Sabbam Hari
-
Sabbam Hari: లాన్ వెనక మాస్టర్ ప్లాన్?.. ఎవరీ అప్పారావు...?
సాక్షి, విశాఖపట్నం: సబ్బు బిళ్ల.. కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. గెడ్డలు, పార్కు స్థలాలు.. కావేవీ ఇంటి నెంబర్లను కేటాయించేందుకు అనర్హం అన్నట్టు జీవీఎంసీ తయారైంది. పదేళ్లుగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వెనక తూర్పున గల ఖాళీ స్థలంలో రెండు షెడ్లు ఉన్నట్టుగా పేర్కొని ఏకంగా ఇంటి నెంబర్లను కూడా జీవీఎంసీ కేటాయించింది. అప్పారావు పేరు మీద 355 గజాల స్థలానికి 50–1–40/18(3), 50–1–40/(4) ఇంటి నెంబర్లను ఇచ్చింది. ఈ స్థలం విలువ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్థలాన్ని విక్రయించేందుకు కొద్ది మంది రంగంలోకి దిగినట్టు సమాచారం. కేవలం ఇంటి నెంబర్లతో పాటు 1980 ప్రాంతంలో అగ్రిమెంటు చేసుకున్న కాగితాలతోనే ఈ స్థలాన్ని విక్రయించేందుకు పావులు కదులుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అసలు ఖాళీ స్థలంలో షెడ్లు ఉన్నట్టుగా ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు? ప్లాన్ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే అసలు ఇళ్లు ఎక్కడకు వెళ్లాయి? అనే వివరాల లోతుల్లోకి వెళితే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్బం హరి ఇంటి ప్లాన్‌లో కూడా అప్పారావుకు షెడ్డు ఉన్నట్లు చూపించారు. ఎవరీ అప్పారావు...? వాస్తవానికి సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వెనకాల తూర్పు వైపున లాన్ ఉంది. దీనికి ఆనుకుని జీవీఎంసీ పార్కు ఉంది. ఇన్ని రోజులుగా ఈ లాన్ మొత్తం సబ్బం హరి ఇంటి ఆవరణ భాగమని అందరూ అనుకున్నారు. ఈ స్థలం కాస్తా ఎం.అప్పారావు పేరు మీద ఉంది. తాజాగా సబ్బం హరి తీసుకున్న రుణంపై ఆయన ఆస్తులను అటాచ్ చేసుకుంటామంటూ న్యాయవాది ద్వారా వచ్చిన ప్రకటనలోనూ సబ్బం హరి ఇంటికి తూర్పు భాగంలో ఉన్న స్థలం అప్పారావుకు చెందిన షెడ్లుగా పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఎవరీ అప్పారావు అంటే సబ్బం హరికి శిష్యుడుగా ఉండేవారని తెలుస్తోంది. తన స్థలాన్ని ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటున్నా అప్పారావు ఎందుకు మిన్నకుండిపోతున్నారు? అసలు షెడ్లు లేకపోయినప్పటికీ పదేళ్లకుపైగా ఎందుకు అప్పారావు ఇంటి పన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మొదటగా జీవీఎంసీకి ప్లాన్ ఇచ్చి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీకి చెందిన పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇవేవీ లేకుండానే అప్పట్లో ఇంటి నెంబర్లను ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జీవీఎంసీ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.5 కోట్ల స్థలంపై కన్ను...! ఇన్ని రోజులు ఇంటి లాన్‌గా ఉపయోగించుకుంటున్న స్థలం తమదేనని సబ్బం హరి కుటుంబీకులు భావిస్తున్నారు. సబ్బం హరి మరణం తర్వాత కూడా ఇదంతా తమ స్థలమేనని భ్రమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా కోర్టు నుంచి అటాచ్మెంట్ వ్యవహారంలో తమ ఇంటి సరిహద్దుల్లో తూర్పువైపు అప్పారావు షెడ్లు ఉన్నట్టు చూపించారు. తీరా చూస్తే తూర్పు వైపునకు లాన్‌కు ఆనుకుని జీవీఎంసీ పార్కు మాత్రమే ఉంది. దీనితో అసలు వ్యవహారాన్ని కొద్ది మంది డాక్యుమెంట్లతో సహా వెలికితీసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే ఈ 355 గజాల స్థలాన్ని తక్కువ ధరకు తమ చేతుల్లోకి తీసుకునేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సబ్బం హరి కుటుంబీకుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ స్థలం వ్యవహారంపై మరింత లోతుల్లోకి వెళ్లి జీవీఎంసీ రికార్డులను పరిశీలిస్తే ఇన్ని రోజులుగా లాన్‌గా ఉపయోగించుకుంటూ అనుభవించిన సబ్బం హరి కుటుంబీకుల పాత్ర ఉందా? ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం తేలనుంది. -
సబ్బం హరి ఆస్తులు సీజ్!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నాయకుడు సబ్బం హరి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను సీజ్ చేసినట్లు సమాచారం. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం, వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు సమాచారం. విశాఖ మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న డెక్కన్ క్రానికల్ భవనాన్ని కోటక్ మహీంద్ర బ్యాంకు 2014లో రూ.17.80 కోట్లకు వేలం వేయగా సబ్బం హరి వేలంలో దాన్ని దక్కించుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్లు రుణం తీసుకున్నారు. వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డెక్కన్ క్రానికల్ యాజమాన్యం డెట్ రికవరీ అప్పిలేట్ అథారిటీలో కేసు వేసింది. అప్పిలేట్ అథారిటీ ఆ వేలాన్ని రద్దు చేసి, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై కోటక్ మహీంద్ర బ్యాంక్ అప్పీల్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉంది. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో అధికారులు సబ్బం హరికి 2018లోనే నోటీసులు జారీ చేశారు. 60 రోజుల్లో రుణం చెల్లించని పక్షంలో సీతమ్మధారలోని 1,622 చదరపు గజాల స్థలంలోని నివాసంతోపాటు మాధవధార వుడా లేఅవుట్లోని 444.44 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విష్ణు వైభవం గ్రూప్ హౌస్‌లోని అపార్ట్మెంట్, రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాంకు అధికారులు మాధవధార విష్ణు వైభవంలోని అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ నెల 12న సీతమ్మధారలో ఉన్న నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందించినట్లు తెలిసింది. -
అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
-
మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. చదవండి: ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ సూపర్‌వాస్మోల్ తాగి భర్తను భయపెట్టాలనుకుంది.. -
సబ్బం హరికి కరోనా.. పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
క్షమాపణ చెప్పిన కబ్జా సబ్బం
సాక్షి, విశాఖపట్నం: 24 గంటల్లో నేనేంటో చూపిస్తా... ఒక్కొక్కరి తాట తీస్తా... నేనంటే ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తా.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మేయర్ సబ్బం హరి శనివారం ఉదయం.. అలా మొదలు పెట్టి నోటికొచ్చినట్టు పేట్రేగిపోయి అన్న మాటలివి... 24 గంటల తర్వాత ఆదివారం నాడు అదే సబ్బం హరి... నేను ఆ రోజు సహనం కోల్పోయి మాట్లాడాను. ఆవేశంలో అన్న మాటలకు మన్నించమని కోరుతున్నాను.. అని క్షమాపణ కోరారు. (ఎవరిపైనా కక్షలేదు) జీవీఎంసీకి చెందిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాన్ని నిబంధనల మేరకు కూల్చివేసిన అధికారులతో పాటు ఏకంగా పాలకులపై కూడా సబ్బం హరి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. తనకు తాను ఎక్కువ ఊహించుకు ని మీడియా ముందు రెచ్చిపోయారు. 24 గంటల్లో తానేంటో చూపిస్తానని సవాల్ వేశారు. కానీ అదే సబ్బం హరి మరుసటి రోజే.. ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో నాలుగు గోడల మధ్య కుర్చీలో కూర్చుని అందరికీ క్షమాపణ చెప్పుకున్నారు. -
ఎవరిపైనా కక్షలేదు
గోపాలపట్నం (విశాఖ): మాజీ ఎంపీ సబ్బం హరి పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇంటి ప్రహరీ తొలగింపు విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని.. తమకు ఎవరిపైనా కక్ష లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ పనులు పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కబ్జా విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు నోటీసులు జారీచేశారని వివరించారు. ఆయన నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించడంతో గోడకు అంటించారని.. కానీ, ఆయన వాటిని తీసుకుని ఉంటే వివరణ ఇచ్చేందుకు అవకాశముండేదని బొత్స అభిప్రాయపడ్డారు. వివరణ ఇచ్చి ఉంటే ఆ చర్యలు మరోలా ఉండేవన్నారు. సబ్బం హరి వాడు వీడు అని సంభోదించడం దురదృష్టకరమని చెబుతూ.. రాజకీయ నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలని బొత్స హితవు పలికారు. విశాఖను రాజధానిగా చేయాలనుకుంటే వైఎస్సార్సీపీకి చెందిన విశాఖ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి గెలవాలని అయ్యన్నపాత్రుడు విసిరిన సవాల్‌ను చౌకబారు వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ప్రభుత్వం పనితీరుపట్ల, సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలపట్ల ఆకర్షితులై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొందరు అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. -
నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పొలిటికల్ బ్రోకర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ‘నీకు మేయిర్‌గా, ఎంపీగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మహానేత వైఎస్సార్.. అది మరిచిపోయి సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోం’.. అని ఆయన హెచ్చరించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్బం హరి మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగనన్న సైనికుడిలా వచ్చి నాలుక కోస్తానని హరిని హెచ్చరించారు. జీవీఎంసీకి సంబంధించిన సుమారు రూ.3 నుంచి 4 కోట్ల విలువైన 213 గజాల భూమిలో ‘సబ్బం’ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తే చంద్రబాబు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 213 గజాలే కదా.. దానికే కూల్చివేయాలా? అని కొందరు టీడీపీ నేతలంటున్నారని.. రెండు గజాలు కూడా ప్రభుత్వ భూములు కబ్జా కానివ్వబోమని అమర్నాథ్ అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు అండ్ కో ఎన్నో ఆరోపణలు చేశారని.. ఒక్కటీ రుజువు కాలేదన్నారు. -
రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స
-
రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స
సాక్షి, విశాఖ : ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీతమ్మధారలో మాజీ మేయర్ సబ్బం హరి ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి అధికారులు స్వాధీనం చేసుకోవడం తప్పు లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి రాజకీయం చేయడం తగదని మంత్రి బొత్స హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో అందరూ సమానులే అని, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని అన్నారు. (చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..) మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. గత నెల ఫ్లై ఓవర్ తొలి దశ పనుల్లో భాగంగా విమానాశ్రయం నుంచి విశాఖ సిటీలోకి వెళ్లే రోడ్డు ప్రారంభమైంది. తాజాగా తాటిచెట్ల పాలెం నుంచి గోపాలపట్నం వైపు వెళ్లే రోడ్డు పనులను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్‌గా మారిన ఎన్ఏడీలో రెండు వైపులా రోడ్లు ప్రారంభం కావడంతో చాలా వరకు సమస్య పరిష్కారమైందన్నారు. ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని తెలిపారు. త్వరితగతిన ఫ్లై ఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. (ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం) -
సీఎం జగన్ దృష్టిలో అందరూ సమానులే
-
‘అక్రమాలకు వాళ్లు అన్నదమ్ములు’
సాక్షి, విశాఖపట్నం: అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే.. సబ్బం హరి తమ్ముడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సబ్బం హరిని పొలిటికల్ బ్రోకర్‌గా ఆయన అభివర్ణించారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.3 కోట్ల విలువైన భూమిని సబ్బం హరి కబ్జా చేశారని దుయ్యబట్టారు. అధికారులు అనేక సార్లు నోటిసులు ఇచ్చినా సబ్బం హరి స్పందించలేదని.. ఆయన నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు అంటించారని తెలిపారు. అక్రమంగా భూములు దోచేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ‘‘విశాఖలో ఒక సెంట్ భూమి కూడా కబ్జా కానివ్వం. ప్రభుత్వ భూములను అక్రమదారుల చేతుల్లోకి వెళ్లనివ్వమని చాలా సార్లు చెప్పాం. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖలో భారీ భూ స్కామ్ జరిగింది. విశాఖలో భూ స్కామ్‌లు జరిగాయని టీడీపీ నేతలే ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ భూములను కాపాడతామని’’ అమర్నాథ్ పేర్కొన్నారు. (చదవండి: చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..) ‘‘సబ్బంహరి 213 గజాలు ఆక్రమిస్తే తప్పులేదు.. అధికారులు తొలగిస్తే తప్పని చంద్రబాబు అండ్ కో అంటున్నారు. 200 గజాలు కాదు కదా.. 2 గజాలు కూడా కబ్జా కానివ్వం. చంద్రబాబు బ్యాక్ డోర్ పొలిటిషియన్, సబ్బంహరి బ్లాక్మెయిల్ పొలిటిషియన్. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారు. హత్యకేసులో నిందితుడు రవీంద్రకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే, ఈఎస్ఐ స్కామ్‌లో డబ్బు మింగేసిన అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. దోపిడీలు, అక్రమాల్లో సీనియార్టీని బట్టి టీడీపీలో పదవులు ఇస్తారని’’ ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు సబ్బం హరికి రాజకీయ భిక్ష ఇస్తే.. వారిని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పు చేస్తే మాజీ ఎంపీ అయినా.. మేయర్ అయినా తమకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలను విమర్శించే స్థాయి సబ్బం హరికి లేదని, ఇకనైనా సబ్బంహరి తన భాష మార్చుకోవాలని అమర్నాథ్ హెచ్చరించారు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా) -
అవినీతికి అన్నయ్య చంద్రబాబు.. తమ్ముడు సబ్బంహరి
-
చిత్తగించండి.. ఇదిగో ‘హరి’ చిట్టా..
♦.. లేస్తే మనిషిని కాదన్నట్టు ఎప్పుడూ కుర్చీల్లో కూర్చుని టీవీల్లో కనిపిస్తూ సుద్ద పూసలా మాట్లాడే మాజీ మేయర్ సబ్బం హరి అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ♦ఘాజీ సబ్‌మెరైన్‌ను విశాఖ తీరానికి తానే తీసుకువచ్చానని అర్ధం పర్ధం లేని విశ్లేషణలు చేస్తూ.. తనకు తాను పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చే హరి వారి నిజరూపం ఇప్పుడు విశాఖ ప్రజలకు నిలువెత్తుగా దర్శనమిచ్చింది. ♦ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయో.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కనీస స్పృహ లేకుండా ఎంత దారుణంగా మాటలు అంటారో... ప్రభుత్వ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఎలా దునుమాడుతారో ఇన్నేళ్లకు స్పష్టంగా తెలుసొచ్చింది. ♦హరి ఓవర్ యాక్షన్ ఎందుకో తెలుసు కదా... ఆయన మేయర్‌గా వెలగబెట్టిన కాలంలో అడ్డగోలుగా కట్టేసిన ఓ అక్రమ నిర్మాణాన్ని కూలి్చవేయడమే అధికారులు, సర్కారు ఘోర తప్పిదమైనట్టు శనివారం రెచ్చిపోయాడాయన. ♦సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నంబర్ 7లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా రెస్ట్‌రూం, ప్రహరీ నిర్మాణం చేసేసిన నిర్వాకంపై స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం జీవీఎంసీ అధికారులు స్పందించి కూలగొట్టారు. అంతే.. దానికి నానాయాగీ చేస్తూ... అధికారులనే కాదు.. పాలకులను సైతం బండబూతులు తిడుతూ కనీస స్పృహ కూడా లేకుండా చేసిన సబ్బం గబ్బు చూసి సామాన్యులు సైతం ఛీ కొట్టారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ అసలు సుద్దపూసలా కబుర్లు చెబుతున్న సబ్బం హరి జీవిత ప్రస్థానం ఏమిటో ఒక్కసారి చూద్దాం రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సబ్బం హరి.. నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం... విశ్వాస ఘాతుకానికి అసలు సిసలు ప్రతిరూపం... ఇదేంటి అన్నేసి మాటలు. అని అనుకుంటున్నారా... అయితే సబ్బం హరి చిట్టా విప్పాల్సిందే.. ►విశాఖ నగరంలో పనీ పాటా లేకుండా చిల్లర వేషాలు, రౌడీవ్యవహారాలు, సెటిల్మెంట్లు చేస్తూ కాలం గడిపేసిన సబ్బం హరిని అదృష్టం వరించి 1995లో అనూహ్యంగా విశాఖ నగరపాలకసంస్థ మేయర్ అయ్యారు. గౌరవప్రదమైన మేయర్ పదవిలో ఉండి...ఓ సారి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన ఉదంతంలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఆనాటి పోలీస్‌కమిషనర్ ఆర్íపీ మీనా, డీఎస్పీ రామచంద్రరాజులు బూటుకాళ్లతో బుద్ధి చెప్పారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మేయర్‌గా ఉంటూనే.. ఏకంగా సీతమ్మధారలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్నే జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. (చదవండి: సబ్బం హరి కాదు.. పబ్బం హరి) ►ఒక్క దఫా మేయర్‌గా పని చేసి... చెరిగిపోని మరకలు అంటించుకున్న సబ్బం హరిని కాంగ్రెస్ పార్టీనే కాదు.. నగర ప్రజలు కూడా దూరంగా పెట్టేశారు. అందుకే 1999 ఎన్నికల్లో విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దారుణ పరాభవం రుచిచూపించారు. అటు తర్వాత మారిన మనిషినని నమ్మించి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఓ దఫా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణతో అప్పటి విశాఖ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సదరు సబ్బం హరిని సస్పెండ్ కూడా చేయించారు. అప్పుడు కూడా వైఎస్ పెద్దమనసుతో మన్నించి నేదురుమల్లిని ఒప్పించి తిరిగి హరిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరుండి అనకాపల్లి లోక్‌సభ సీటు ఇప్పించి గెలిపించారు. మహానేత హఠాన్మరణం తర్వాత సబ్బం హరి ఎలాంటి ‘కృతజ్ఞత’ చూపించారో అందరికీ తెలుసు. (చదవండి: మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా) 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. ఆనక చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి హరిబాబుకు ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల తర్వాత ఐదేళ్లు 2014 నుంచి 2019 వరకు బయటకు మొహం చూపించలేని దుస్థితి దాపురించింది. 2019లో సరిగ్గా ఎన్నికల సమయంలో తెర మీదకు వచ్చి తెలుగుదేశం పారీ్టలో ఎవ్వరూ వద్దన్న భీమిలి బరిలో నిలుచుని వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. సబ్బం రుద్దుడు భరించలేక భీమిలి ప్రజలు తిప్పికొట్టడంతో ఎన్నికల తర్వాత బయటకు మొహం చూపించలేక టీవీలకే పరిమితమయ్యాడు. కేవలం టీవీల్లో తప్పించి బయట ఎక్కడా కానరాని సబ్బం హరి విన్యాసాలు చూస్తే.. జబర్దస్త్ కామెడీకి మించి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే శనివారం ఆ కామెడీ శృతి మించి సీరియస్ కావడంతో సబ్బం హరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హరిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వెనుకాడబోమని జీవీఎంసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆక్రమణల కూల్చివేత
-
సబ్బం హరి కాదు.. పబ్బం హరి
పెదగంట్యాడ (గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి పబ్బం గడుపుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో రూ.3 కోట్ల విలువైన 212 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. శనివారం ధర్మశ్రీ పెదగంట్యాడలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► కేవలం 5 అడుగుల స్థలంలో బాత్రూమ్ మాత్రమే నిర్మించామని సబ్బం చెప్పడం విడ్డూరంగా ఉంది. ► ఆక్రమణను తొలగిస్తామని జీవీఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇస్తే.. వాటిని ఆయన బేఖాతరు చేశారు. సబ్బం మేయర్‌గా ఉన్న సమయంలోనే సీతమ్మధారలో స్థలం కొనుగోలు చేసి.. తర్వాత ఆ స్థలం వెనుక ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించారు.అది ప్రభుత్వ స్థలమని అప్పట్లోనే వామపక్షాలు ఆందోళనలు చేశాయి. అప్పుడు అధికారంలో ఉన్న సబ్బం రికార్డులను టాంపరింగ్ చేశారు. -
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులా?
మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నీతులు చెబుతున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ధ్వజమెత్తారు. శనివారం విశాఖపట్నం ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ పరిధిలో 450 అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ► పార్క్ స్థలాన్ని ఆక్రమించి సబ్బం హరి కట్టిన గోడను తొలగిస్తే విశాఖకు ఎంతో అన్యాయం, ఘోరం జరిగినట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ► ఆక్రమణలు కూల్చడానికి వెళ్లిన జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, సీఎం, ఎంపీ విజయసాయిరెడ్డిని సబ్బం నోటికి వచ్చినట్టు తిట్టడం ఎంతవరకు సమంజసం? ► మాజీ మేయర్‌గా పనిచేసిన సబ్బంకు ప్రభుత్వం స్థలం ఆక్రమించకూడదని తెలియదా? ఆయన చేసిన తప్పిదాలను సమర్థిస్తూ చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం దారుణం. ► టీవీ చర్చల్లో శ్రీరంగ నీతులు చెప్పే సబ్బం ఇప్పటికైనా తన తప్పు ఒప్పుకోవాలి. భవిష్యత్తులో సీఎంను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. సబ్బం ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకోవాలి. ► ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, పార్టీ నేతలు కె.కె.రాజు, కోలా గురువులు పాల్గొన్నారు. -
మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి శనివారం రెచ్చిపోయారు. విశాఖ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇంటి ప్రహరీని, రెస్టు రూమ్‌ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూల్చివేసినందుకు అసభ్య పదజాలంతో ప్రభుత్వం, అధికారులపై విరుచుకుపడ్డారు. ‘మెడలు విరిచేస్తా.. ఒక్కొక్కడి అంతు తేలుస్తా.. నా ఈక కూడా పీకలేరు.. ఎవ్వడినీ వదిలిపెట్టను’ అంటూ చిందులు తొక్కారు. రాయడానికి కూడా వీలు లేని భాషలో, సభ్యత మరిచి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. సబ్బం అనుచరులు కూడా అధికారులపై, కూలీలపై దౌర్జన్యానికి దిగడంతోపాటు, వారిని కులం పేరుతో దూషించి నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సబ్బం హరి అక్రమాల లీలలిలా.. ► విశాఖలోని రేసపువానిపాలెంలో సర్వే నంబర్ 7లో సుజనీ పార్క్ ఉంది. దీనికి ఆనుకొని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన సబ్బం.. 2012లో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్‌తో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. ► 592.93 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీ ప్లాన్ మంజూరు చేసింది. ► పక్కనే రూ.3 కోట్ల విలువ చేసే 212 చదరపు గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసేసిన సబ్బం ఆ స్థలంలో ప్రహరీ, రెస్టు రూమ్‌ను నిర్మించారు. ఈ ఆక్రమణలను గత నెల 5న ఏపీఎస్ఈబీ కాలనీ ప్రజలు జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. ► అధికారుల కొలతల్లో ప్లాన్ ప్రకారం.. భవనం 58 అడుగులు మాత్రమే వెడల్పు ఉండాల్సి ఉండగా.. దీనికి అదనంగా 12 అడుగుల మేర ఉంది. పొడవుని లెక్కిస్తే 159 అడుగుల మేర ఆక్రమించినట్లు తేలింది. ► ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం ఉంది. జీవీఎంసీ ఈ నెల 2న సబ్బం ఇంటికి నోటీసులు అంటించింది. స్పందన లేకపోవడంతో శనివారం జేసీబీలు తీసుకొచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ► 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మహాపాత్రో చెప్పారు. సబ్బం ప్లాన్‌కు దరఖాస్తు చేసినప్పుడు పార్కు స్థలాన్ని రోడ్డుగా చూపించారని, స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కూల్చివేశామన్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా: సబ్బం హరి ఖాళీ స్థలంలో రెస్ట్ రూమ్ నిర్మించాను. అంతమాత్రాన రాత్రికి రాత్రి వచ్చి కొట్టేస్తారా? 24 గంటల్లో సమస్యని ముగిస్తా. నేనేంటో సీఎంకు తెలుసు.. విజయసాయికి ఇంకా తెలియదనుకుంటా. వైజాగ్‌లో కూర్చొని డ్యాన్స్ చేద్దామనుకుంటున్నారు.. ఆ డ్యాన్స్ కట్టిస్తాను. నా గురించి తెలియక ఇలా చేశారు.ఎందుకు చేశాం రా అని వాళ్లే అనుకునే స్థాయికి తీసుకెళ్తాను. వైఎస్ జగన్ నాపై కక్ష సాధింపు చేయలేరు. ఇలా చేసి మిగిలినవారికి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా. -
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
-
సబ్బం హరిపై మంత్రి అవంతి ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బం హరిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఆయన వీధి రౌడీలా మాట్లాడారని మండిపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సిబ్బందిపై సబ్బం హరి దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం సరికాదని మంత్రి అవంతి హితవు పలికారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? సామాన్యులపై చర్యలు తీసుకోవాలా? పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చింది. జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చే ఆక్రమణలు తొలగించారు’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) సబ్బం హరి తీరుపై ఎమ్మెల్యే అదీప్‌రాజు విమర్శలు గుప్పించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని అన్నారు. సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాకు తెలిపారు. రికార్డులు తారుమారు చేసి సబ్బం హరి పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. గతంలో ఆయన ఆక్రమణలపై టీడీపీ-వామపక్షాలు ధర్నాలు చేశాయని గుర్తు చేశారు. అధికారులు నోటీసులు ఇచ్చినా సబ్బం హరి పట్టించుకోలేదని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. గతంలో ఆయన భూకబ్జాపై అయ్యన్నపాత్రుడు పోరాటం కూడా చేశారని, జిల్లా పరిషత్ సమావేశంలో సబ్బం హరి భూకబ్జాను అయ్యన్న నిలదీశారని తెలిపారు. ఇప్పుడు సబ్బం హరికి మద్దతుగా అయ్యన్న మాట్లాడటం సిగ్గుచేటని కరణం ధర్మశ్రీ విమర్శించారు. (చదవండి: కబ్జా స్థలంలో టాయిలెట్ నిర్మించిన సబ్బం హరి) -
‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’
సాక్షి, విశాఖపట్నం : అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్ 5న ఏపీఎస్ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ()సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు. మొత్తం మీద పార్క్‌లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపవంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. కాగా సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన మాజీ ఎంపీ సబ్బంహరి
-
సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎంపీ సబ్బంహరి వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారు. 12 అడుగుల పార్క్‌స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా స్థానిక అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. అయితే అక్కడి చేరుకున్న అధికారులపై సబ్బం హరి నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారు. రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వంది. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాము. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశాము. సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసాము. నోటీసుకు సబ్బం హరి స్పందించలేదు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు. -
‘చంద్రబాబు చుట్టూ డర్టీ డజన్ నాయకులు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజలు కరోనాలో బాధపడుతుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ టెక్నాలజీస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు చుట్టూ యనమల రామకృష్ణుడు, సబ్బం హరి లాంటి డర్టీ డజన్ నాయకులు ఉన్నారని, వారితో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. యనమల కలియుగ శకుని అని తూర్పు జనం అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ రాజకీయ బిక్షతో స్పీకర్ పదవి పొందిన యనమల చంద్రబాబు మాటలతో వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. బాబును చూస్తే భారతంలో దుర్యోధనుడు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పటి కాంగ్రెస్‌కి పట్టిన గతే పడుతుందన్నారు. విశాఖపై విషం కక్కుతున్న టీడీపీని నిలదీయాల్సిన అవసరం ఉత్తరాంధ్ర జర్నలిస్టులపై ఉందని ప్రసాద్రెడడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని యూ టర్న్‌లు తీసుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. ఆకు రౌడీ సబ్బం, కలియుగ శకుని యనమల పతనం చివర దశలో ఉందన్నారు. మున్సిపల్ స్థలంలో సబ్బం హరి నివాసం ఉంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడే చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌తో విశాఖ నగరం మరో ముంబై, చెన్నై నగరాల సరసన చేరనుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన విశాఖ నుంచి మొదలుపెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘ఆయన వ్యాఖ్యల వెనుక ఏ కుట్ర దాగుందో’
సాక్షి, విశాఖపట్నం: అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. అమరావతి కావాలో, విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. గతంలో ఎంపీ గా గెలిపించిన విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) రాజకీయ ద్వేషంతోనే.. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ కేంద్రంగా క్యాపిటల్ ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని.. ఇప్పుడు ఆయన వెంట సబ్బం హరి చేరారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆయనకే ఎక్కువ బాధ్యత ఉన్నట్లుగా సబ్బంహరి మాట్లాడుతున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సారేనని గుర్తు చేశారు. 2022 లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి.. దాని వెనుక ఏం కుట్ర వుందో సమాధానం చెప్పాలన్నారు. బ్రేక్ ఫాస్ట్ జపాన్...మధ్యాహ్నం చైనా అంటూ రాజధానిపై చంద్రబాబు నాయుడు భ్రమలు సృష్టించారని ఎద్దేవా చేశారు. ‘‘ ఏపీ లో ప్రజాస్వామ్యం లేదని చెప్పే బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం ఏం చేశారు. తమ సొంత పనులు మినహా ప్రజల కోసం ఏమి చేయలేదు. తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు అంటారా ? అంటే హత్య చేసిన వాళ్ళని.. మోసాలు చేసిన వారిని విడిచి పెట్టాలా ?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. అన్ని వర్గాలు కలిసి దాడి చేసేందుకు కుట్ర చేసినా భారతంలో అర్జునుడికి మాదిరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.