'సబ్బం హరిపై కేసు నమోదు చేస్తాం' | Election commission to booked sabbam hari | Sakshi
Sakshi News home page

'సబ్బం హరిపై కేసు నమోదు చేస్తాం'

Published Tue, May 6 2014 6:29 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

'సబ్బం హరిపై కేసు నమోదు చేస్తాం' - Sakshi

'సబ్బం హరిపై కేసు నమోదు చేస్తాం'

హైదరాబాద్: ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ మరో పార్టీకి మద్దతు ప్రకటించడం చెల్లదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సబ్బం హరిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అలా మద్దతు ప్రకటించేవారిని డమ్మీ అభ్యర్థులుగా ప్రకటిస్తామన్నారు. డమ్మీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మద్దతు ప్రకటించిన అభ్యర్థి ఖర్చులో కలుపుతామని వెల్లడించారు.

ఎన్నికల సందర్భంగా పెట్టిన అన్ని కేసులను ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులలో విచారణ చేపడతామన్నారు. ప్రలోభాలతో తాత్కాలికంగా ఎన్నికైనా ఎన్నికల చట్టాల ప్రకారం శిక్ష తప్పదన్నారు. ఓటర్‌ స్లిప్పులు లేకపోయినా ఓటర్‌ లిస్ట్‌లో పేరుంటే ఓటు వేయొచ్చని వివరించారు. ఓటర్ పోలింగ్‌ బూత్‌లోకి ఓటర్లు వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పకూడదన్నారు. పక్క గ్రామాల నుంచి కూడా పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చని భన్వర్‌లాల్‌ తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement