కాంగ్రెస్‌కు 5 శాతం ఓట్లు కూడా రావు : సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి, ఓట్ల కోసం ఆ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ నేత, ఎంపీ సబ్బం హరి దుయ్యబట్టారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ విభజన పిటిషన్‌పై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ద్వారా రాష్ట్రం విడిపోదనే నమ్మకం ఇప్పటికీ ఉందన్నారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 5% ఓట్లు కూడా రావన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీపై తనకు ప్రత్యేకంగా అభిప్రాయం లేదని, అయినా విభజనకు ముందే వవన్ స్పందించి ఉంటే బాగుండేదన్నారు.