సాక్షి, తాడేపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ అమర్నాథ్ కామెంట్స్ చేశారు.
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు కామెంట్స్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా అమర్నాథ్..‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరు గార్చేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడి, కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ విషయంలోనూ అంతే. బాబు వచ్చాడు.. అందర్నీ ముంచుతున్నాడు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరుగార్చేలా @ncbn గారు మాట్లాడ్డం వెనుక పెద్ద కుట్ర ఉంది.
స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబుగారు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి.
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబుగారు ఇలాగే మాట్లాడి,… pic.twitter.com/Zq0ctJ9xDR— Gudivada Amarnath (@gudivadaamar) September 18, 2024
ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’
Comments
Please login to add a commentAdd a comment