
సాక్షి, విశాఖపట్నం : దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్తుల కోసం పొట్లాడుకుంటున్నారని వైస్సార్సీపీ ఆనకాపల్లి సమన్వయ కర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలం ప్రత్యుషా కంపెనీకి కేటాయించినప్పుడు అయ్యన్న ఏం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జేసీబీలు తగల బెడతానంటే జనం నమ్ముతారా అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నర్సీపట్నం ప్రజల దృష్జి మరల్చేందుకే అయ్యన్న డ్రామాలు చేస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు.