sanath nagar
-
Hyderabad: సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి రెసిడెన్సీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరు విద్యుత్ షాక్‌గురై మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. వీరంతా బాత్రూమ్లో విగత జీవులై పడి ఉండటాన్ని గుర్తించారు. -
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే తలసాని
సనత్‌నగర్ (హైదరాబాద్): తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద ఆదివారం నిర్వహించిన సనత్‌నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సోదరుడు శంకర్‌యాదవ్ మరణం విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదన్నారు. శంకర్‌యాదవ్‌తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉందని, ఆ కారణంగానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు. -
Sanath Nagar: మంత్రి తలసానికి హ్యాట్రిక్ రికార్డు దక్కేనా?
హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థీ ఇంతవరకు హ్యాట్రిక్ రికార్డును కైవసం చేసుకున్న చరిత్ర లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వరుసగా ఆ విజయాలను నమోదు చేసుకున్న పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. 1978లో సనత్‌నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1992, 1994లో వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి మర్రి శశిధర్‌రెడ్డి గెలుపొందగా 1999 ఎన్నికల్లో శ్రీపతిరాజేశ్వర్ గెలుపొందడంతో శశిధర్‌రెడ్డికి హ్యాట్రిక్ దూరమైంది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో సైతం మర్రి శశిధర్‌రెడ్డి రెండుసార్లు వరుస విజయాలను నమోదు చేసుకోగా 2014లో ఆయన పరాజయం పాలవడంతో మరోసారి హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ఇక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గెలుపొంది మరోసారి బీఆర్ఎస్ అభ్యర్ధిగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
వీడిన సనత్ నగర్ బాలుడి హత్య కేసు మిస్టరీ.. అదే కారణం!
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్లో ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు బాలుడి హత్యకు నరబలికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. వహీద్ హత్యకు ఆర్ధిక వివాదాలే కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. వహీద్‌ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసినట్లు డీసీసీ చెప్పారు. బాలుడి తండ్రి, ఇమ్రాన్ మధ్య చిట్టి విషయంలో గొడవలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బాలుడిని ఆమె ఎత్తుకెళ్లి చంపేసినట్లు తెలిపారు. మహీద్‌ను హత్య చేసి మృతదేహాన్ని బకెట్లో కుక్కినట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ సాయంతో మృతదేహన్ని గోనెసంచిలో మూటకట్టి నాలాలో పడేశారని చెప్పారు. బాలుడి కిడ్నాప్‌కు నలుగురు వ్యక్తులు సహకరించారని.. ఈ హత్యకేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా హత్యపై వివరాలు సేకరించామని.. వహీద్ హత్యపై విస్తృత దర్యాప్తు జరుగుతోందన్నారు. చదవండి: Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
హైదరాబాద్‌లో దారుణం.. అమావాస్య రోజున బాలుడిని బలిచ్చిన హిజ్రా?
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లో దారుణం వెలుగుచూసింది. అల్లావుద్దీన్ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్ వహీద్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే అమావాస్య రోజున బాలుడిని ఓ హిజ్రా నరబలి ఇచ్చిన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం నమాజ్ చేయడానికి వెళ్లి తప్పిపోయాడు. అయితే రాత్రి అవుతున్న బాలుడి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అనంతరం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు బకెట్లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. కాగా వహీద్ ఇంటి పక్కనే ఉంటున్న ఇమ్రాన్ అనే మహిళ(హిజ్రా).. బాలుడిని మజీద్ నుంచి నేరుగా తనతో తీసుకెళ్లిన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడిని చంపి ఓ బస్తాలో వేసుకొని ఆటోలో తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతో స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (చదవండి: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు) విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరబలి ఇచ్చిన్నట్లుగా అనుమానిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మంత్రి తలసాని విచారం.. సనత్ నగర్ బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ హత్యకు గురువ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. (Hyderabad: బాత్రూమ్లో జారిపడి గర్భిణి మృతి ) -
Hyderabad:హోటల్ ఫుడ్ తిని 16 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మాషా అల్లా హోటల్లో ఆహారం తిని 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కోలుకోగా మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌లోని మాషా అల్లా హోటల్లో బుధవారం రాత్రి 16 మంది మటన్ మండీ తిన్నారు. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు. వివరాలు సేకరిస్తున్న ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీవెంకాలు దీంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శ్రీవెంకాలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను సీజ్ చేశారు. -
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీజేపీలోకి మర్రి కుమారుడు!.. అక్కడి నుంచి పోటీ?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పాలిటిక్స్ జెట్ స్పీడ్‌లో మారిపోయితున్నాయి. ఈరోజు ఓ పార్టీ జెండా కప్పుకున్న పొలిటికల్ లీడర్ మరుసటి రోజు ఏ జెండా ఎత్తుకుంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో టీకాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాగా, ఇటీవలే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన కుమారుడు పురురవరెడ్డి సైతం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి పురురౌరెడ్డి రాజీనామా చేశారు. అయితే, పురురవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, పురురవరెడ్డి.. సనత్‌నగర్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ వీడుతున్న సమయంలో పరురవరెడ్డి.. టీపీసీసీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష విధానాల వల్లే తాను పార్టీ వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు. -
మరో 40 ఏళ్లు తాగునీటికి కొదవ లేదు
సనత్‌నగర్: రాబోయే 40 ఏళ్లు హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఎలాంటి కొదవ ఉండదని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఇన్ఫ్రా సమ్మిట్–2022’ సదస్సు శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ‘ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాల్టీ–ప్రాస్పెక్టస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన దానకిషోర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులలో పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారానే జరుగుతున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే రియాల్టీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆక్స్ఫర్డ్ నగరాల నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భారతదేశంలో 17 నగరాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్ 85 బిలియన్ల జీడీపీని అధిగమించగలదన్నారు. సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, నీటి ప్రాజెక్టులు, మెట్రోరైల్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలపరంగా తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. సమారు 30 ఏళ్లుగా 80 శాతం ప్రయాణికులు రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారని, అయితే ఇప్పుడు రోడ్డు నెట్వర్క్, మారుతున్న మౌలిక సదుపాయాల రంగం కారణంగా 70 శాతం మంది రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీఐఐ చైర్మన్ వాగీష్దీక్షిత్, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, షేక్ సమీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య
సనత్‌నగర్: తమ్ముడి భార్య కుటుంబసభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బబ్బుగూడకు చెందిన శీలం వీరస్వామి, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరస్వామి రెండో కుమారుడు హరినాథ్‌కు 2020లో తాండూరుకు చెందిన భాగ్యలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మీ ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు తనను వేధిస్తున్నారని భర్త హరినాథ్‌తో పాటు అతడి సోదరుడు ప్రసాద్, ఇతర కుటుంబసభ్యులపై తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భాగ్యలక్ష్మీకి రూ.12 లక్షలు ఇచ్చి రాజీ చేసుకోవాలని ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం పలు దఫాలుగా డబ్బు చెల్లించాల్సి ఉంది. గత నెల రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా సర్దుబాటు కాకపోవడంతో చెల్లించలేదు. దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు హనుమంతు తరచూ ప్రసాద్‌కు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. అతడితో పాటు పోలీసులు కూడా ఫోన్ చేస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రసాద్ గురువారం ఉదయం తమ్ముడి భార్య కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తండ్రిని హతమార్చిన కూతురు) -
అరేయ్ ఏంట్రా ఇది! బట్టలిప్పి మరీ నగ్నంగా చోరీ
సాక్షి, హైదరాబాద్: దొంగతనంలోనూ తనకో స్టయిల్ ఉందని నిరూపించుకున్నాడు ఓ చోరుడు. నగరంలోని సనత్ నగర్లో తాజాగా ఓ విచిత్రమైన చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న దుకాణంలోకి దూరిన ఓ దొంగ.. బట్టలు విప్పేసి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి. సనత్ నగర్లో బస్టాండ్ ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న ఓ మెడికల్ స్టార్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్న క్రమంలో.. ఆ ఆగంతకుడు దుస్తులు విప్పి లోపలికి ప్రవేశించాడు. సుమారు రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. అటు ఇటు కలియతిరిగి.. డ్రాలో ఉన్న డబ్బును బయటకు తీశాడు. తిరిగి బయటకు వచ్చే క్రమంలో దుస్తులు వేసుకుని దర్జా నడుకుంటూ వెళ్లిపోయాడు. ఉదయం మెడికల్ షాప్ తెరిచేందుకు వచ్చిన నిర్వాహకుడు.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అరేయ్ ఏంట్రా ఇది! బట్టలిప్పి మరీ నగ్నంగా చోరీ
-
ఏడేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా..
సాక్షి,సనత్‌నగర్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దత్తు కుమార్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి ఫతేనగర్ జింకలవాడలో ఉంటున్నారు. దత్తుకుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దత్తుకుమార్ భార్య పూజ దుస్తులు ఉతుకుతుండగా, కుమారుడు ఏసురాజ్ (7) భవనం రెండో అంతస్తులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి బాలుడు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సనత్‌నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వీళ్లు మహా కి‘లేడీ’లు.. 950 మందిని బుట్టలో వేసుకున్నారు
సాక్షి, సనత్‌నగర్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ మహిళను సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెతో పాటు ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించిన మరో మహిళను ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్– 3లో నివాసం ఉండే మహిళా సంత సొసైటీకి చెందిన సోషల్ వర్కర్ సుప్రియ, అల్లాకే బందే ఫౌండేషన్ అధ్యక్షురాలు అయేషా తబస్సుంలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని కూడా అందినకాడికి దండుకున్నారు. వీరి వలలో పడి డబ్బులు కట్టినవారిలో సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లాపూర్‌నకు చెందిన పలువురు మహిళలు ఉన్నారు. మూడు నెలలైనా ఇళ్ల విషయం తేలకపోవడంతో సుప్రియపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేసి తన భర్త రాఘవను ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసి నమ్మించింది. ఇంకొన్నిసార్లు ఇళ్లు వచ్చేశాయంటూ తాళం చెవులు, విద్యుత్ మీటర్ నంబర్లను చూపించి నమ్మించి వారి నుంచి మరిన్ని డబ్బులు వసూలు చేస్తుండేది. ఇదే రకం వ్యవహరంలోనే అయేషా తబస్సును ఇటీవల జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితులు.. సుప్రియ కూడా తమను మోసం చేసిందని గ్రహించి సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. వీరి వలలో చిక్కుకుని డబ్బులు చెల్లించిన నలుగురు బాధిత మహిళలు ముందుకువచ్చారు. మొత్తం 950 మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఏ1 గా అయేషా తబస్సుం, ఏ2 గా సుప్రియలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తపై కోపంతో పిల్లలకు వాతలు
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): భర్తపై ఉన్న కోపాన్ని అభంశుభం తెలియని కన్నపిల్లలపై ప్రదర్శించింది ఓ తల్లి. కట్టెతో కొట్టి, కర్రుకాల్చి వాతలు పెట్టింది. బాధను భరించలేక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరించలేదు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండ రా మారావునగర్కు చెందిన రాజు, పావని భార్యభర్తలు. వీరికి జ్ఞానేశ్వర్(5), మహాలక్ష్మీ(4) సంతానం. ఈ నెల 23వ తేదీన భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్త మీద కోపంతో ఉన్న పావని విచక్షణ కోల్పోయి తన ఇద్దరు పిల్లలను కట్టెతో తీవ్రంగా కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా పొయ్యిలో కాల్చిన గిన్నెతో చిన్నారుల తొడలు, అరికాళ్లపై వాతలు పెట్టింది. స్థానికులు అడ్డుకోగా ‘మా కుటుంబ విషయాలు మీకెందుకు’అంటూ విరుచుకుపడింది. అటుగా వెళ్తున్న అంగన్వాడీ టీచర్ గమనించి మేడ్చల్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని లీగల్ సెల్ అధికారిణి సుజాత దృష్టికి తీసుకువెళ్లింది. ఆమె సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు చిన్నారులను తీవ్రంగా హింసించిన తల్లి పావనిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చదవండి: (చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య) -
దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం సనత్‌నగర్ స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ప్రతి బుధవారం సాయంత్రం సనత్‌నగర్ స్టేషన్లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సరుకు రవాణా రేక్ మొత్తాన్ని బుక్ చేసుకునే విధానానికి భిన్నంగా కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్ చేసుకునే సదుపాయం రైల్వే కల్పించింది. ఎంత సరుకు లోడ్ అయిందన్న విషయంతో ప్రమేయం లేకుండా నిర్ధారిత సమయాల ఆధారంగా రైలు నడుస్తుంది. ఇంతకాలం చిన్న వ్యాపారులు ఢిల్లీకి సరుకు పంపాలం టే రోడ్డు మార్గాన పంపాల్సి వచ్చేది. ఇప్పుడు రైలు అందుబాటులోకి రావటంతో ఖర్చులో 40 శాతం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు. -
ఫతేనగర్ ఫ్లైఓవర్‌కు ప్రత్యామ్నాయంగా..
-
సెప్టెంబర్ కల్లా బాలానగర్ ఫ్లైఓవర్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: అండర్ బ్రిడ్జ్‌తో ఫేతే నగర్ బ్రిడ్జ్‌పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కేటీఆర్ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్ వరకు బాలా నగర్ ప్లై ఓవర్ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తాం’ అని తెలిపారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారయణ రెడ్డి 89 వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లో సి.నా.రె సారస్వత సదనం ఆడిటోరియమ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నారాయణ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. Laid foundation for the construction of Dr. C. Naa. Re Saraswatha Sadanam Auditorium at Banjara Hills along with Hon’ble MA & UD Minister Sri @KTRTRS Garu, MLA Danam Nagender Garu & Others. pic.twitter.com/Gc9kIdapIX — V Srinivas Goud (@VSrinivasGoud) July 29, 2020 ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ‘సనత్ నగర్ ఏరియాలో వాటర్ రిజర్వాయర్, ఇండోర్ స్టేడియం, మహాప్రస్థానం ఇక ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను కేటీఆర్ మంజూరు చేశారు. గతంలో ఉన్న ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణకు సహకరించారు. 30ఏళ్లలో ఇంత డైనమిక్ నేతను చూడలేదు. నగరంలో అనేక పనుల అభివృద్ధిలో కేటీఆర్ కృషి ఉంది’ అని కొనియాడారు. చదవండి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు -
సనత్‌నగర్‌లో దంపతుల వీరంగం
-
సనత్‌నగర్‌లో దంపతుల వీరంగం
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లో దంపతులు వీరంగం సృష్టించారు. ఓ పాఠశాల విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టారు. రోడ్డుపై గోల చేస్తున్నాడంటూ అతడిని చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక సదరు చిన్నారి.. వారి కాళ్లపై పడ్డా కనికరించకుండా.. కర్కశంగా వ్యవహరించారు. లేబర్గాళ్లంటూ అతడిని దూషిస్తూ.. దాడికి దిగారు. అనంతరం వారే పోలీసుస్టేషనుకు వెళ్లి విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థిని కొట్టిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. -
పాతాళ గరళం
సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్/జీడిమెట్ల/సనత్‌నగర్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పాతాళగంగ భయంకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పారిశ్రామికవాడల్లోని భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) తాజా నివేదిక నిగ్గుదేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలను నాలాలు, చెరువులు, కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా వదిలిపెడుతుండటం.. అవి భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనం తేల్చింది. ఈ నీళ్లు పశుపక్ష్యాదుల దాహార్తిని సైతం తీర్చలేవని, మొక్కలకు పట్టడానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రం చేయడానికి, స్నానానికి పనికిరావని స్పష్టం చేసింది. చుక్క నీరూ స్వచ్ఛం లేదు.. గతేడాది వర్షాకాలానికి ముందు (మే–2019), ఆ తరువాత (జనవరి–2020) సుమారు 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి.. పరీ క్షించగా వచ్చిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు నీటి నమూనాల్లో ఆర్సెనిక్, లెడ్ జింక్ తదితర భారలోహాల ఆనవాళ్లున్నట్టు పరీక్షల్లో తేలింది. ఎన్జీఆర్ఐ నివేదిక నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’బృందం ఆయా ప్రాంతాల్లోని భూగర్భజలాల నాణ్యత, ఆ నీటితో స్థానికులు పడుతున్న అవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సాక్షి విజిట్.. గతేడాది కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో బోర్లు వేయగా రసాయన జలాలతో కలుషిత నీళ్లు పడ్డాయి. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో వందలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 10 మీటర్లకు ఒక బోరు ఉంది. ప్రస్తుతం బోరు వేయాలంటే వెయ్యి నుంచి 1,600 అడుగుల లోతుకు వెళ్తేనే నీటి జాడ తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌లో రెండు మూడు బోర్లు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మోటారు వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లొస్తున్నాయి. కొన్నిచోట్ల నీరు రంగు లేకున్నా.. వాసన ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఈ నీటితో గిన్నెలు, వాహనాలు కడిగితే వాటిపై మరకలు, తుప్పు వస్తున్నాయి. జీడిమెట్ల: నీళ్లు తాగాలంటే హడలే జీడిమెట్లలో వందకుపైగా ఫార్మా, బల్క్‌డ్రగ్ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వ్యర్థ రసాయన జలాలను 1983 నుంచి ఇప్పటివరకు ఖాళీ ప్రదేశాల్లో, ఓపెన్ నాలాల్లో గుట్టుచప్పుడు కాకుండా డంప్ చేస్తున్నారు. ఫలితంగా ఈ పారిశ్రామికవాడలోని భూగర్బ జలాలు విషతుల్యమయ్యాయి. బోర్లు తవ్వగా వచ్చిన నీరు దాదాపు రసాయనాలను పోలి ఉంటుంది. బోరు మోటార్ వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లు ఎగదన్నుతాయి. దీంతో రోజూ ఇక్కడి ఒక్కో కుటుంబం.. కుటుంబసభ్యుల అవసరాలకు తగినట్టు నీటిని కొనాల్సిందే. 20 లీటర్ల డబ్బాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెడుతున్నారు. దీంతో ప్రతి నెలా ఒక్కో కుటుంబం పాల బిల్లుతో సమానంగా నీటి బిల్లు చెల్లిస్తోంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ రసాయనాలను అర్ధరాత్రి దాటాక నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో, పరిశ్రమ లోపల పాడుబడిన బోరు బావుల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. జీడిమెట్లలో బోరు నుంచి వస్తున్న రసాయన జలం 30 ఏళ్లుగా విషాన్ని చూస్తున్నా.. 30 ఏళ్లుగా నేనిదే ప్రాంతంలో ఉంటున్నాను. రోజురోజుకూ భూగర్భ జలాలు విషపూరితమైపోతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రసాయనాలను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భావితరాలకు మంచినీరు దొరకడం కష్టమే. – శ్రీనివాస్, ఎస్ఆర్ నాయక్‌నగర్ సనత్‌నగర్: కలుషితంతో సతమతం దేశంలో తొలి పారిశ్రామికవాడగా పేరొందిన సనత్‌నగర్ పారిశ్రామికవాడలో ‘భూగర్భ జలం’హాలాహలమైంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను చెరువులు, కుంటలు, నాలాల్లోకి వదులుతుండటంతో వ్యర్థ రసాయన జలాలు భూగర్భంలోకి ఇంకి పాతాళగంగ కలుషితమైంది. జీడిమెట్ల, కూకట్పల్లి, ఫతేనగర్ పారిశ్రామికవాడల నుంచి వచ్చే విషజలాలు హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే నాలాలో కలుస్తుంటాయి. ఈ నాలా సనత్‌నగర్ పారిశ్రామికవాడను ఆనుకుని ఉండడంతో భూగర్భ జలం విషపూరితమవుతోంది. ఇక్కడ భూగర్భ జలం రంగు మారి వస్తుండడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి ఉంది. ఫిల్టర్ నీళ్లు కొంటున్నాం.. బోరు నీళ్లు రంగు మారి వస్తున్నాయి. తాగేందుకు ఫిల్టర్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుంటాం. దీని ద్వారా మాకు అదనపు భారమే. ఒక్క జలమండలి నీరు మాత్రమే అయితే సరిపోవడం లేదు. – శివప్రసాద్, లోథా కాసాపారడిసో అపార్ట్మెంట్ -
మహిళా టెకీ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. 20 రోజుల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న పూర్ణిమా.. బుధవారం ఉదయం శవమై కనిపించింది. సనత్‌నగర్‌కు చెందిన పూర్ణిమ తండ్రి ఓ పారిశ్రామికవేత్త. ఆయన పరిశ్రమలో పనిచేస్తున్న దాసరి కార్తీక్ అనే యువకుడిని పూర్ణిమ ప్రేమించింది. అయితే వీరి ప్రేమను పూర్ణిమ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి 20 రోజుల క్రితమే కార్తిక్‌తో బయటకు వచ్చి వివాహం చేసుకుంది. కాగా, తమ కూతురును కార్తికే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కార్తిక్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ సనత్‌నగర్ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. -
మోతీ నగర్లో తప్పిన ప్రమాదం; అదుపులో తాత్కాలిక డ్రైవర్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని కొంత మేర ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి సిటీలో నడిపిన అనుభవం లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంగళవారం సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీ నగర్లో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారుపై దూసుకెళ్లింది. ఇన్నోవా డ్రైవర్ గమనించి అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొద్ది నిమిషాల ముందే ఇన్నోవా వాహనంలో స్కూలు పిల్లలను వారి ఇండ్ల దగ్గర వదిలేసి రావడం గమనార్హం. -
ఓపిక ఉంటేనే రండి!
అమీర్‌పేట: ప్రజా ప్రతినిధులు హెచ్చరించినా, స్టాండింగ్ కమిటీ సభ్యులు వారించినా సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అధికారుల తీరు మారడం లేదు. వారి ప్రవర్తనతో ఆస్పత్రికి వస్తున్న రోగులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా వైద్యసేవలు అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఒక రోజు సెలవుపెట్టి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. పరీక్షల కోసం నెలల తరబడి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి రావడంతో సకాలంలో వైద్యం అందటం లేదని ఈఎస్ఐ లబ్ధిదారులు వాపోతున్నారు. అత్యవసరంగా చేయాల్సిన ఎంఆర్ఐతో పాటు ఇతర స్కానింగ్‌లకు సైతం కనీసం మూడు నెలల కాలం ఆగాల్సి వస్తోందని, ఈలోగా రోగం ముదిరిపోయి ప్రాణాలమీదకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన వారికి రోగం నయం కాకముందే డిచ్చార్జి చేస్తున్నారు. అదేమని అడిగితే బెడ్లు ఖాళీ లేవని సమాధానం ఇస్తున్నారని ఓ రోగి బంధువు వాపోయాడు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్న పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో సైతం మందుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన స్టాండింగ్ కమిటీ సభ్యులకు రోగులు స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేయగా కమిటీ సభ్యులు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ఇక సెక్యూరిటీ సిబ్బంది రోగుల సహయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రి లోపలికి వెళ్లిన ప్రతిసారి జైల్లో విచారణ ఖైదీలను తనిఖీ చేసినట్టు చేస్తున్నారు. వాహనాలకు పార్కింగ్ లేదు.. ఆస్పత్రికి వచ్చే రోగుల వాహనాలకు ప్రాంగణంలో భద్రత లేకుండా పోతోంది. వైద్యం కోసం ఓపీ బ్లాక్‌కు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా మెడికల్ కళాశాల కింద ఉన్న డబుల్ సెల్లార్లో స్థలం కేటాయించారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు కూడా తమ వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేస్తుంటారు. అయితే తమ వాహనాలు ధ్వంసం చేస్తున్నారన్న సాకుతో రోగుల వాహనాలను సెల్లార్లోకి అనుమతించడం లేదు. ఓపీ బ్లాక్‌కు వచ్చే వాహనాలు సుమారు కిలో మీటరు దూరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సెల్లార్లోకి పంపిస్తున్నారు. దీంతో అక్కడి వరకు వెళ్లేందుకు ఓపికలేక చాలా మంది ఆస్పత్రి బయట రోడ్లపై నిలుపుతున్నారు. మెడికల్ కళాశాల సెల్లార్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మద్యం తాగి వాహనాలను ధ్వంసం చేయడంతో రోగుల వాహనాలను అనుమతించడం లేదని మెడికల్ కళాశాల డీన్ తెలిపారు. -
భార్యను రాడ్డుతో కొట్టి.. కొడుకును బకెట్లో ముంచి..
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడిని కడతేర్చాడో కసాయి భర్త. భార్యను ఇనపరాడ్డుతో కొట్టి, కొడుకుని బకెట్లో ముంచి చంపాడు. నిందితుడు జింకలవాడకు చెందిన రాజేశ్‌గా గుర్తించారు.రాజేష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని దేవారియా గ్రామంగా గుర్తించారు. బతుకు తెరువుకోసం యూపి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజేష్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మేడ్చల్, సనత్‌నగర్‌లో కేటీఆర్ రోడ్‌షో
-
‘సికింద్రబాద్ నుంచి పోటీ చేయను’
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనత్‌నగర్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే సికింద్రాబాద్ టికెట్ టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే తాను మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇదే విషయాన్ని అధిష్టానానికి తేల్చి చెప్పానని వివరించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని.. సనత్‌నగర్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన లేదన్నారు. అయితే సనత్‌నగర్ టికెట్‌పై కాంగ్రెస్ అధిష్టానం మర్రికి హామీ ఇచ్చిందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. -
నేను గెలవనని ఉత్తమ్ వాదించడం ఆశ్చర్యానికి గురిచేసింది
-
కాంతారావుగా అఖిల్ సన్ని
సనత్‌నగర్ రంగారెడ్డి : కాంతారావు జీవిత విశేషాలతో నిర్మిస్తున్న ‘అనగనగా..ఓ రాకుమారుడు’ చిత్రంలో కాంతారావు పాత్రకు నూతన నటుడు అఖిల్ సన్నీని ఎంపిక చేసినట్లు దర్శకుడు పీసీ ఆదిత్య తెలిపారు. కాంతారావు విభిన్న పాత్రల్లో పోషించి రాణించారని, ఈ పాత్రకు అన్నివిధాలా సరిపోయిన అఖిల్ సన్నీని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం పాట రికార్డింగ్ జరుగుతుందన్నారు. త్వరలోనే హీరో హీరోయిన్లతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
సనత్‌నగర్ పీఎస్‌లో లాకప్ డెత్?
హైదరాబాద్ : దొంగతనం కేసులో విచారణకు తీసుకొచ్చిన నిందితుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన బుధవారం సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా మరోవైపు వారు కొట్టిన దెబ్బలతోనే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవున్నాయి. రామంతాపూర్‌కు చెందిన కూలీ ప్రేమ్‌చంద్ (37)ను ఎర్రగడ్డ బజాజ్ ఆటో ఫైనాన్స్ ఏజెంట్లు వాహనాలు, ఈఎంఐల రికవరీ కోసం తీసుకుని వెళుతుంటారు. ఇదేక్రమంలో వారంక్రితం ఓ ఏజెంట్ రికవరీ అయిన రూ.2లక్షలను బజాజ్ ఆఫీసులో చెల్లించాల్సిందిగా ప్రేమ్‌చంద్‌కు ఇచ్చాడు. ప్రేమ్‌చంద్ ఆ డబ్బును ఇవ్వకుండా పరారయ్యాడు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు భువనగిరిలో దాచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో మంగళవారం పోలీసులు అతడిని భువనగిరి తీసుకుని వెళ్లగా అక్కడ డబ్బు దొరకలేదు. అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలోనే నిందితుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దెబ్బలతోనే మరణించాడా? నగదు రికవరీ కోసం పోలీసులు ప్రేమ్‌చంద్‌పై థర్డ్ డిగ్రీని ప్రయోగించడం వల్లే మరణించి ఉండొచ్చని, అందువల్లే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్ఎస్ బ్రదర్స్ గోదాంలో భారీ ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సనత్‌నగర్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం సమాచారం అందుకుని సంఘటనాస్థలికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదం వల్ల గోదాంలో ఉన్న సరుకు మొత్తం కాలి బూడిద అయింది. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. -
'పాత గొడవలతోనే చంపేశాం'
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ నెల 16వ తేదీన సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సాజిద్ అనే మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పాత గొడవల కారణంగా మద్యం మత్తులో వల్లభనేని శ్రీనివాసరావును చంపినట్టు పోలీసులు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. కాగా స్థానిక నాయకులతో శ్రీనివాసరావు గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టి హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. -
సనత్‌నగర్‌లో టీఆర్ఎస్ నేత దారుణ హత్య
-
సనత్‌నగర్‌లో టీఆర్ఎస్ నేత దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీం, పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కాగావల్లభనేని శ్రీనివాసరావు హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే స్థానిక టీఆర్ఎస్ నాయకులతో ఆయనకు గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో టీఆర్ఎస్ పేరుతో విజయనగరం జిల్లా బొబ్బిలిలో కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వల్లభనేని శ్రీనివాసరావు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అలాగే విద్యావిధానంపై సమూలమైన మార్పులు తీసుకురావాలంటూ వల్లభనేని శ్రీనివాసరావు చాలాకాలం నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన వీసీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. -
ఆ యాంకర్,పోలీసులు నన్ను వేధిస్తున్నారు
-
మాజీ పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉండే రిటైర్డు అడిషనల్ ఎస్పీ హరీష్చంద్ర కుటుంబసభ్యులతో సహా ఊరికెళ్లారు. ఇదే అదనుగా ఇంట్లోకి చొరబడిన దుండగులు 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, చీరలు దోచుకెళ్లినట్టు సమాచారం. గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హరీష్ చంద్రకు సమాచారం అందించారు. బాధితులు వస్తేనే ఎంత సొత్తు చోరీ జరిగిందో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. -
ఉప ఎన్నికకు వెళ్దామా..
-మున్సిపల్స్ తేలటంతో.. ఉప ఎన్నికపై టీఆర్ఎస్లో చర్చ -సనత్‌నగర్‌లో మంత్రులు కేటీఆర్, తలసాని పర్యటనలు -తలసాని రాజీనామా ఆమోదిస్తే.. అదేబాటలో మరో ముగ్గురు ఎంఎల్ఏలు సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్స్ తెలిసిపోయింది. నగర జనం అధికార టీఆర్ఎస్కు వెంట నడవటంతో అధికార టీఆర్ఎస్లో కొత్త చర్చకు తెర లేచింది. టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికకు సిద్ధమయ్యే దిశగా ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆ దిశగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీబస్తీతోపాటు బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే గ్రేటర్లో పదహారు శాసనసభ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచిన టీఆర్ఎస్ సనత్‌నగర్‌లో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ వద్ద ఉన్న రాజీనామా అంశం తెరమీదకు వచ్చే అవకాశం ఉందని... దాంతో ఓ వేళ జరిగితే ఇదే స్పూర్తితో పనిచేయాలని క్యాడర్‌కు ఇప్పటికే సాంకేతాలు వెళ్లినట్లు సమాచారం. తలసానితో పాటు..ఆ ముగ్గురివి కూడా ఒక వేళ సనత్‌నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.... దీనితో పాటు కూకట్పల్లి, మహేశ్వరం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ టీఆర్ఎస్లోని ముఖ్య నేతల్లో జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా కూకట్పల్లి నుండి మాధవరం కృష్ణారావు, మహేశ్వరం నుండి తీగల కృష్ణారెడ్డి, కంటోన్మెంట్ నుంచి సాయన్న విజయం సాధించారు. అనంతరం వారు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో కృష్ణారావుకు 2014లో ఎంఎల్ఏగా 43186 ఓట్ల మెజారిటీ వస్తే, తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోకజవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ 46014 ఓట్లు. అంటే 2014తో పోలిస్తే అదనంగా 2828 ఓట్లు అధికం. ఇదే సనత్‌నగర్‌కు వచ్చే సరికి 2014లో తలసానికి 27,461 ఓట్ల మెజారిటీ రాగా, తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మొత్తం 59,784 ఓట్లు వచ్చాయి. ఇవి టీడీపీ,బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే సుమారు 25916 ఓట్లు అధికం. ఇదే పరిస్థితి మహేశ్వరం నియోజకవర్గంతో పాటు, కంటోన్మెంట్‌లోనూ కనిపించింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహిస్తున్నామన్న అపవాదు లేకుండా ఉండేందుకు తలసానితో పాటు మిగిలిన చోట్ల కూడా ఉపఎన్నికకు వెళ్లే అవకాశాన్ని టీఆర్ఎస్ సీరియస్‌గానే పరిశీలించే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు సూత్రప్రాయంగా అంగీకరించారు. శనివారం రాత్రి సాక్షితో సదరు నేత మాట్లాడుతూ ప్రజలంతా మా పక్షమే ఉన్నారని గ్రేటర్ ఎన్నిక ద్వారా రుజువు అయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. అందుకే ఉపఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అయితే తరచూ ఎన్నికలకు తమ అధినేత, సీఎం కేసీఆర్ విముఖత చూపిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలడంతో ... ఉపఎన్నిక అవసరం ఏ మేరకు ఉంటుందన్న అంశాన్నీ కేసీఆర్ పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉందని సదరు టీఆర్ఎస్ ముఖ్యనేత అన్నారు. -
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ స్వరాజ్య నగర్లో మంగళవారం తెల్లవారుజామున స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే సోమసుందర్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. వ్యాపారంలో విభేదాలు రావడంతో భాగస్వామే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఓటును కూడా అకారణంగా తొలగించరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో భారీగా ఓట్లు తొలగించారనేది అవాస్తవమని, 2014 కంటే సనత్ నగర్ లో ఇప్పుడు 7వేల ఓట్లు పెరిగాయన్నారు. ఓట్లు తొలగించారంటూ నిరాధారంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయటం తగదన్నారు. ఓట్లు తొలగించినట్లు తమకు ఇప్పటివరకూ ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని తలసాని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బుద్ధిలేని మాటలు చెబుతున్నారని, చౌకబారు రాజకీయాలతో అనవసర ప్రకటనలు చేస్తున్నారని తలసాని మండిపడ్డారు. ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదన్నారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ధర్నాల పేరుతో కాంగ్రెస్, తెలంగాణ టీడీపీల కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని తలసాని వ్యాఖ్యానించారు. -
అర్ధరాత్రి దుండగుల బీభత్సం
-
సెక్షన్-8 వద్దంటూ ఆందోళన
సనత్ నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతిభద్రతల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, అలాంటప్పుడు సెక్షన్-8ను ఎందుకు తెరమీదకు తీసుకు వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. 'సెక్షన్-8 మాకొద్దు' అంటూ ప్లకార్డులు చేతబూని సనత్‌నగర్‌లో బుధవారం టీఆర్ఎస్ నేత వై.బాలరాజ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసు ఉదంతాన్ని పక్కదోవ పట్టించడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే సెక్షన్-8 జపం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రులు, మిగతా ప్రాంతాల వారనే తేడా లేకుండా అందరి సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సెటిలర్స్‌తో ఎంతో సఖ్యతగా ఉంటారనడానికి సనత్‌నగర్ ఒక ఉదాహరణ అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య తారతమ్యం అనేది రాకుండా సెటిలర్స్ కూడా తాము ఇక్కడ వారమే అనే భావనను వారిలో తీసుకువచ్చి వారికి కావాల్సిన వసతులను కల్పించడంలో ముందువరుసలో ఉన్నారని తెలిపారు. -
విజయవాడ సనత్‌నగర్‌లో ఉద్రిక్తత!
-
ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: తలసాని
హైదరాబాద్ : తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రబెల్లి దయాకరరావు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తో ఎర్రబెల్లి రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో తెలపాలని తలసాని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసమే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు వద్ద డబ్బులు తీసుకుని పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను సనత్‌నగర్‌లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాగా టీడీపీ తరపున సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత ఏడాది అక్టోబర్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. -
దంపతులను దూషించిన ట్రాఫిక్ సీఐ
-
నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
హైదరాబాద్ : సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట ఐడీహెచ్ కాలనీలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పరిశీలించారు. పనుల్లో ప్రగతిపై అధికారులతో శుక్రవారం మాట్లాడారు. నిర్మాణాలు చకచకా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేదల కోసం రూ.36 వేల కోట్ల ఖర్చుతో దాదాపు 400 ఇళ్లను నిర్మించటం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు. (బన్సీలాల్‌పేట) -
సనత్ నగర్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సనత్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నివాసంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వ్యభిచారం అనే మాట వినపడకుండా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. -
కార్ఖానాల అడ్డా
సిటీవాసులకు జాయ్‌ఫుల్ జర్నీని రుచి చూపించిన డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది ఇక్కడ్నుంచే.. ! ఇండియన్ ఆర్మీ కోసం శక్తిమాన్ ట్రక్స్ వెళ్లిందీ ఇక్కడి నుంచే..!1952లో స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్ రూపుదిద్దుకున్నదీ ఇక్కడే..! ఇవన్నీ శతాబ్దాల చరిత్ర మూటగట్టుకున్న భాగ్యనగరం నుంచి వెళ్లినవే. కళ్లు చెదిరే కట్టడాలకే కాదు.. శాస్త్ర సాంకేతికతలోనూ ఆ రోజుల్లోనే నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నిజాం ప్రభువుకు చెందిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఆవిష్కృతమైన అద్భుతాలకు సనత్ నగర్ ప్రాంతం కేంద్రంగా నిలిచింది. 1942లో ఇప్పటి ఓల్టాస్ ఉన్న ప్రాంతంలో నిజాం సైనికుల కోసం ప్రత్యేకంగా గన్స్ తయారు చేయించేవారు. ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకున్న టాటా-బిర్లా యాజమాన్యం ఆల్విన్ కంపెనీకి పురుడు పోసింది. 1948లో హైదరాబాద్ విలీనం తర్వాత సనత్‌నగర్ ప్రాంతంలోని అల్లావుద్దీన్ అండ్ కంపెనీకి చెందిన 408 ఎకరాల భూమిని రాష్ట్రపతి స్వాధీనం చేసుకున్నారు. అందులోని 150 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను కేంద్ర కార్మిక సంస్థ ఆహ్వానించింది. ఆ ప్రాంతానికే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా పేరు పెట్టారు. మొట్టమొదటి కార్మికశాఖ మంత్రి జగ్జీవన్‌రామ్ చేతుల మీదుగా ఈ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. ఆల్ ఇన్ ఆల్విన్ ఇండస్ట్రియల్ ఏరియాగా మారిన తర్వాత ఆల్విన్ తన ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచింది. శక్తిమాన్ ట్రక్స్, బస్సుల బాడీలు ఇక్కడే రూపొందించేవారు. ఏపీఎస్ఆర్టీసీ అనుబంధంగా 1963లో డబుల్ డెక్కర్ బస్సు డిజైన్ చేసి తయారు చేసింది కూడా ఇక్కడే. 1969లో ఈ కంపెనీని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1970-80 మధ్యకాలంలో ఆల్విన్ కంపెనీ రిఫ్రిజిరేటర్లు వరల్డ్ వైడ్‌గా పేరు సంపాదించాయి. 1990 తర్వాత నష్టాల బాట పట్టింది. దీన్ని అప్పటి ప్రభుత్వం వోల్టాస్ లిమిటెడ్‌కు అప్పగించింది. 1994లో ఇది పూర్తిగా ప్రైవేట్‌పరం అయింది. 2002 వరకు ఆల్విన్ మోడల్స్‌తోనే రిఫ్రిజిరేటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఆల్విన్‌కు సంబంధించిన ఉత్పత్తులన్నీ నిలిచిపోయాయి. మరెన్నో కంపెనీలు.. బెక్లెట్ హైలాం (హైలాం షీట్ల ఉత్పత్తి), ఫర్నిచర్ ఇండస్ట్రీ, దక్కన్ మెటల్ వర్క్స్, ఈసీఐఎల్, బీడీఎల్, చైన్ ఫ్యాక్టరీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బడా కంపెనీలు సనత్‌నగర్‌లో అడుగుపెట్టాయి. తర్వాత దక్కన్ మెటల్ వర్క్స్ ఆగ్రోమెక్ స్టీల్ పరిశ్రమగా మారింది. బీడీఎల్ చాంద్రాయణగుట్టకు, ఈసీఐఎల్ ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి తరలిపోయాయి. ఫార్మా కంపెనీలు హెటెరో డ్రగ్స్, నాట్కో రీసెర్చ్ సెంటర్, బ్రైట్ స్టార్ రబ్బర్, దివీస్, సిప్రా, గ్లాండ్ఫార్మా, ల్యాంకో వంటి బడా కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. వీటితో పాటు 200 వరకు బడా ఛోటా కంపెనీలు ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. జెకొస్లేవేకియన్ల అడ్డా.. నిజాం పాలన సమయంలో జెకొస్లేవేకియా దేశస్తులు విహారయాత్ర పేరిట నగరానికి వచ్చేవారు. వారి కోసం నిజాం పాలకులు ఆల్విన్ కంపెనీ ఎదురుగా ప్రత్యేకంగా 18 బంగ్లాలను నిర్మించి కేటాయించారు. వాటి స్థానంలో ఇప్పుడు అపార్ట్మెంట్లు వెలిశాయి. ఒకప్పుడు జెకొస్లేవేకియన్లకు పర్యాటక విడిదిగా ఉన్న ప్రాంతం కావడంతో ఆ ఏరియా జెక్ కాలనీగా నిలిచిపోయింది. సెకండ్ హ్యాండ్ మార్కెట్ సనత్‌నగర్ ప్రాంతంలో ప్రతి ఆదివారం సాగే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే ఫుల్ డిమాండ్ ఉండేది. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ మార్కెట్లో గుండుసూది నుంచి గునపాల వరకు అన్నీ పనిముట్లు లభించేవి. అప్పట్లో పదెకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ కొనసాగేది. ఇప్పుడు ఎర్రగడ్డ చౌరస్తా నుంచి సనత్‌నగర్ రోడ్డు వరకూ కొనసాగుతోంది. -
క్లాసులో విద్యార్థులు తెలుగు మాట్లాడారని ...
పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు తెలుగు మాట్లాడటమే నేరమైంది. తరగతి గదిలో తెలుగు మాట్లాడతారా అంటూ విద్యార్థులకు టీచర్ పెద్ద క్లాస్ తీసుకుంది. తెలుగు మాట్లాడితే తప్పేముంది అని సదరు విద్యార్థులు టీచర్‌ను ప్రశ్నించారు. అంతే టీచర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. దాదాపు 40 మంది విద్యార్థులను చితకబాది పారేసింది. ఆ సంఘటన మంగళవారం హైదరాబాద్ సనత్‌నగర్ లోని డాన్ బాస్కో స్కూల్లో చోటు చేసుకుంది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు చేరుకున్నారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
పెళ్లి పీటల మీద అరెస్టైన పెళ్లి కొడుకు
కట్నం కోసం రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్దుడు. ఆ విషయం తెలిసన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పెళ్లికోడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. రవిశంకర్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే అతడు అదనపు కట్నం కావాలని నిరంతరం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఆ క్రమంలో ఆమె పుట్టింటి నుంచి కొంత నగదు తీసుకువచ్చి భర్త ఇచ్చింది. ఆ నగదు అయి పోగానే మళ్లీ నగదు కావాలని ఆమెను వేధించసాగాడు. తన తల్లిదండ్రులకు నగదు ఇచ్చేంత స్థోమత లేదని ఆమె భర్తకు వెళ్లడించింది. దాంతో రవిశంకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆ విషయాన్ని అతడు గోప్యంగా ఉంచాడు. అయితే ఆ విషయాన్ని రవిశంకర్ భార్య తెలుసుకుంది. దాంతో ఆమె సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. శనివారం సనత్‌నగర్‌లో రెండో వివాహం చేసుకుంటున్న రవిశంకర్‌ను పెళ్లి పీటల మీద అరెస్ట్ చేయించింది. దీంతో పెళ్లి కొడుకును సనత్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సనత్‌నగర్ జనభేరీలో షర్మిళ ప్రసంగం