సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పొలిటికల్ బ్రోకర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. ‘నీకు మేయిర్‌గా, ఎంపీగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మహానేత వైఎస్సార్.. అది మరిచిపోయి సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోం’.. అని ఆయన హెచ్చరించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్బం హరి మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగనన్న సైనికుడిలా వచ్చి నాలుక కోస్తానని హరిని హెచ్చరించారు. జీవీఎంసీకి సంబంధించిన సుమారు రూ.3 నుంచి 4 కోట్ల విలువైన 213 గజాల భూమిలో ‘సబ్బం’ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తే చంద్రబాబు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
213 గజాలే కదా.. దానికే కూల్చివేయాలా? అని కొందరు టీడీపీ నేతలంటున్నారని.. రెండు గజాలు కూడా ప్రభుత్వ భూములు కబ్జా కానివ్వబోమని అమర్‌నాథ్ అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు అండ్ కో ఎన్నో ఆరోపణలు చేశారని.. ఒక్కటీ రుజువు కాలేదన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
Published Mon, Oct 5 2020 5:45 AM | Last Updated on Mon, Oct 5 2020 9:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment