సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పాలిటిక్స్ జెట్ స్పీడ్‌లో మారిపోయితున్నాయి. ఈరోజు ఓ పార్టీ జెండా కప్పుకున్న పొలిటికల్ లీడర్ మరుసటి రోజు ఏ జెండా ఎత్తుకుంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో టీకాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
కాగా, ఇటీవలే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన కుమారుడు పురురవరెడ్డి సైతం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి పురురౌరెడ్డి రాజీనామా చేశారు. అయితే, పురురవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, పురురవరెడ్డి.. సనత్‌నగర్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ వీడుతున్న సమయంలో పరురవరెడ్డి.. టీపీసీసీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష విధానాల వల్లే తాను పార్టీ వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment