మమ్మల్ని అడ్డుకునే వారుండరు: సబ్బం హరి | nobody can stop us, says sabbam hari | Sakshi
Sakshi News home page

మమ్మల్ని అడ్డుకునే వారుండరు: సబ్బం హరి

Published Tue, Feb 11 2014 3:25 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మమ్మల్ని అడ్డుకునే వారుండరు: సబ్బం హరి - Sakshi

మమ్మల్ని అడ్డుకునే వారుండరు: సబ్బం హరి

హైదరాబాద్: తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించిందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. విభజన బిల్లును అడ్డుకోవడం, వ్యతిరేకించి ఓటు వేసే అవకాశం కల్పించి కాంగ్రెస్ తమకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక తమను అడ్డుకునేవారు ఉండరని అన్నారు. తమను పార్టీ నుంచి బహిష్కరించగలరు కానీ పార్లమెంట్ తప్పించలేరని అన్నారు. పార్లమెంట్లో తమ వాణి వినిపించకుండా ఆపలేరన్నారు.

ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకే కాంగ్రెస్ తమను బహిష్కరించిందని ఆరోపించారు. వచ్చే 15 రోజులు తెలంగాణ బిల్లు పార్లమెంట్కు రాకుండా చూడడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈనెల 21 తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ బీఫారం తీసుకునేవారుండరని చెప్పారు. ఈనెల 24న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని వెల్లడించారు. 24 తర్వాత తమతో పాటు పలువురు ఎంపీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement