'కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధం' | cell phones not allowed to Election Counting centres, says Bhanwar lal | Sakshi
Sakshi News home page

'కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధం'

Published Thu, May 15 2014 6:38 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

'కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధం' - Sakshi

'కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధం'

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రాంతాల్లో 168 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 కౌంటింగ్ టేబుల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. 189 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి అత్యధికంగా 45 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి 18 రౌండ్ల కౌంటింగ్‌ మాత్రమే ఉంటుందన్నారు. కూకట్‌పల్లి అసెంబ్లీకి 45, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించబోమని భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement