Gudivada Amarnath Shocking Comments On Pawan Kalyan, Details Inside - Sakshi
Sakshi News home page

‘విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌ను కొట్టారా లేక.. ఆయన పరామర్శ ఏంటి?’

Published Tue, Oct 18 2022 6:31 PM | Last Updated on Tue, Oct 18 2022 7:07 PM

Gudivada Amarnath Shocking Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని అయితీరుతుంది. ఎంతమంది చంద్రబాబులు, పవన్‌ కల్యాణ్‌లు వచ్చినా అడ్డుకోలేరు. మీ యుద్ధానికి మేము కూడా సిద్ధమని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎంత బాగా అబద్ధాలు చెబుతున్నారు. ముందు నుంచి వైఎస్సార్‌సీపీ చెప్పినట్టుగానే.. ప్రజలు ఊహించినట్టుగానే అక్రమ సంబంధానికి పుల్‌స్టాప్‌ పడింది. కొత్త బంధానికి తెరలేచింది. ఎట్టకేలకు ముసుగు తీసి బయటకు వచ్చారు. కలిసి వెళ్లాలనుకుంటే వెళ్లండి.. ప్రజలను ఎందుకు మోసం చేస్తారు.

విశాఖలో జరిగిందేంటి.. ఈయన వచ్చి పరామర్శించడం ఏంటి?. విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌కు కొట్టారా లేక పవన్‌ కల్యాణ్‌ మనుషులు మంత్రులను కొట్టారా?. మంత్రులపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే.. కొట్టిన వారిని చంద్రబాబు పరామర్శిస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున మాట్లాడి ప్రజాస్వామ్యం లేదంటారా.. అందరూ ఏకం కావాలా.. అ‍వ్వండి. మీ వ్యవహారాలను ప్రజలు గమినిస్తున్నారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతావా?. నువ్వు చంద్రబాబుకు అమ్ముడుపోయావని రుజువు చేశాము. నీకు కాపు కులం గురించి మాట్లాడే అర్హత ఉందా?. రాష్ట్రంలో ఎవరికీ చెప్పులు లేవా.. నీకే ఉన్నాయా?. చెప్పుతో ఈ డ్రామా అంతా విశాఖ రాజధాని డిమాండ్‌ను డీవియేట్‌ చేసేందుకే. రంగా గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా?. రంగా మరణానికి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడతావా?. ముద్రగడను పోలీసులు హింసించినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు. 

నీకు ఇప్పుడు కాపులు గుర్తుకు వచ్చారా?. నీది కాపుల జనసేన కాదు.. కమ్మల జనసేన. చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌ పార్టీని నడిపితే నువ్వు వారి వెనుక ఉన్నావ్‌. బీజేపీతో కులుకుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ గురించి మాట్లాడతావా, దాని గురించి పోరాటం చేస్తావా?. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని అయి తీరుతుంది. పవన్‌, చంద్రబాబు తాతలు దిగివచ్చినా విశాఖ రాజధాని అవుతుంది. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో. రాజకీయాల్లో ఆయన విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. అమరావతి రైతులకు ఏం జరిగినా మీదే బాధ్యత. రాక్షసులు ఎంత మంది కలిసివచ్చినా మా విజయం తథ్యం అని అన్నారు. 

అలాగే, ట్విట్టర్‌ వేదికగా మంత్రి అమర్నాథ్‌.. పవన్‌ కల్యాణ్‌కు కొత్త పేర్లు పెట్టారు. 
PK = పిచ్చి కుక్క
PK = ప్యాకేజీ కల్యాణ్
PK = పెళ్ళిళ్ళ కల్యాణ్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement