
త్వరలో మంచి వార్త వింటాం: సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర సమైక్యత కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ధృడ నిర్ణయం తీసుకున్నారని, దానిని తాను స్వాగతిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రజలంతా తిప్పికొట్టారన్నారు. త్వరలోనే మంచి వార్త వింటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనే భావనతోనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించారని సబ్బం హరి అన్నారు. అందుకే ఆయన చనిపోయి నాలుగేళ్లైనా దేశ వ్యాప్తంగానే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విశాఖలోని 72 వార్డుల్లోనూ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.