'కేసీఆర్ను సీఎం చేయడానికే రాష్ట్ర విభజన'
కాంగ్రెస్ పార్టీపై జై సమైక్యాంధ్ర పార్టీ నేత, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికే ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించినట్లుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఉండవల్లి మాట్లాడుతూ ... ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు.
దేశ విచ్చిన్నానికి కాంగ్రెస్ పూనుకుందని విమర్శించారు. సీపీఎం పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టికల్ - 3ని ప్రస్తావించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వచ్చే లోక్సభలో ఆ అంశంపై చర్చ జరగనుందని ఉండవల్లి తెలిపారు.