సదస్సులో మాట్లాడుతున్న వాటర్‌వర్క్స్ ఎండీ దానకిషోర్
సనత్‌నగర్: రాబోయే 40 ఏళ్లు హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఎలాంటి కొదవ ఉండదని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఇన్‌ఫ్రా సమ్మిట్–2022’ సదస్సు శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ‘ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాల్టీ–ప్రాస్పెక్టస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన దానకిషోర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులలో పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారానే జరుగుతున్నాయన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనతోనే రియాల్టీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆక్స్‌ఫర్డ్ నగరాల నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భారతదేశంలో 17 నగరాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్ 85 బిలియన్ల జీడీపీని అధిగమించగలదన్నారు. సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, నీటి ప్రాజెక్టులు, మెట్రోరైల్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలపరంగా తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.
సమారు 30 ఏళ్లుగా 80 శాతం ప్రయాణికులు రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారని, అయితే ఇప్పుడు రోడ్డు నెట్‌వర్క్, మారుతున్న మౌలిక సదుపాయాల రంగం కారణంగా 70 శాతం మంది రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీఐఐ చైర్మన్ వాగీష్‌దీక్షిత్, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, షేక్ సమీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment