కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సీఈవో భన్వర్‌లాల్ ఆదేశం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. కౌంటింగ్ తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం ఆయన, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున కౌంటింగ్ జరిగే గదుల పైకప్పులకున్న లీకేజీలు, గదుల్లోకి నీరు చేరే అవకాశాలున్నాయా? అనే అంశాలపై పరిశీలించాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక గదిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి గదిలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ప్రచురితమైన పెయిడ్ న్యూస్‌పై వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్ల గురించి వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్, ఏజేసీ హ షీం షరీఫ్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషా ఖాసీం, రిటర్నింగ్ అధికారులు గణేష్‌కుమార్, మనోరమ, తేజ్‌భరత్, సునీతారాణి, నాగార్జునసాగర్, కె.సాల్మన్‌రాజు, తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.