జీహెచ్ఎంసీని విభజించాలి: మర్రి శశిధర్రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో మర్రి శశిధర్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నగరంలో పెరుగుతున్న జనాభా, వారి అవసరాల దృష్ట్యా... దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ ఎంసీని విభజించాలని తెలిపారు. జనాభా దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీ కార్పొరేషన్ కూడా మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయాన్ని మర్రి శశిధర్రెడ్డి గుర్తు చేశారు. జాప్యమైన సర్వే డివిజన్ల పునర్ విభజన ప్రక్రియ శాస్త్రీయంగా చేపట్టాలని ప్రభుత్వానికి మర్రి శశిధర్ రెడ్డి సూచించారు.
జీహెచ్ ఎంసీ పాలక వర్గం పదవి కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. త్వరలో జీహెచ్ ఎంసీకి ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ను విభజించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనిపై ఇంకా ప్రభుత్వానికి స్పష్టత రాలేదు. అయితే కార్పొరేషన్ విభజించాలని పలు రాజకీయ పక్షాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.