబోయే పార్టీ పేరు 'జై సమైక్యాంధ్ర' అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. తెలుగు ప్రజలను కలుపుకుని పోయేలా పార్టీ ఉంటుందని అన్నారు. తెలుగు జాతికి మేలు చేయడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు.ఆత్మగౌరవంతో ఓటు వేయాలనుకునే వారి కోసం పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేసిన వారందరినీ పార్టీలో చేర్చకుంటామన్నారు. పిరికితనమున్న చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు అవమానకరమన్నారు. విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబేనని అన్నారు. విభజన ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది చంద్రబాబే అన్నారు. తెలుగువారికి కాంగ్రెస్, బీజేపీ తీవ్ర అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు. లాభనష్టాలు ఆలోచించకుండా విభజన చేశారని విమర్శించారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు. తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు.