GUDIVADA Amarnath
-
అందర్నీ ముంచడమే బాబుకు తెలుసు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, తాడేపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ అమర్నాథ్ కామెంట్స్ చేశారు.కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు కామెంట్స్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అమర్నాథ్..‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడి, కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ విషయంలోనూ అంతే. బాబు వచ్చాడు.. అందర్నీ ముంచుతున్నాడు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరుగార్చేలా @ncbn గారు మాట్లాడ్డం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబుగారు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబుగారు ఇలాగే మాట్లాడి,… pic.twitter.com/Zq0ctJ9xDR— Gudivada Amarnath (@gudivadaamar) September 18, 2024 ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
‘పవన్.. రాధాకృష్ణపై చెప్పు ఎత్తలేదే..?’
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైరయ్యారు. ఆవిర్భావ సభ ఉద్దేశమేంటో పవన్‌కే తెలియదంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన. నమ్ముకున్న జనసేన క్యాడర్‌ను పవన్ నట్టేటముంచడం ఖాయమని కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రావాలనుకుంటే.. పవన్‌కు విజిటింగ్ పాసులిస్తామని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మంత్రి అమర్నాథ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. మచిలీపట్నం సభలో పవన్‌కళ్యాణ్ ప్రసంగంలో కొత్తగా కనిపించింది.. వినిపించేదేమీ లేదు. ఒక రాజకీయపార్టీ పెట్టి గంపగుత్తగా మూటగట్టి మరో రాజకీయ పార్టీకి అమ్మేదామనే లక్ష్యం ఉన్న నాయకత్వం నిన్న పవన్‌లో కనిపించింది. కులాలతో సంబంధంలేదని చెబుతూనే.. కాపులంతా కమ్మసామాజికవర్గానికి అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండాలని నిన్నటి ప్రసంగంలో వినిపించింది. కొన్నిచోట్ల జనసేన పోటీచేసినా.. ఓట్లు మాత్రం టీడీపీకి వేసి చంద్రబాబుపై ఉన్న ప్రేమ, మమకారం చాటుకోవాలని పవన్ తన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. జెండా జనసేనది.. అజెండా టీడీపీది.. పదేళ్లలో జనసేన పార్టీ తీరును చూస్తే.. 2014లో కొంతమందితో పొత్తు, 2019లో మరికొంతమందితో పొత్తులు పెట్టుకుంటే.. ఇప్పటికే ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీ గురించి ఏమని మాట్లాడారో అందరూ చూశారు. కనీసం రాజకీయ అజెండా అనేది లేకుండా, రాజకీయ పార్టీని ఎందుకు పెట్టారో కూడా తెలియకుండా పవన్ పర్యటనలు చేస్తుంటాడు. చంద్రబాబు సమర్ధత గురించి మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం కూలిపోవాలంటాడు. ప్రసంగాలతో ఊగిపోతుంటాడు. జెండానేమో జనసేనది.. అజెండా మాత్రం టీడీపీది అని అందరికీ ఇప్పటికే అర్ధమైంది. మూటగట్టి చంద్రబాబుకు అమ్మేద్దామనేది.. ఒకపక్కనేమో కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయ పార్టీ పెట్టానని గొప్పగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. మరోపక్క మాత్రం కులాల గురించి నిన్నటి సభలో ఎంతసేపు మాట్లాడారో అందరకీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో నిన్న అందరికీ తెలిసిందేమంటే.. తన ఎజెండా ప్రకారం.. కాపు కులాన్ని ఆయనతో పాటు ఉండే వ్యక్తులందర్నీ మూటగట్టి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అమ్మకం పెట్టాలనే ఉద్దేశమనేది తేటతెల్లమైంది. ముమ్మాటికీ దత్తపుత్రుడే.. మేం ఇప్పటికే అనేక సందర్భాల్లో వపన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు దత్తపుత్రుడని చెప్పుకుంటూ వచ్చాం. దానికి నిన్నటి సభతో మరోసారి అందరికీ తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారానే తనకు తానుగానే చంద్రబాబు మనిషినని చెప్పుకున్నట్లైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రయంతోనే పవన్‌కళ్యాణ్ ఊగిపోయే ప్రసంగాలు చేస్తున్నాడని అందరికీ నిన్నటితో అర్ధమైంది. చంద్రబాబును, టీడీపీని పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట ఎందుకు అనలేకపోతున్నాడనేది ఈరోజు ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అసెంబ్లీకి రావాలనుకుంటే పాసులిస్తాం.. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తానని చెబుతున్నాడు. అసెంబ్లీకి రావాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిన పనేముంది..? కావాలంటే, అసెంబ్లీ విజిటింగ్ పాసులు మేం ఏర్పాటుచేస్తాము కదా..? మా స్పీకర్‌ని అడిగితే, రెండు పాసులు ఇస్తారు. వాటిని పట్టుకుని అసెంబ్లీ ఎలా ఉంటుందో.. అనేది చూసి పవన్‌కళ్యాణ్ వెళ్లిపోవచ్చు. 175 చోట్ల పోటీచేసే దమ్ములేని నేత.. ఎన్నికల్లో 175 స్థానాలకు 175చోట్ల పోటీచేస్తానని చెప్పుకునే ధైర్యం జనసేన అధినేతగా పవన్‌కళ్యాణ్‌కు ఉందా..? అంటే, అంతటి సాహసం కూడా ఆయనకు లేదు. కనీసం, ఇంకో రాజకీయ పార్టీతో కలిసి ఎన్నికలకు వస్తామని చెప్పడానికీ అతని దగ్గర క్లారిటీ లేదు. చివరికి పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరికి అమ్ముడుపోయినా.. దాంట్లో తన కేడర్, తనను నమ్ముకున్నవారంతా భాగస్వామ్యులు అవ్వాలని కోరుతున్నాడు. పొంతనలేని మాటలతో ఊకదంపుడు ప్రసంగం.. ఈ రాష్ట్రంలో ఇక్కడెవరికీ దమ్మూ, ధైర్యం లేదంటున్నాడు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఉన్న పోరాటస్ఫూర్తి ఇక్కడ లేదంటున్నాడు. పోనీ, తెలంగాణలోనైనా ఎన్నికల్లో పవన్ పోటీకి వెళ్లవచ్చు కదా..? అదీ చేయడు. ఆంధ్రా, తెలంగాణలో ఆయన ఎక్కడ తిరగాలన్నా ఏదొక పార్టీతో అంటకాగడం అలవాటైంది. సందర్భాన్ని బట్టి సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం అనేది ఈమధ్య పవన్‌కు బాగా పరిపాటిగా మారింది. వంగవీటి మోహనరంగా గురించి మాట్లాడతాడు. రంగా కాపు, ఆయన సతీమణి కమ్మ కులం అంటాడు. వారిద్దరికీ పుట్టిన రాధాకు రెండు కులాలంటాడు. ఒంగోలులో తనకు ముగ్గురు రెడ్లు స్నేహితులున్నారంటాడు. వాళ్ల పేర్లు కూడా చెబుతాడు. ఆయనవన్నీ పొంతనలేని మాటలే.. అసలు, పవన్‌కకు ఈ కులాల గోల ఎందుకు..? పవన్ నాయకత్వాన్ని నమ్మితే మునిగినట్టే.. జనసేన పార్టీకి ఒక అజెండా ఉందా..? ఒక సిద్ధాంతం లేదా..? ఆయన పార్టీ స్టాండ్ ఏంటో పవన్ చెప్పాలి కదా..?. చివరికి, పవన్.. జనసేన పార్టీని ఎందుకు పెట్టారయ్యా అంటే, జగన్మోహన్రెడ్డిని ఓడించడానికే తప్ప వాళ్లు అధికారంలోకి రావడానికో.. వాళ్ల పార్టీ నాయకులు రాజకీయంగా ఎదగడానికో పెట్టలేదు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పోరాడతానని ఆయన మాటల్లో నిన్న స్పష్టమైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ వెంట తిరిగే నాయకులనే చెప్పాలి. వవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన్ను నమ్ముకున్న పాపానికి తమను మూటగట్టి తెలుగుదేశం పార్టీకి అమ్మాలని చూస్తున్నాడని జనసేన కేడర్ అర్థం చేసుకోవాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చెప్పు ఎత్తలేదే..? పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నాడనే విషయం మేం ఇప్పటివరకు మాట్లాడలేదు. అయితే, ఆయన దత్తదండ్రి, పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు గెజిట్ పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రం పవన్ వెయ్యికోట్ల రూపాయల ప్యాకేజీకి డీల్ కుదుర్చుకున్నాడని రాస్తే.. వారి టీవీలో ప్రసారం చేస్తే ఆయన ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంలో అంతరార్ధమేంటి..? ఆంధ్రజ్యోతి దినపత్రిక మీద, ఏబీఎన్ రాధాకృష్ణ మీద చెప్పులెందుకు ఎత్తలేదు..? అంటే, సొంత మనుషులు ఏమన్నా కూడా పవన్ పట్టించుకోడన్నమాట. వైరిపార్టీల మాటలే ఆయన చెవులకు వినిపిస్తాయి. ఇంత జరుగుతున్నా.. నిన్న మచిలీపట్నం సభలో ఆయన అంతగా విడమరిచి తన ఉద్దేశమేంటో చెప్పినా.. పవన్ అమ్ముడుపోలేదని ఎవరైనా అనుకుంటే, వారంత అమాయకులు ఎక్కడా ఉండరని చెప్పాలి. ఒకవేళ, అలాంటి అమాయకులు ఇంకా ఉన్నారంటే.. జనసేనపార్టీ కార్యకర్తలుగానే ఉన్నారేమో. దమ్మున్న నేతగా సీఎం జగన్ దిశానిర్దేశమది.. సీఎం వైఎస్ జగన్.. ఏ వేదిక మీద మాట్లాడినా.. ‘175 స్థానాలకు 175 చోట్ల మనం గెలవబోతున్నాం.. ఆ మేరకు మీరంతా కష్టపడండి..’ అని మా అందరికీ దిశానిర్దేశం చేస్తారు. మరి, పవన్ నిన్న వేదికపైన నిల్చొని మాట్లాడేటప్పుడు..‘ఇదిగో వేదికమీద నాతో పాటు ఉన్న నాయకుల్ని, వేదిక కింద ఉన్న పార్టీ కేడర్‌ను 175 స్థానాల్లో రేపటి ఎన్నికల్లో గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకెళ్తాను’ అని దమ్ముగా ఎందుకు చెప్పలేకపోయాడు..? ‘ఇదిగో.. నాకు ఒక సీటిస్తారా..? రెండు సీట్లు ఇస్తారా..? నన్ను 10 చోట్ల పోటీచేయమంటారా..? ఏదోరకంగా అసెంబ్లీకి రమ్మంటారా..?’ అంటూ దేహీమని బతిమాలుకోవడం ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకుడి లక్షణం, వ్యక్తిత్వం కాదు. దీన్నిబట్టి జనసేన పార్టీ కేడర్ వారి అధినేత తీరును అర్ధం చేసుకోవాలనేది మా అభిప్రాయం. చిరంజీవికి తమ్ముడువి కాదా..? వ్యూహాలు.. వ్యూహాలు అంటూ పవన్ పెద్దపెద్ద మాటలు వల్లెవేస్తున్నాడు. పార్టీ పెట్టిన దగ్గర్నుంచి నువ్వు అనుసరించిన వ్యూహామేంటి?. కాసేపు నాకు రాజకీయాలతో సంబంధం లేదంటావు. నా కుటంబంలో ఎవరూ రాజకీయ నాయకులు లేరంటావు.. మరి, నువ్వు చిరంజీవికి తమ్ముడువి కాదా..? ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నువ్వు యువరాజ్యం అధ్యక్షుడివి కాదా..? నీకు ఆ రాజకీయ అనుభవం లేదా..? ఆరోజు 294 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశానని గొప్పగా చెప్పుకుంటావు కదా.. మరి, ఈరోజు నువ్వు పర్యటన చేసినచోట చిరంజీవి పేరును కూడా ఎందుకు పలకలేకపోతున్నావు..? ఇదొక వ్యూహమా..? అసలు, పవన్ వ్యూహాలు చేసి ఈ రాష్ట్రంలో ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు..? బీజేపీతో మిత్రపక్షం అంటాడు.. అతని చేయి మాత్రం మరోవైపు చూస్తూ ఉంటుంది. అతని చేయి మాత్రం మరోపార్టీ అధినేత చేతిలో బిగుసుపోతుంది అంటూ ఎద్దేవా చేశారు. -
పవన్‌కు కొత్త పేర్లు పెట్టిన మంత్రి అమర్నాథ్.. పీకే అంటే..
సాక్షి, తాడేపల్లి: ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని అయితీరుతుంది. ఎంతమంది చంద్రబాబులు, పవన్ కల్యాణ్‌లు వచ్చినా అడ్డుకోలేరు. మీ యుద్ధానికి మేము కూడా సిద్ధమని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎంత బాగా అబద్ధాలు చెబుతున్నారు. ముందు నుంచి వైఎస్సార్సీపీ చెప్పినట్టుగానే.. ప్రజలు ఊహించినట్టుగానే అక్రమ సంబంధానికి పుల్‌స్టాప్ పడింది. కొత్త బంధానికి తెరలేచింది. ఎట్టకేలకు ముసుగు తీసి బయటకు వచ్చారు. కలిసి వెళ్లాలనుకుంటే వెళ్లండి.. ప్రజలను ఎందుకు మోసం చేస్తారు. విశాఖలో జరిగిందేంటి.. ఈయన వచ్చి పరామర్శించడం ఏంటి?. విశాఖలో వైఎస్సార్సీపీ నేతలు పవన్ కల్యాణ్‌కు కొట్టారా లేక పవన్ కల్యాణ్ మనుషులు మంత్రులను కొట్టారా?. మంత్రులపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే.. కొట్టిన వారిని చంద్రబాబు పరామర్శిస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున మాట్లాడి ప్రజాస్వామ్యం లేదంటారా.. అందరూ ఏకం కావాలా.. అవ్వండి. మీ వ్యవహారాలను ప్రజలు గమినిస్తున్నారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతావా?. నువ్వు చంద్రబాబుకు అమ్ముడుపోయావని రుజువు చేశాము. నీకు కాపు కులం గురించి మాట్లాడే అర్హత ఉందా?. రాష్ట్రంలో ఎవరికీ చెప్పులు లేవా.. నీకే ఉన్నాయా?. చెప్పుతో ఈ డ్రామా అంతా విశాఖ రాజధాని డిమాండ్‌ను డీవియేట్ చేసేందుకే. రంగా గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా?. రంగా మరణానికి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడతావా?. ముద్రగడను పోలీసులు హింసించినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు. నీకు ఇప్పుడు కాపులు గుర్తుకు వచ్చారా?. నీది కాపుల జనసేన కాదు.. కమ్మల జనసేన. చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ పార్టీని నడిపితే నువ్వు వారి వెనుక ఉన్నావ్. బీజేపీతో కులుకుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడతావా, దాని గురించి పోరాటం చేస్తావా?. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని అయి తీరుతుంది. పవన్, చంద్రబాబు తాతలు దిగివచ్చినా విశాఖ రాజధాని అవుతుంది. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో. రాజకీయాల్లో ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అమరావతి రైతులకు ఏం జరిగినా మీదే బాధ్యత. రాక్షసులు ఎంత మంది కలిసివచ్చినా మా విజయం తథ్యం అని అన్నారు. అలాగే, ట్విట్టర్ వేదికగా మంత్రి అమర్నాథ్.. పవన్ కల్యాణ్‌కు కొత్త పేర్లు పెట్టారు. PK = పిచ్చి కుక్క PK = ప్యాకేజీ కల్యాణ్ PK = పెళ్ళిళ్ళ కల్యాణ్. PK = పిచ్చి కుక్క PK = ప్యాకేజీ కల్యాణ్ PK = పెళ్ళిళ్ళ కల్యాణ్ @PawanKalyan — Gudivada Amarnath (@gudivadaamar) October 18, 2022 -
కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌పై కోపం ఉంటే ఆయన్నే హరీష్‌రావు విమర్శించువచ్చు కదా అని చురకలు అంటించారు. టీఆర్ఎస్, కేసీఆర్, హరీష్‌రావును చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైఎస్ఆర్సీపీకీ లేదని స్పష్టం చేశారు. మమ్మల్ని తిడితే మీకు మార్కులు పడతాయా? అని ప్రశ్నించారు. ‘ఏపీ భవన్లో హరీష్‌రావు అధికారిని కాలితో తన్నిన ఘటన జనం మర్చిపోలేదు, హరీష్ రావు.. సీఎం కేసీఆర్ మనిషా లేక రామోజీరావు మనిషా తేల్చుకోవాలి. తెలంగాణను చూసి మేం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మమ్మల్ని విమర్శిస్తే కేసీఆర్‌ను తిడతామని హరీష్‌రావు అనుకుంటున్నారేమో. కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్. మహా వృక్షంగా వైఎస్ఆర్ నాటిన మొక్క.. రేపటి నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు మంత్రి అమర్నాథ్. జనవరి నుంచి ఇన్ఫోసిస్ పూర్తిస్థాయి సేవలు అమలులోకి వస్తాయన్నారు. దీని ద్వారా తొలి దశలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 2006లో వైఎస్ఆర్ వేసిన ఐటీ మొక్క నేడు మహా వృక్షంగా మారిందని గుర్తు చేశారు. దలపల్లా భూములపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్ సరికాదు: సజ్జల -
‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి.. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఇంతటి మహా విషాదాన్ని తమ పార్టీయే కాక రాష్ట్రమంతా భరించలేకపోతోందని... ఈ దశలో ఇంతకు దిగజారి తాగుబోతు మాటలు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకులను మరీ ఇంత నీచంగా మద్యం తాగించి మాట్లాడించటం బాధాకరమన్నారు. టీడీపీ దిగజారుడుతనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏం ఉంటుందని ప్రశ్నించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి ఏపీలో రూ.5 వేల కోట్లు పైచిలుకు ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా వచ్చారని, అసలైన ఎంవోయూలు ఎలా ఉంటాయో చూపిద్దామని తన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించారని, ఇలా సంతోషంగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించటం బాధాకరమన్నారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు... తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి
సాక్షి, విశాఖపట్నం: సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడికి ఇచ్చిన గడువు ముగియడంతో వెళ్లిపోయిన ఆయన ఆదివారం సాయిబాబా ఆలయం నుంచి వెళ్లిపోయారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆధారాలతో సత్య ప్రమాణానికి అమర్నాథ్ సిద్ధమయ్యారు. కానీ ఆలయానికి టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ రాలేదు. వెలగపూడి కోసం గంట పాటు అమర్నాథ్, పార్టీ నేతలు వేచి చూశారు. వెలగపూడి రాకపోవడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు వాస్తవం కాబట్టే వెలగపూడి మొహం చాటేశారని మండిపడ్డారు. సత్య ప్రమాణానికి గైర్హాజరైన వెలగపూడి తన తప్పులను ఒప్పుకున్నట్టే అన్నారు. రిషికొండలో వెలగపూడి రామకృష్ణ భూమి ఆక్రమించారని దుయ్యబట్టారు. ఇప్పటికే వెలగపూడి అక్రమాలపై సాక్ష్యాలు బయట పెట్టామని అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై టీడీపీ నాయకులకు సవాలు విసిరే అర్హత లేదని తాము సవాళ్లకు రావాలంటే చంద్రబాబు, లోకేష్ రావాలని అమర్నాథ్ అన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులు తమ భూములు వెనక్కి ఇస్తే మంచిదని, త్వరలో సిట్ నివేదికలో టీడీపీ బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ బిచ్చగాడని, ఇతరులకు ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఏంటనీ సూటిగా ప్రశ్నించారు. తన పేరిట అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తిస్తే స్టాంప్ పేపర్‌పై అనాధ శరణాలయానికి రాసిస్తానని అన్నారు. ఆచూకీ లేని ఎమ్మెల్యే వెలగపూడి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్‌కి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆచూకీ లేకుండా పోయారు. ఈస్ట్పాయింట్కాలనీలో గల ఈస్ట్ శిరిడీ సాయిబాబా ఆలయం వద్దకు శనివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, వెంకటరావు తదితరులు బాబా చిత్రపటంతో ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే త్రీటౌన్ సీఐ కోరాడరామారావు పర్యవేక్షణలో ఎస్ఐ జె.ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు గంటకు పైగా నిరీక్షించారు. ఈ సందర్భంగా విజయనిర్మల మీడియాతో మాట్లాడు తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోసం ఆలయం వద్ద ఎదురుచూసినా రాలేదన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆక్రమణలు తొలగించడం హర్షణీయమన్నారు. వెలగపూడి ముమ్మాటికీ వంగవీటి రంగా హత్యకేసులో నిందితుడేనని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి వెలగపూడికి లేదని పేర్కొన్నారు. అక్కరమాని ప్రతి సవాల్‌తో పోలీసుల హై అలర్ట్ వెలగపూడి రామకృష్ణబాబుకు వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసరడంపై ద్వారకా జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డిని వెలగపూడి విమర్శిస్తూ గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను భూ కబ్జాలు చేయలేదంటూ, దానికి నిదర్శనంగా ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ వెలగపూడి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను శుక్రవారం ఖండిస్తూ అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసిరారు. దీంతో శనివారం ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద, ఎంవీపీ సెక్టార్–4లోని వెలగపూడి కార్యాలయం వద్ద నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయి. బాబా ఆలయం వద్దకు వెలగపూడి రాకపోవడంతో ఎంవీపీ కాలనీలోని ఆయన కార్యాలయానికి వెళ్లేందుకు అక్కరమానితోపాటు పార్టీ నాయకులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎంవీపీ కాలనీలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి పర్యవేక్షణలో పోలీసులు సాయంత్రం వరకు వెలగపూడి కార్యాలయానికి, ఇల్లుకు భద్రత కల్పించారు. -
విద్య కన్నా భూ దాహమే ఎక్కువ
మద్దిలపాలెం (విశాఖ): విద్యా దానం కన్నా.. గీతం యూనివర్సిటీలో భూ దాహమే ఎక్కువని హైకోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం వాస్తం కాదా..అని, సొంత భూమి 30 ఎకరాలున్నా దాన్ని రియల్ ఎస్టేట్ కోసం దాచుకుని ప్రభుత్వ భూమి 40 ఎకరాలకు పైగా దోచుకోవాలని ‘గీతం’ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రభుత్వం అడ్డుకుందని, దీన్ని ప్రజలు హర్షిస్తూ స్వాగతిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గీతం వర్సిటీపై చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రేమ ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► తప్పులు చేసి కూడా సానుభూతి పొందాలనుకునే దిక్కుమాలిన ఆలోచన టీడీపీకి మాత్రమే వస్తుంది. ► ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గీతం యాజమాన్యం ఆక్రమించుకున్న రూ.800 కోట్లపై చిలుకు విలువైన 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై గీతం యాజమాన్యం కోర్టుకెళ్లగా.. కోర్టు తాత్కాలికంగా ఒక ఆర్డర్ ఇస్తే.. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. టీడీపీ, వారి అనుకూల మీడియా ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ► గీతం వేసిన రిట్ పిటిషన్లోనే అది ప్రభుత్వ భూమి అని ఉంది. ఇంతకన్న రుజువు ఇంకేం కావాలి? ► గీతం యాజమాన్యం 2020 ఆగస్ట్ 3న ఎండాడ గ్రామ పరిధిలో గల 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తమకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాసింది. దీని అర్థం ఆ భూమి వారిది కాదనేగా..! -
నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ సబ్బం హరి ఒక పొలిటికల్ బ్రోకర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ‘నీకు మేయిర్‌గా, ఎంపీగా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే మహానేత వైఎస్సార్.. అది మరిచిపోయి సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోం’.. అని ఆయన హెచ్చరించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్బం హరి మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే జగనన్న సైనికుడిలా వచ్చి నాలుక కోస్తానని హరిని హెచ్చరించారు. జీవీఎంసీకి సంబంధించిన సుమారు రూ.3 నుంచి 4 కోట్ల విలువైన 213 గజాల భూమిలో ‘సబ్బం’ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తే చంద్రబాబు గుండెలు బాదుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 213 గజాలే కదా.. దానికే కూల్చివేయాలా? అని కొందరు టీడీపీ నేతలంటున్నారని.. రెండు గజాలు కూడా ప్రభుత్వ భూములు కబ్జా కానివ్వబోమని అమర్నాథ్ అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు అండ్ కో ఎన్నో ఆరోపణలు చేశారని.. ఒక్కటీ రుజువు కాలేదన్నారు. -
పబ్లిసిటీ కోసం పనిచేసే ప్రభుత్వం కాదు
-
జూపార్క్‌ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం -మంత్రి
విశాఖపట్నం : విశాఖ ఇందిరా గాంధీ జూపార్క్ లో 65వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. రూ. 70 లక్షల నిధులతో అభివృద్ది చేయనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వీరు శంఖుస్థాపన చేశారు. మంగుళూరు నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త పులులను జూలో సందర్శకులు చూడడానికి అవకాశం కల్పించారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ జూ పార్క్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి విశాఖకు వచ్చే పర్యాటకులు జూ పార్క్‌ని సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు, రాబోయే రోజుల్లో సీఎంతో మాట్లాడి జూపార్క్‌ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో భాగంగా విశాఖలో కోటి మొక్కలు నాటే ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే విశాఖ జూ కి ఓ ప్రత్యేకత ఉంది. 625 ఎకరాలలో సహజ సిద్దంగా ఏర్పడిన జూ ఇది. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖ జూని తరలించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మన ప్రభుత్వంలో విశాఖ జూని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎఫ్ రాహుల్‌పాండే, ఇంచార్జి కలెక్టర్ శివశంకర్, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, కేకే రాజు, జూ క్యూరేటర్ యశోద బాయి తదితరులు పాల్గొన్నారు. -
సుజనాపై పవన్ ఎందుకు స్పందించరు?
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎంపీ సుజనా చౌదరి దోపిడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించట్లేదని వైస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వేల కోట్లు రూపాయలను అక్రమంగా దోచుకున్న సుజనాపై పవన్ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో నాలుగు కోట్లు విలువచేసే భూమిని కేవలం 20 లక్షలకే మీకు కట్టబెట్టినందుకు మాట్లాడంలేదా? అని విమర్శించారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలను ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శించడం సరికాదన్నారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాలపై పోరాడుతానని గొప్పలు చెప్పుకునే పవన్ కల్యాణ్.. తమ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తే ఎక్కడపోయారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. -
'జేసీబీలు తగలబెడతానంటే జనం నమ్మరు'
సాక్షి, విశాఖపట్నం : దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్తుల కోసం పొట్లాడుకుంటున్నారని వైస్సార్సీపీ ఆనకాపల్లి సమన్వయ కర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలం ప్రత్యుషా కంపెనీకి కేటాయించినప్పుడు అయ్యన్న ఏం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జేసీబీలు తగల బెడతానంటే జనం నమ్ముతారా అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నర్సీపట్నం ప్రజల దృష్జి మరల్చేందుకే అయ్యన్న డ్రామాలు చేస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు. -
హోదాపై టీడీపీ దొంగ దీక్షలు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న దొంగ దీక్షల తీరు తేటతెల్లమైందని, ఇక వారిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు కిలోల బరువు తగ్గడానికి దీక్షలు చేస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అంటే, హోదానా గీదానంటూ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించి వారి దొంగ దీక్షల గుట్టును విప్పారన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సాధించేందుకు తాము చిత్తశుద్ధితో దీక్షలు చేస్తున్నామంటూ ప్రగడ్భాలు పలుకుతున్న తీరును ప్రజ లు నిశితంగా గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్ల పా టు కేంద్రంతో మిత్రపక్షంగా మెలిగి, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నంత కాలం నోరెత్తకుండా పబ్బం గడిపారని ఆరోపించారు. కొత్త డ్రామాలకు సీఎం తెర.. రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కొత్త డ్రామాలకు చంద్రబాబు తెరలేపారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. రైల్వే జోన్ కోసం దీక్షల పేరిట భారీ సెట్టింగ్‌లతో వేదికలు వేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలకు ఢిల్లీ వీధుల్లో తిరిగే ధైర్యం లేక విశాఖ గల్లీలో తూతూ మంత్రపు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి ఢిల్లీలో దీక్షలు చేసే సత్తా లేకే విశాఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం ముందు సినీ సెట్టింగ్‌లను తలదన్నే రీతిలో సెట్ వేసి బూటకపు దీక్షలు చేసి ప్రయాణికులకు, ప్రజలకు అసౌకర్యం తలపెడుతున్నారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌వి అవగాహన రహిత వ్యాఖ్యలు.. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేకుండా వైఎస్సార్సీపీపై అవాకులు చెవాకులు విసురుతున్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు. టీడీపీ గెలుపునకు బాటలు వేసి, కేంద్రానికి మద్దతిచ్చి నాలుగేళ్లగా వారి సహవాసం చేసినప్పుడు చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చోడవరం సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంటే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. అధికార పార్టీ అడుగులు మడుగులొత్తి పవన్ ఎన్నికల్లో తన హవాను మళ్లీ చాటుకునేందుకు టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆ మేరకే వైఎస్సార్సీపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్న విషయం ఇప్పటికే పవన్‌కల్యాణ్‌కు స్పష్టమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించి అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలో టీడీపీని దానికి మద్దతిస్తున్న పార్టీలను రాష్ట్రం నుంచి జనం తరమి కొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి సమన్వయకర్త వరుధు కల్యాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్, షరీఫ్, బర్కత్ ఆలీ, రామన్నపాత్రుడు, శ్రీనివాస్ గౌడ్, కాంతారావు, తడ్డబారికి సురేష్, బాబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోసాల్లో బాబు, లోకేశ్ నంబర్ వన్
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌బాబు మోసాల్లో నంబర్ వన్ అని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. లక్ష ఇళ్లు ఇస్తున్నామని చంద్రబాబు, లక్ష ఉద్యోగాలు ఇస్తున్నామని లోకేశ్ ఇద్దరూ రాష్ట్ర ప్రజల్నిమోసం చేస్తుంటే కొందరు మంత్రులు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ఇక్కడి పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చుట్టం చూపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చి హోటళ్లలో సభలు, సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం ఆనవాయితీగా మారిందన్నారు. హుద్‌హుద్ తుపాను వచ్చి మూడేళ్లయినా నిరాశ్రయులకు ఎటువంటి సాయం చేయకపోగా వారిని మళ్లీ మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరిస్తే హుద్‌హుద్‌లో లక్షా 50 వేల మంది నిరాశ్రయులైనట్టు తేలిందన్నారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను టీడీపీ దెబ్బతీస్తోందని విమర్శించారు. విశాఖలో భూదందాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ వల్ల ఇటు భూములు కోల్పోయిన బాధితులకు గాని, ప్రభుత్వానికి గాని ఎటువంటి ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు విశాఖను వాడుకున్నారే తప్ప ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మెడ్‌టెక్ భూముల కుంభకోణంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆరున్నరేళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన పసుపులేటి ఉషాకిరణ్‌ను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ గరికిన గౌరిని పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా నియమించామన్నారు. ఈ సందర్భంగా గరికిన గౌరి మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందనడానికి తనను మహిళ విభాగం నగర అధ్యక్షురాలిగా నియమించడమే ఉదాహరణ అని చెప్పారు. చంద్రబాబు అరాచకాలపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తలు పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కొండా రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
అలుపెరుగని పయనం
⇒ఐదోరోజు దిగ్విజయంగా సాగిన ఆత్మగౌరవయాత్ర ⇒అన్ని ప్రాంతాల్లోనూ తరగని ప్రజాదరణ ⇒రైల్వేజోన్ ఇవ్వాల్సిందేనని నినాదాల హోరు రోజులు గడుస్తున్నాయి.. ప్రాంతాలు మారుతున్నాయి.. కానీ లక్ష్యం మారలేదు.. పట్టుదల అసలే సడలలేదు.. ఆత్మగౌరవయాత్రకు లభిస్తున్న జనస్పందననే జోష్‌గా మార్చుకొని.. ద్విగుణీకృతోత్సాహంతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.. పాదయాత్రికుడు అమర్‌కు వెన్నుదన్నుగా.. సంఘీభావంగా పార్టీ నాయకులు, శ్రేణులు నిలుస్తున్నారు.. ఆయన అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతుంటే ఆత్మగౌరవయాత్ర సాగిన మార్గం పొడవునా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు జయజయధ్వనాలతో రైల్వేజోన్ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. మద్దతు ప్రకటిస్తున్నారు. వారి నినాదాల హోరు మధ్య ఐదోరోజు ఆత్మగౌరవ యాత్ర షీలానగర్ నుంచి సింహాచలం గోశాల వరకు దిగ్విజయంగా సాగింది. విశాఖపట్నం : రైల్వే జోన్ సాధనకై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర నిర్విఘ్నంగా సాగుతోంది. అడుగడుగునా అమర్‌కు జనం హారతులు పడుతున్నారు. ఐదో రోజైన సోమవారం ఉదయం గవర జగ్గయ్యపాలెంలో నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు పలువురు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి అమర్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లా నుంచి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్నారు. సత్తమ్మతల్లి జంక్షన్, సత్తివానిపాలెం, కోట నరవ, నరవ వరకు పాదయాత్ర చేసి భోజన విరామం తీసుకున్నారు. తిరిగి సాయంత్రం కొత్తపాలెం జంక్షన్, కొత్తపాలెం బ్రిడ్జి, గోపాలపట్నం మెయిన్ రోడ్డు, శ్రీరాంనగర్ మీదుగా ఆర్.ఆర్.వి.పురం జంక్షన్, నాయుడు తోట నుంచి వేపగుంట వరకూ పాదయాత్ర చేపట్టి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు ఆయన రాకకోసం అప్పటికే అక్కడ ఎదురు చూశారు. వారినుద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ఆర్ఆర్వి పురంలో పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి చల్లాయమ్మ ఎదురువచ్చి అమర్‌కు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. వేపగుంట నుంచి ముందుకు కదిలిన అమర్ గోశాల, గవర్నమెంట్ హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. సమీపంలోని స్వామి కల్యాణమండపంలో అమర్నాథ్ రాత్రి బస చేశారు. పాదయాత్రలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు అదీప్‌రాజు, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ,, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, రొంగలి జగన్నాథం, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ బయ్యవరపు రాధ, కార్యదర్శి పొట్నూరు విజయకుమార్, రూరల్ జిల్లా ప్రచార కార్యదర్శి పోతల ప్రసాద్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారావు, భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, నగర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శ్రీదేవివర్మ, నగర మహిళా కార్యదర్శి యువశ్రీ, నగర మహిళా అధికార ప్రతినిధి మళ్ల ధనలత పాల్గొన్నారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉందా? వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొన్న చంద్రబాబుకు నీతి నిజాయితీ ఉందా అని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం అమర్నా«థ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్రకు ఉత్తరాంధ్ర మొత్తం మద్దతు పలుకుతోందన్నారు. విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉన్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాలాగే రైల్వే జోన్‌ను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు.. అమలుకాని హామీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. అడ్డదారిలో వెళితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడో ముఖ్యమంత్రి ఆయ్యేవారన్నారు. అలాంటి వంచనలు, అడ్డదారులు చంద్రబాబుకు మాత్రమే తెలుసునన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అడ్డదారిలో తమ పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబును జనం ఛీదరించుకుంటున్నారన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్న జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. -
దీక్షకు మద్దతు ఇవ్వండి
► వివిధ పార్టీ నేతలను కలిసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ► గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం : విశాఖకు ప్రత్యేక జోన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్ 14 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. మంగళవారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారిలను కలిశారు. అలాగే సీపీఎం నగర, జిల్లా కార్యదర్శులు గంగారావ్, లోకనాథంలను ఆ పార్టీ నగర కార్యాలయంలోనూ కలిశారు. ఈ సందర్భంగా తాను చేపట్టబోయే దీక్షకు మద్దతు పలకాలని, తద్వారా జోన్ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీలు ఉన్నారు.