'ఆవగింజంత అవకాశం కూడా వదలకుండా పోరాడాం' | Sabbam Hari takes on congress and bjp | Sakshi
Sakshi News home page

'ఆవగింజంత అవకాశం కూడా వదలకుండా పోరాడాం'

Published Sat, Mar 15 2014 9:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'ఆవగింజంత అవకాశం  కూడా వదలకుండా పోరాడాం' - Sakshi

'ఆవగింజంత అవకాశం కూడా వదలకుండా పోరాడాం'

ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్లో బీజేపీ అనుసరించిన వైఖరిపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఉదయంఆయన విశాఖపట్నంలో విలేకర్లతో మాట్లాడుతూ... బిల్లు ఆమోదంలో లోక్సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోలా వ్యవహారించిందని ఆయన బీజేపీ తీరును ఎండగట్టారు. విభజన బిల్లు కాంగ్రెస్ - బీజేపీ చీకటి ఒప్పందంలో భాగమేనని ఆయన ఆరోపించారు.

భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తుది వరకు పోరాటం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలుకు తెలుసన్నారు. అలాంటివారినే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారన్నారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచే క్రమంలో ఆవగింజ అంత అవకాశం కూడా వదులు కోకుండా పోరాడామని సబ్బం హరి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement