ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి: భన్వర్లాల్ | EVMs safe in Kakinada JNTU, says Bhanwra lal | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి: భన్వర్లాల్

Published Sat, May 10 2014 3:35 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి: భన్వర్లాల్ - Sakshi

ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి: భన్వర్లాల్

హైదరాబాద్: ఏయే కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలో సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. ఈ నెల 12 లేదా 13న రీపోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికల రూపంలో తెప్పించుకున్నారు.

కాకినాడ జేఎన్టీయూలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈవీఎంలోకి వర్షం నీరు చేరలేదని తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement